రఫ్ఫాడించేసిన రాప్తాడు "సిద్ధం"... నెట్టింట రికార్డ్ ఇదే!
ఇప్పటివరకూ జరిగిన సిద్ధం సభలు.. ఒకదానికి మించి మరొకటి అన్నట్లుగా జరగగా.. తాజాగా రాప్తాడు రఫ్ఫాడించేసిందనే చెప్పాలి.
By: Tupaki Desk | 18 Feb 2024 11:50 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం సీరియస్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. "సిద్ధం" అంటూ వైఎస్ జగన్ చేస్తున్న ఎన్నికల ప్రచారం కార్యక్రమాలను తరలిస్తున్న జన సందోహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ జరిగిన సిద్ధం సభలు.. ఒకదానికి మించి మరొకటి అన్నట్లుగా జరగగా.. తాజాగా రాప్తాడు రఫ్ఫాడించేసిందనే చెప్పాలి.
అవును... రాప్తాడులో జరిగిన "సిద్ధం" బహిరంగ సభ న భూతో న భవిష్యతి అన్నట్లుగా సాగిందనే చర్చ రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ప్రత్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేసే రీతిలో అన్నట్లుగా రాప్తాడులో జరిగిన సిద్ధం కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. దీంతో రాప్తాడులోని "సిద్ధం" సభకు తరలి వచ్చిన జనసందోహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోల కింద... "నేల ఈనిందా... ఆకాశం చిల్లు పడిందా..."? అని ఒకరు కామెంట్ చేస్తుంటే... ఇది "జగన్ అభిమానుల విస్పోటనం" అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. రెండు కళ్లూ చాలని జనాభా అని చెప్పినా అతిశయోక్తి కాదు.. కెమెరా కన్ను కూడా కవర్ చేయలేనంతగా జన ప్రవాహం రాప్తాడువైపు మళ్లిందని చెప్పినా తప్పులేదు అన్నట్లుగా కామెంట్లు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి రాప్తాడులో జరిగే "సిద్ధం" కార్యక్రమానికి సంబంధించిన అప్ డేట్స్ తోనే సోషల్ మీడియా షేక్ అవ్వడం మొదలుపెట్టింది. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో "సిద్ధం-3" కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి భారీస్థాయిలో వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన జనాలు ఆ ప్రాంతాన్ని తాకిన జన సునామీకి సంబంధించిన ఫోటోలు తీసి, అప్ లోడ్ చేయడంతో ట్విట్టర్, ఫేస్ బుక్ లు "సిద్ధం" సభ ఫోటోలతో నిండిపోయాయి. మరోవైపు ట్విట్టర్ లో "సిద్ధం హ్యాష్ ట్యాగ్" దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ కార్యక్రమానికి జగన్ హాజరుకాకముందే "సిద్ధం" అప్ డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి!
ఈ సందర్భంగా నెటిజన్లు పోస్ట్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా... "జగనన్న రంగంలోకి దిగితే గ్రౌండ్ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా షేక్ కన్ ఫాం" అని ఒక అభిమాని చెప్పగా... "ఆన్ లైన్ ఆర్ ఆఫ్ లైన్ వైఎస్ జగన్ ఈజ్ రోరింగ్ లైన్" అని మరో అభిమాని అన్నాడు. ఏది ఏమైనా... తాజాగా రాప్తాడులో జరిగిన సభ మాత్రం... రాయలసీమ చరిత్రలోనే భారీ బహిరంగ సభ అని అంటున్నారు పరిశీలకులు.