కన్వీనర్లు కావలెను.. వైసీపీలో డిమాండ్ ..!
ఇదిలావుంటే.. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మరో చిత్రమైన వ్యవహారం తెరమీదికి వస్తోంది.
By: Tupaki Desk | 12 March 2025 9:54 AM ISTవైసీపీలో రాజకీయ పదవులు ఖాళీగా ఉన్నాయా? వీటిని భర్తీ చేసేందుకు క్షేత్రస్థాయి నాయకులు ప్రయ త్నాలు చేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు నడిపించే నాయకులు కరువయ్యారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వా త.. అనేక మంది మౌనంగా ఉండడం.. మరికొందరు పార్టీ మారడం.. ఇలా.. తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడంతో పలు నియోజకవర్గాలు ఖాళీ అయ్యాయి.
ఇదిలావుంటే.. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మరో చిత్రమైన వ్యవహారం తెరమీదికి వస్తోంది. నాయకులు ఉన్నా.. మండల స్థాయిలో పార్టీని పరుగులు పెట్టించే కన్వీనర్లు లేకుండా పోయారు . గతంలో ఉన్న వారంతా ప్రస్తుతం కూటమి పార్టీలకు అనుకూలంగా మారిపోయారు. దీంతో నియోజకవర్గ స్థాయిలోని మండలాల్లో.. పార్టీ జెండా మోసేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో ఇప్పుడు స్థానిక నాయకులు కన్వీనర్ల కోసం వెతుకులాడుతున్నారు.
నెల జీతాలు.. !
గతంలో నెల జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ, ఇప్పుడు వైసీపీలో మండల, గ్రామ స్థాయిలలో నియ మించే వారికి పూర్తిస్తాయిలో పనులు అప్పగించి.. వారికి నెల జీతాలు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీని కి అదనంగా నియోజకవర్గ ఇంచార్జ్‌లు.. కూడా చెల్లించాల్సి వస్తుంది. దీంతో నిబద్ధతతో పనిచేస్తారన్న వ్యూహం పార్టీలో కనిపిస్తోంది. అందుకే.. కన్వీనర్లకు 25 వేల నుంచి 30 వేల వరకు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మండల స్థాయిలో పార్టీని పరుగులు పెట్టించే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు.
ఎక్కడెక్కడ..?
ప్రస్తుతం టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ మాట వినిపించడం లేదు. దీంతో ఆయా నియోజ కవర్గాలలో పార్టీని డెవలప్ చేసేందుకు.. కన్వీనర్లను నియమించుకునే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇంకో వైపు.. పార్టీలో నెంబర్ టూలు లేని నియోజకవర్గాల్లోనూ కన్వీనర్లను నియమించే ప్రతిపాదన ఉంది. దీనికి సంబంధించి స్థానిక నాయకులు తమ తమ ప్రాంతాల్లో నియామకాలు ఇప్పటికే ప్రారంభించారు. చదువుకున్న వారి నుంచి పార్టీలో యాక్టివ్‌గా ఉండే వారి వరకు అన్ని రకాలుగా పరీక్షించి అభ్యర్థులను ఎంపిక చేసుకునే పనిని ప్రారంభించారు.