ఇలా అయితే.. ఒక్కరు కూడా మిగలరు జగన్..!
పార్టీని నిలబెట్టుకోవడం.. రాజకీయ నేతల ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో కార్యకర్తలకు పార్టీల్లో ఉండే స్థాన మే కీలకం. ఈ విషయాన్ని 43 ఏళ్లు పూర్తిచేసుకున్న టీడీపీని గమనిస్తే.. ఇట్టే అర్థమవుతుంది.
By: Tupaki Desk | 31 March 2025 4:21 AMపార్టీని నిలబెట్టుకోవడం.. రాజకీయ నేతల ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో కార్యకర్తలకు పార్టీల్లో ఉండే స్థాన మే కీలకం. ఈ విషయాన్ని 43 ఏళ్లు పూర్తిచేసుకున్న టీడీపీని గమనిస్తే.. ఇట్టే అర్థమవుతుంది. కార్యకర్తల కు ఈ పార్టీ ఇస్తున్న భరోసా మరేపార్టీ కూడా ఇవ్వడం లేదంటే అతిశయోక్తికాదు. పార్టీ విపక్షంలో ఉన్నా.. స్వపక్షంలో ఉన్నా.. కార్యకర్తలకు అండగా ఉంటోంది. ఈ కారణంగానే.. ఒకానొక దశలో పార్టీ ఇక, కోలుకో వడం కష్టం అనుకున్న టైంలో కార్యకర్తలు ముందుండి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయ త్నించారు.
ఇది టీడీపీకి ఎంతో మేలు చేసిన వ్యవహారం. ఇక, వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినప్పుడు కూడా స్వయంగా టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు వారిని పరామర్శించారు. కొందరు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి మరీ వారిని ఆప్యాయంగా పలకరించారు. ఇక, కార్యకర్తలపై దాడులు జరిగినప్పుడు .. న్యాయ పోరాటానికి ఆయన స్వయంగా న్యాయవాదులను సమకూర్చారు. వారి కోసం రోడ్డెక్కారు. అందు కే.. టీడీపీ పని అయిపోయిందని అనుకున్నవారికి షాకిస్తూ.. 134 స్థానాల్లో పార్టీ విజయందక్కించుకుంది.
ఇలా కంపేర్ చేసుకుంటే.. వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆ పార్టీ కోసం తన్నులు తిం టున్నవారు.. కేసులు పెట్టించుకుంటున్నవారు పెరుగుతున్నారు. అయినప్పటికీ.. వారికి పార్టీ నుంచి ఎ లాంటి స్వాంతన లభించడం లేదు. అంతేకాదు.. కనీసం న్యాయ పోరాటానికి కూడా ఎవరూ సహకరించ డం లేదు. తాజాగా చిత్తూరులో వైసీపీ కార్యకర్త ఇంటిపై దాడి జరిగింది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అన్న విషయాలను పక్కన పెడితే.. దాడి జరిగింది.
ఈ క్రమంలో సదరు కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను పరామర్శించే విషయంలోజగన్ తీవ్ర అల సత్వం ప్రదర్శించారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. కనీసం ఫోన్ చేసి కూడా పరామర్శిం చలేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలా అయితే.. కార్యకర్తలు యాక్టివ్ అవుతారా? అన్నది కూడా ప్రశ్న. అంతేకాదు.. మరో నాలుగేళ్ల పాటు పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సి ఉన్నా.. కార్యకర్తలను నిలుపుకోవాల్సి ఉన్నా.. జగన్ ఆదిశగా ముందుకు సాగడం లేదని.. ఇది తమకు తీవ్ర నిరాశను కలిగిస్తోం దని పార్టీలోనే చర్చ సాగుతుండడం గమనార్హం.