Begin typing your search above and press return to search.

వైసీపీ ముందస్తు చూపు : సోషల్ మీడియాతో కొత్త ఒప్పందాలు ?

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోమని పెద్దవాళ్ళ సలహా.

By:  Tupaki Desk   |   13 Oct 2024 3:30 PM GMT
వైసీపీ ముందస్తు చూపు : సోషల్ మీడియాతో కొత్త ఒప్పందాలు ?
X

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోమని పెద్దవాళ్ళ సలహా. అదే నిజం కూడా. పోయిన చోటను వెతుక్కుంటేనే లాభం ఉంటుంది. వైసీపీ దక్కించుకున్నదీ అక్కడే పోగొట్టుకున్నదీ అక్కడే. దాంతో ఇపుడు అక్కడే తాను తిరిగి పోందాలని చూస్తోంది. అదే సోషల్ మీడియా. సోషల్ మీడియా బలం వైసీపీకి 2019 ఎన్నికల్లో బాగా యాడ్ అయింది.

అప్పటి టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం జనాలకు కనెక్ట్ అయింది. అలాగే వైసీపీ మీద పాజిటివ్ ప్రచారం కూడా కలసి వచ్చింది. దాంతో 151 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టింది. ఇక 2019 నుంది 2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వం వీక్ అయింది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున గట్టిగా ప్రచారం సాగలేదు. దాంతో వైసీపీ మీద కొన్ని నిజాలు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.

అదే సమయంలో కొన్ని అబద్ధాలు నిజాలుగా చలామణీ అయినా గట్టిగా ఖండించలేని స్థితి ఏర్పడింది. మొత్తానికి చేతులు కాలాయి. 11 సీట్లకే పరిమితం అయింది వైసీపీ. ఈ దెబ్బతో మళ్లీ మూలాలు గుర్తుకు వచ్చాయి అని అంటున్నారు.

ఒక వైపు పార్టీ క్యాడర్ ని దగ్గరకు తీయాలని ఆలోచిస్తున్నారు. అదే టైం లో పార్టీకి బలం రావాలీ అంటే సోషల్ మీడియాను కూడా బలంపేతం చేయాలని ఆలోచిస్తున్నారు. కేవలం వైసీపీ తనకు అనుకూలంగా గ్రాఫ్ పెరిగేలా చేసుకునేందుకు సోషల్ మీడియా యూ ట్యూబుల ద్వారా ప్రచారం కోసమే భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇది పార్టీకి ఇపుడు అత్యవసరం అని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ తెలంగాణాలోని బీఆర్ఎస్ ని అనుసరిస్తోంది అని అంటున్నారు. బీఆర్ఎస్ కూడా 2023 ఎన్నికల్లో ఓడింది. ఏడాది దగ్గరపడుతోంది కానీ పార్టీలో కదలిక పెద్దగా లేదని అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ అధినాయకత్వం సోషల్ మీడియా వింగ్ ని గట్టి పరచాలని చూస్తోంది.

ఈ మేరకు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటోందని అంతున్నారు. వంద వెబ్ సైట్లు అలాగే పెద్ద ఎత్తున యూట్యూబ్ చానల్స్ తో ఒప్పదం చేసుకుంటోందని చెబుతున్నారు. దాని ద్వారా బీఆర్ఎస్ అనుకూల ప్రచారాన్ని మోత మోగిస్తూనే అధికార కాంగ్రెస్ మీద వ్యతిరేక ప్రచారాన్ని షురూ చేయనుంది అని అంటున్నారు.

సరిగ్గా ఈ విధంగానే వైసీపీ కూడా ఏపీలో చేయబోతోంది అని అంటున్నారు. వైసీపీ కూడా తనకు అనుకూలంగా వెబ్ సైట్లను యూ ట్యూబ్ చానళ్ళను మార్చుకోవాలని చూస్తోంది అని అంటున్నారు వైసీపీ చెప్పే మాట జనంలోకి పోవాలి. అలాగే ప్రభుత్వం చేసే తప్పులు ఒకటికి పదిసార్లు గట్టిగా వినిపించాలి. ఈ విధానంతోనే సోషల్ మీడియాను బలోపేతం చేయాలని వైసీపీ నిర్ణయించిందని అంటున్నారు.

జగన్ ఇక వచ్చే ఏడాదిలో మార్చి తరువాత జనంలోకి వెళ్తారు అని అంటున్నారు. అప్పటికి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతను కూడగడితే జగన్ చెప్పే మాటలను జనాలు వినే అవకాశం ఉందని అలాగే జనాల మైండ్ సెట్ కూడా ఎంతో కొంత మారే అవకాశం ఉందని అంటున్నారు

అయితే సోషల్ మీడియా విషయంలో టీడీపీ కూటమి ఇప్పటికే స్ట్రాంగ్ గా ఉంది. ప్రభుత్వం చేసిన మంచిని బలంగా చెప్పుకోవడం వైసీపీ మీద విమర్శలు చేస్తూ వాటిని ప్రజలలో చర్చకు పెట్టడంలో సక్సెస్ అయింది. అందుకే గడచిన నాలుగు నెలలుగా చూస్తే వైసీపీ గ్రాఫ్ పెద్దగా పెరగలేదని అంటున్నారు. మరి టీడీపీ వ్యూహాలను ఆ పార్టీ సోషల్ మీడియా బలాన్ని బలంగాన్ని ఎదురొడ్డి వైసీపీ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాల్సి ఉంది.