బొల్లాకు సెగ.. పార్టీ నేతల తిరుగుబాటు.. !
పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు.. బొల్లా బ్రహ్మనాయుడుకు పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి భారీ సెగ తగులుతోంది.
By: Tupaki Desk | 21 Feb 2025 6:30 AM GMTపల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు.. బొల్లా బ్రహ్మనాయుడుకు పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి భారీ సెగ తగులుతోంది. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు కూడా.. బొల్లాకు వ్యతిరే కంగా ఓ వర్గం నాయకులు రాజకీయాలు చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తమను తృణీకరిస్తున్నా రని.. కనీసం తాము పార్టీ నాయకులం, కార్యకర్తలం అన్న జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఆయనను తప్పించాలని పట్టుబట్టారు.
అయినా.. జగన్ మాత్రం బొల్లాకు పట్టం కట్టారు. ఆయనకే టికెట్ ఇచ్చారు. చివరకు రెడ్డి సామాజిక వర్గం మొత్తం చీలిపోయి.. వినుకొండలో టీడీపీకి మద్దతు పలికింది. ఈ విషయంపై ఎన్నికల తర్వాత.. వైసీపీ అధినేత క్లాస్ తీసుకునే వరకు వచ్చింది. అప్పట్లోనూ.. నాయకులు బొల్లాను మార్చాల్సిందేనని చెప్పారు. అయినా.. జగన్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. ఇదిలావుంటే.. ఇప్పుడు మరోసారి బొల్లా వ్యవహారం తెరమీదికి వచ్చింది.
వినుకొండ వైసీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్న బొల్లాను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని అన్ని మండలా లకు చెందిన 50 మందికి పైగా నాయకులు తాడేపల్లికి క్యూ కట్టారు. 50 మంది కూడా పదుల సంఖ్యలో వినతి పత్రాలు సమర్పించారు. బొల్లా తమకు అవసరం లేదని.. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చుండూ రు వెంకటేశ్వర్లుకు ఈ బాధ్యతలు అప్పగించాలని.. ఆయన ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేస్తామని వారు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బొల్లాను తొలగించే వరకు.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదన్నారు.
దీనిపై అవాక్కయిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామ న్నారు. ఇదిలావుంటే.. బొల్లాపై వ్యతిరేకత కొత్తకాదు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే.. సొంత పార్టీ నాయ కులపై కత్తికట్టినట్టు వ్యవహరించారు. తనను వ్యతిరేకించిన నాయకులను అదుపులో పెట్టుకునేందుకు పోలీసు కేసులు కూడా పెట్టించారు. తనను ప్రశ్నించిన సొంత నేతలపైనా ఆయన దాడులు చేయించార న్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బొల్లాకు తీవ్ర వ్యతిరేకత పెరగడం గమనార్హం.