జగన్ 'స్టేటస్ కో'.. విషయం ఇదే..!
ఈ క్రమంలో అసలు జగన్ మనసులో ఏముందనేది చర్చ. ఇప్పటికిప్పుడు జగన్ ఏ పక్షమూ తీసుకోరు. అంటే.. ఏ కూటమికీ మద్దతు ఇవ్వరు.
By: Tupaki Desk | 1 Aug 2024 6:19 AM GMTతన పార్టీ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఏ విధంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు? ఢిల్లీలో ధర్నా తర్వాత.. అనేక అంశాలు చర్చకు వచ్చాయి. అయితే.. ఏ విషయం పైనా జగన్ క్లారిటీ ఇవ్వలేదు. ఆయన ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే లా కనిపిస్తున్నారని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇండియా కూటమే ఆయనను కలుపుకొనేలా ఉందని అంటున్నా రు. కానీ, ఈ విషయాన్ని జగన్ స్పష్టం చేయడం లేదు.
ఈ పరిణామాలను గమనిస్తే.. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏంటనే విషయంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం జగన్ కేంద్రంలోని ఏ కూటమికీ మద్దతు ఇవ్వడం లేదు. ఎన్డీయే కూటమికి కూడా.. అంశాల వారీగా మద్ద తు అని ప్రకటించినా.. దీనిపై వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. ఇండియా కూటమిలోని నేతలతో ఆయన రాసుకుని... పూసుకుని తిరుగుతున్నారు. ఈ పరిణామాలతోనే జగన్ వ్యవహారం.. హాట్ టాపిక్ అయింది.
ఈ క్రమంలో అసలు జగన్ మనసులో ఏముందనేది చర్చ. ఇప్పటికిప్పుడు జగన్ ఏ పక్షమూ తీసుకోరు. అంటే.. ఏ కూటమికీ మద్దతు ఇవ్వరు. కేవలం ఇస్తున్నట్టుగా.. నటిస్తారు అంతే! రాష్ట్రంలో తనను తాను కాపాడుకోవాల్సి ఉంది. పైగా.. పార్టీని కాపాడుకోవాలి. ఇదే స్టేటస్ కో! దీని ప్రకారమే ఆయన అడుగులు వేయనున్నారు. అంటే.. ప్రస్తుతం వైసీపీ ఘోరంగా ఓడిపోయింది దీంతో వచ్చే రెండేళ్లలో పార్టీని బిల్డప్ చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఇది.. ఆయన రాజకీయంగా యాక్టివ్‌గా ఉంటేనే సాధ్యమవుతుంది.
అలా కాకుండా.. ఇండియా కూటమికి మద్దతిస్తే.. తనపై కేసులు పుంజుకుంటాయి. ఇది ప్రమాదం. మరి అలాంటప్పుడు.. ఇండియా కూటమి నేతలతో ఆయన రాసుకుని తిరగడం ఎందుకు? అంటే.. ఎన్డీయేకి వార్నింగ్ ఇచ్చేందుకే. తనకు ఆప్షన్లు ఉన్నాయని.. వారికి సంకేతాలు పంపిస్తున్నారు. ఫలితంగా.. తన జోలికి చంద్రబాబు, పవన్ సహా బీజేపీ నేతలు రాకుండా చేసుకోవడంతోపాటు.. వైసీపీ నుంచి ఎవరినీ చేర్చుకునే సాహసం కూడా చేయకుండా ఉండేందుకే. మొత్తంగా ఇప్పుడు జగన్ స్టేటస్ కో పాటించడం ద్వారా.. వచ్చే రోజుల్లో పార్టీని పుంజుకునేలా చేసి..ఎన్నికల సమయానికి మాత్రం నిర్ణయం తీసుకుంటారనేది వైసీపీవర్గాల మాట కూడా!!