Begin typing your search above and press return to search.

వైసీపీలో వారంతా రిటర్న్...ఎవరి సీటు వారిదే !

అనుభవం అయితే కానీ తత్వం బోధపడదని పెద్దలు అంటారు.

By:  Tupaki Desk   |   4 Nov 2024 1:30 AM GMT
వైసీపీలో వారంతా రిటర్న్...ఎవరి సీటు వారిదే !
X

అనుభవం అయితే కానీ తత్వం బోధపడదని పెద్దలు అంటారు. వైసీపీలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీ ఇపుడు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటోంది. పూర్తిగా పోస్ట్ మార్టం టాప్ టూ బాటమ్ చేస్తోంది. ఒక విధంగా చూస్తే దిద్దుబాటు చర్యలకు దిగుతోంది.

గతంలో చేసిన తప్పుడు ప్రయోగాలకు స్వస్గ్తి అంటోంది. ఇంతకీ వైసీపీ చేసింది ఏంటి, ఏమి చేయబోతోంది అంటే ఇది ఇంట్రెస్టింగ్ మ్యాటరే మరి. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. అలా ఇలా కాదు ఏకంగా 151 సీట్ల భారీ మెజారిటీతో.

దాంతో అధికారం ఒక రేంజిలో దక్కేసింది. అయిదేళ్ళూ వైసీపీ హై కమాండ్ అనుకున్నది అనుకున్నట్లే అయింది. దాంతో 2024 లఒ ఒక పెద్ద ప్రయోగాన్ని చేసింది. అది ఏంటి అంటే మొత్తం 80కి పైగా అసెంబ్లీ సీట్లలో కొత్త వారిని దించడం. అంటే ఆ కొత్త వారు ఎవరో కాదు వేరే నియోజకవర్గాల నుంచి తెచ్చి అక్కడ వారిని పోటీకి పెట్టారు అన్న మాట. అలా చూస్తే వారు పాత నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడో విసిరేసినట్లు గా ఉన్న కొత్త సీట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యారు.

ఎన్నికల ముందు ఈ ట్రాన్స్ ఫర్లు అన్నీ బెడిసికొట్టాయి. ఎవరికీ పట్టు దక్కకుండా పోయింది. చివరికి ఘోరంగా ఓటమి పాలు అయ్యారు. దీంతో వైసీపీ అధినాయకత్వం ఇపుడు మనసు మార్చుకుంది. పాత వారిని వారి సొంత నియోజకవరాలను పంపిస్తోంది. 2019లో భారీ మెజారిటీతో గెలిచిన వారిని తిరిగి ఆయా సీట్లే కట్టబెడుతోంది.

వారు అయిదేళ్ళుగా పాతుకుపోయారు, క్యాడర్ తో వారికి మంచి అనుబంధం ఉంది. అందువల్ల వారికే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తే వారు చక్కగా పనిచేసుకోగలుగుతారని అది అంతిమంగా వైసీపీకి ఉపయోగపడుతుందని ఆలోచిస్తోంది.

దీంతో పాత వారు అంతా ఫుల్ హ్యాపీస్ అని అంటున్నారు. నిజానికి వైసీపీ అటు నుంచి ఇటూ అంటూ టోటల్ గా మార్చేసినా ఎవరూ కూడా ఎన్నికల్లో ఓడిన తరువాత తమను ట్రాన్స్ ఫర్ చేసిన సీట్లలోకి వెళ్లలేదు. దాంతో అక్కడ పార్టీ యాక్టివిటీ పూర్తిగా ఆగిపోయింది.

ఇక ఏమి చేయాలో కూడా ఎవరికీ అర్ధం కాని పరిస్థితి అని అంటున్నారు. ఇపుడు వైసీపీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయంతో వారు ఆయా చోట్ల తమ సత్తా చాటేందుకు ఉత్సాహం చూపుతారు అని అంటున్నారు. ఇపుడు వారి పనితీరు బేరీజు వేసుకుని ఎన్నికల వేళకు ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే అపుడు చూసుకోవచ్చు అన్నది హై కమాండ్ ఆలోచనగా ఉందిట. సో ఇపుడు అంతా ఎవరి సీటు వారిదే అని తెగ హుషార్ అవుతున్నారుట.

వైసీపీ జిల్లాలలో కొన్ని చోట్ల అధ్యక్షులను పెండింగులో పెట్టింది. ముందు ఆ నియామకాలు పూర్తి చేసిన తరువాత వరసబెట్టి నియోజకవర్గాల ఇంచార్జిలను ప్రకటిస్తారు అని అంటున్నారు. వీరంతా దాదాపుగా 2019 నుంచి 2024 మధ్యలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే ఆయా సీట్లలో ఉంటారు అని అంటున్నారు.