Begin typing your search above and press return to search.

ఈ ఏడుపేంది సామీ.. చేసింది చెప్పుకోవటం కూడా బాబు తప్పేనా?

విజయవాడలో కలెక్టరేట్ ఆవరణలో కారవాన్ ను ఉంచి.. అక్కడే బస ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు.. రోజులో అత్యధికం ప్రజలకు అందే సాయం మీదనే ఆయన ఫోకస్ ఉంది.

By:  Tupaki Desk   |   3 Sep 2024 4:32 AM GMT
ఈ ఏడుపేంది సామీ.. చేసింది చెప్పుకోవటం కూడా బాబు తప్పేనా?
X

భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న అసాధారణ పరిస్థితుల్లో ప్రజలకు సాయం అందించేందుకు, వారి కడగండ్లు తీర్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఈ వయసులో తెల్లవారుజామున నాలుగు గంటల వరకు తిరుగుతూ.. బాధితులకు ధైర్యం చెబుతూ.. సహాయక కార్యక్రమాల్ని ముమ్మరం చేస్తున్న వేళ.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఈ తీరు మింగుడుపడటం లేదు. చంద్రబాబు పడుతున్న కష్టాన్ని.. చేపట్టిన కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న తెలుగు తమ్ముళ్ల తీరుపై కత్తి కడుతున్నారు ఆయన ప్రత్యర్థులు. చంద్రబాబు అంటే ప్రచార యావ అని.. ప్రచారం కోసం మాత్రమే ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. వీడియోల్లో చెలరేగిపోతున్నట్లుగా ఆరోపిస్తున్నారు.

విజయవాడలో కలెక్టరేట్ ఆవరణలో కారవాన్ ను ఉంచి.. అక్కడే బస ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు.. రోజులో అత్యధికం ప్రజలకు అందే సాయం మీదనే ఆయన ఫోకస్ ఉంది. ఆయన పడుతున్న కష్టాన్ని.. చేస్తున్న సాయాన్ని తెలుగు తమ్ముళ్లు తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసుకుంటున్నారు. దీన్ని విపక్ష నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు కష్టాన్ని వీడియోలు.. ఫోటోలను పోస్టులుగా మార్చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా శ్రమిస్తున్న చంద్రబాబు తీరుపై అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది.

ఇలాంటి వేళ ఆయన రాజకీయ ప్రత్యర్థులు కొత్త తరహా వాదనల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. బాబుకు ప్రచార యావ పీక్స్ కు చేరుకుందని.. దీనికి సాక్ష్యంగా టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో 225 పోస్టులు పెట్టగా.. టీడీపీ ఫేస్ బుక్ గ్రైప్ లో 245 పోస్టులు.. ఐటీడీపీ ఫేస్ బుక్ లో 52.. సీఎంవో అధికారిక ఎక్స్ లో 30 పోస్టులు పెట్టిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. ప్రచార కండూతితో చంద్రబాబు జనాల్ని పట్టించుకోవటం లేదంటూ విరుచుకుపడుతున్నారు. ఈ తీరును సామాన్యులు సైతం ఖండిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తిమ్మిని బమ్మిని చేయటం కష్టం. లేనిది ఉన్నట్లుగా చేస్తే.. ఆ విషయం మీదా స్పందించే నెటిజన్లు బోలెడు. కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వటమే చంద్రబాబు చేసి ఉంటే.. ఈపాటికి ఆయన్ను.. ఆయన పని తీరును సోషల్ మీడియాలోనే కడిగిపారేసేవారు. అందుకు భిన్నంగా.. తెలుగుతమ్ముళ్లు పోస్టు చేసిన పోస్టులపై సానుకూల రియాక్షన్ రావటం చూస్తే.. ఆయన ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం కేవలం ఏడుపుతోనే చేస్తున్నట్లు చెబుతున్నారు. ఓవైపు ప్రజలు కష్టంలో ఉండి ఉంటే.. వారి కష్టాల్ని తీర్చేందుకు వీలుగా తమ వంతు సాయాన్ని ప్రకటించాలే తప్పించి.. ఇలా ఒడ్డున నిలుచొని సోషల్ మీడియాలో బద్నాం చేయటం ఒక పనిగా పెట్టుకోవటాన్ని తప్పు పడుతున్నారు. రాజకీయం చేయాలి కానీ దానికో సమయం.. సందర్భం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదన్న హితవు పలువురి నోటి నుంచి రావటం గమనార్హం.