Begin typing your search above and press return to search.

వారి సేవల కోసం వంద కోట్లు ఖర్చు చేస్తున్న వైసీపీ

అయితే 2019లో ఐప్యాక్ టీం కి ప్రశాంత్ కిశోర్ లీడర్ గా ఉంటే ఆ తరువాత రిషి దానికి నాయకత్వం వహించారు. దాంతో తేడా కొట్టింది.

By:  Tupaki Desk   |   11 Nov 2024 4:12 AM GMT
వారి సేవల కోసం వంద కోట్లు ఖర్చు చేస్తున్న వైసీపీ
X

వైసీపీ 2019లో గెలిచింది. అపుడు ఐ ప్యాక్ టీం సేవల వల్లనే అదంతా జరిగింది అన్న భావనతో అధినేత జగన్ తాను అధికారంలోకి వచ్చినా కూడా ఐప్యాక్ టీం ని కంటిన్యూ చేశారు. అయిదేళ్ల పాటు పూర్తిగా వారినే నమ్మారు. అయితే 2019లో ఐప్యాక్ టీం కి ప్రశాంత్ కిశోర్ లీడర్ గా ఉంటే ఆ తరువాత రిషి దానికి నాయకత్వం వహించారు. దాంతో తేడా కొట్టింది.

అధికారంలో ఉన్న వైసీపీని మళ్లీ గెలిపించ లేకపోయింది రిషి నాయకత్వంలోని ఐప్యాక్ టీం. అయితే ఇక వారి సేవలు చాలు అని వద్దు అని వైసీపీ అనుకుంటుందని అంతా భావించారు. కానీ తిరిగి వారి సేవలనే వైసీపీ కోరుకుంటోంది. దాంతో వైసీపీ కోసం ఐప్యాక్ రీ ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే గత అయిదు నెలలలోనూ మరో పార్టీని కానీ ప్రాజెక్ట్ ని కానీ టేకప్ చేయని ఐ ప్యాక్ టీం వైసీపీయే బెటర్ అనుకుని వెనక్కి వచ్చేసింది.

ఇక అయిదేళ్ల పాటు తమతో ట్రావెల్ చేశారు కాబట్టి వారికి రాజకీయంగా సామాజికంగా అన్ని విషయాల మీద అవగాహన ఉంటుందని వారితోనే కలసి ముందుకు వెళ్తేనే మంచి రిజల్ట్ ఈసారి వస్తుందని భావించింది వైసీపీ. మొత్తానికి ఐప్యాక్ టీం సేవల్తో తిరిగి సిద్ధం అయిపోయింది.

ఇంతకీ ఐ ప్యాక్ టీం కోసం వారి సేవల కోసం వైసీపీ ఎంత ఖర్చు చేయబోతోంది అంటే ఏడాదికి 24 కోట్లు వంతున రానున్న నాలుగేళ్ల కాలానికి వంద కోట్లు ఖర్చు చేయబోతోంది అని అంటున్నారు. నెలకు రెండు కోట్లు వంతున ఐప్యాక్ టీం కోసం పార్టీ వెచ్చించనుంది అని అంటున్నారు.

ఇక ఐ ప్యాక్ టీం తిరిగి రావడంతో వారితోనే ఇంక అన్నీ అన్నట్లుగా పార్టీ మళ్లీ అప్పగించనుంది అని అంటున్నారు. అంటే ఐ ప్యాక్ టీం వైసీపీ మొత్తం రాజకీయంలో తన వంతు సలహాలు సర్వీసులతో కీలకం కాబోతోంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే అయిదు నెలల టీడీపీ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారాన్ని జనంలోకి తీసుకుపోవడంలో కూడా ఐ ప్యాక్ ఇపుడు కొత్త నినాదాలు రచించి కొత్త విధానాలతో ముందుకు సాగేలా వైసీపీని గైడ్ చేస్తుంది అని అంటున్నారు.

ఏది ఏమైతేనేమి ఐ ప్యాక్ కి వైసీపీయే కావాల్సి వచ్చింది. వైసీపీకి ఐ ప్యాక్ కంటే వేరేదీ కనిపించలేదు అని అంటున్నారు. సో అలా ఈ బంధం వచ్చే ఎన్నికల దాకా కొనసాగుతుందని అంటున్నారు. గతసారి వైసీపీని ఓటమి పాలు చేసిన ఐ ప్యాక్ వ్యూహాలు సలహాలు ఇపుడు గెలుపు తీరం వైపు నడిపిస్తాయా అంటే ఏమో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ బంధం విడదీయరానిది అని పార్టీ లోపలా బయటా గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి మరి.