వైసీపీ చిచ్చు.. టీడీపీ-జనసేనకు బిగ్ టెస్టే..!
తాజాగా ఓ ప్రధాన మీడియా సంస్థ.. కూటమిలో వైసీపీ చిచ్చు పెడుతోందంటూ.. కీలక కథనాన్ని రాసుకొ చ్చింది.
By: Tupaki Desk | 22 Jan 2025 7:30 PM GMTతాజాగా ఓ ప్రధాన మీడియా సంస్థ.. కూటమిలో వైసీపీ చిచ్చు పెడుతోందంటూ.. కీలక కథనాన్ని రాసుకొచ్చింది. దీనికి ప్రాతిపదికగా.. నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లపై గత నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ప్రస్తావించింది. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ.. టీడీపీ నాయకులు యాగీ చేయడం తెలిసిందే. ఇక, ఈ వ్యవహారం ముదురుతోందని గుర్తించిన జనసేన నాయకులు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. తమ నాయకుడికి సీఎం పోస్టు ఇవ్వడంని వ్యాఖ్యానించారు.
దీం తో ఈ వ్యవహారం.. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన చర్చకు దారితీసేలా మారింది. ఈ క్రమంలో వెంటనే స్పందించిన చంద్రబాబు.. ఇలాంటి చర్చల వల్ల అనర్థం జరుగుతుందని.. కూటమి ప్రభుత్వానికి మచ్చ వస్తుందని భావించి .. నాయకులను కట్టడి చేశారు. ఆ వెంటనే జనసేన కూడా అలెర్ట్ అయింది. ఎవరూ పదవుల విషయంలో స్పందించరాదని కూడా తేల్చి చెప్పింది. కట్ చేస్తే.. అసలు ఈ వివాదాలన్నీ కూడా.. వైసీపీ నుంచే జరుగుతున్నాయన్న వాదన తెరమీదకి వచ్చింది.
తెర వెనుక వైసీపీ ఉండి.. కూటమిలో చిచ్చు పెడుతోందన్నది ఈ మీడియా వర్గాల కథనం. అంతేకాదు.. అసలు డిప్యూటీ సీఎం అనే డిమాండ్ టీడీపీ నుంచి పుట్టలేదని. వైసీపీ నాయకులు టీడీపీ నేతలను ఎగదోశారని కథనం వివరించింది. అక్కడితో నూ ఆగకుండా.. జనసేనలో నూ సీఎం పోస్టు వ్యవహారంపై వైసీపీ నాయకులే చిచ్చు పెడుతున్నారని కథనం మండిపడింది. కట్ చేస్తే.. అసలు ఈ కథనం లో బలం ఎంత? అనేది చర్చనీయాంశం. ఈ కథనమే నిజమైతే.. అంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు.
ఎందుకంటే.. వైసీపీ చెబుతున్నట్టు కూటమి పార్టీల నాయకులు వింటున్నారని తెలుస్తోంది. వైసీపీ నేత ల తో వారు టచ్‌లో ఉండి.. వైసీపీ ఆడిస్తున్నట్టే ఆడుతున్నారని.. అందుకే.. తమ నాయకుడికి ఏ పదవి ఇవ్వాలో.. వైసీపీ డిసైడ్ చేసే స్థాయికి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు దిగజారిపోయి ఉంటారన్న ది కూడా ఇక్కడ కీలక విషయం. వాస్తవానికి ఈ విషయంలో వైసీపీ ప్రమేయం లేదు. ఒకవేళ ఉందని అనుకున్నా.. కూటమి నాయకులకు ఆ మాత్రం తెలివి సన్నగిల్లిందా? అనేది ప్రశ్న.
తమ తమ నేతలకు ఏయే పదవులు కావలో పొరుగు పార్టీ, అందునా ప్రత్యర్థి పార్టీ చెబితే కానీ.. తెలుసు కోలేనంత పరిస్థితిలో టీడీపీ, జనసేన నేతలు ఉన్నారా? అనేది కూడా చర్చకు వస్తున్న అంశం. వాస్తవా నికి.. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నవారు.. జనసేన దూకుడుగా ఉందని.. దీంతో తమ పార్టీ ఎక్కడ వెనుకబడి పోతుందో అని ఆలోచిస్తున్న టీడీపీ లోని కొందరు నేతలు సృష్టించిన వివాదమే డిప్యూటీ సీఎం వ్యవహారం. ఇక, ఇది తెరమీదికి వచ్చింది కాబట్టి.. తమను తాము డిఫెండ్ చేసుకునేందుకు జనసేనలోని కొందరు నేతలు వ్యూహాత్మకంగా సీఎం పోస్టును తెరమీదికి తెచ్చారు. ఈ పరిణామాలతోనే.. వివాదం జరిగింది. సో.. కట్టడి జరగాల్సింది.. కూటమి నేతల్లోనే తప్ప.. వైసీపీ విషయంలో కాదు..!