Begin typing your search above and press return to search.

వైసీపీ లిస్ట్ అన్ లిమిటెడ్ నా...!?

ఒకటో జాబితా అన్నపుడు జనాలు ఆసక్తిగా చూసారు. పార్టీ జనాలలో చర్చ సాగింది. క్యాడర్ లో కూడా ఉత్కంఠ కనిపించింది

By:  Tupaki Desk   |   14 March 2024 12:30 AM GMT
వైసీపీ లిస్ట్ అన్ లిమిటెడ్ నా...!?
X

ఒకటో జాబితా అన్నపుడు జనాలు ఆసక్తిగా చూసారు. పార్టీ జనాలలో చర్చ సాగింది. క్యాడర్ లో కూడా ఉత్కంఠ కనిపించింది. కానీ అది కాస్తా ఇప్పటికి 12వ జాబితా దాటి వెళ్లిపోయింది. పైగా నెలల తరబడి ఈ జాబితా రిలీజ్ అన్న ప్రక్రియ సాగుతోంది. దాంతో మార్పులు చేర్పులు అదే పనిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆసక్తి అన్ని వైపులా తగ్గింది అన్న చర్చ అయితే సాగుతోంది.

చూస్తూండగానే వైసీపీ నుంచి 12 జాబితాలను వదిలారు. దాంతో జాబితా వస్తోంది కానీ మీడియాలో కూడా పెద్దగా చర్చ సాగడంలేదు. వారిని మార్చారు, వీరిని పెట్టారు అని రాసి ఊరుకుంటున్నారు. మొదట వచ్చినట్లుగా పెద్ద చర్చ అయితే సాగడంలేదు అని అంటున్నారు.

దీనికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఫైనల్ లిస్ట్ అన్నది తేలకపోవడమే అంటున్నారు. ఒక లిస్ట్ లో ఉన్న పేరు మరో లిస్ట్ లో కనిపించడం లేదు. దాంతో అంతా నిర్లిప్తంగా ఉంటున్నారు. ఈ పేర్లలో కూడా మార్పులు ఉండవా అని కూడా ఆలోచిస్తున్నారుట. దాంతో ఇటు సొంత పార్టీ వారిలో ఉత్సాహం తగ్గింది అని అంటున్నారు. ఇక ఇతర పార్టీలలో చూస్తే వైసీపీ లిస్టులు అలా వస్తూనే ఉంటాయని సెటైర్లు వేస్తున్నారుట.

దానికి అంతం లేదు అని కూడా ఎద్దేవా చేస్తున్నారుట. మొత్తానికి చూస్తే వైసీపీ జాబితాల మీద మాత్రం గతంలో వచ్చిన ఇంట్రెస్ట్ అయితే లేకుండా పోతోంది అని అంటున్నారు. . అంతే కాదు ఎవరి సీటు ఎపుడు చిరిగిపోతుందో కూడా తెలియడంలేదు అని అంటున్నారు.

ఈ లిస్ట్ వరకూ పేరు చూసుకుని ఓకే అనుకున్నా తరువాత వచ్చే లిస్ట్ లో పేరు మారిపోతుందో లేదో అన్నది ఎవరూ గ్యారంటీగా చెప్పలేకపోతున్నారు. అయితే తాడేపల్లి ఆఫీసు నుంచి వరసగా లిస్టులు వచ్చేస్తున్నాయి.

వాటిని చూస్తూ అలా టైం పాస్ చేయడమే అని అంటున్నారు. ఎందుకంటే గ్యారంటీ సీటు అని ఎవరూ ఎవరికీ చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు. ఇక కొత్త ముఖాలకు ఇచ్చిన చోట వారి పెర్ఫార్మెన్స్ అని పారామీటర్స్ తో కొలిచి మార్చేస్తున్నారు.

ఇటు సిట్టింగులు బోర్ అంటున్నారు. అటు కొత్త ముఖాలు వద్దు అంటున్నారు. ఇంతకీ ఎవరు క్యాండిడేట్ అని జుత్తులు పీక్కోవాల్సి వస్తోంది. ఎవరో ఒకరిని ఫైనల్ చేయండి అని అంటున్నా కూడా ఇదే ఫైనల్ అని ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. దాంతో రానీయ్ లిస్టులు అని అంతా చోద్యం చూస్తున్నారు

ఇదిలా ఉంటే ఈ నెల 16న ఫైనల్ లిస్ట్ అని అంటున్నారు. మొత్తం 175 అసెంబ్లీ 25 ఎమ్మెల్యే అభ్యర్ధులకు లిస్ట్ ఫైనలైజ్ చేసి జాబితా రిలీజ్ అని అంటున్నారు. కానీ ఇందులో కూడా నామినేషన్ల ఉపసంహరణ దాకా అభ్యర్ధుల పేర్లు మారవు అని చెప్పగలరా అని అంటున్న వారూ ఉన్నారు. ఎందుకంటే ఈసారి టీడీపీ లిస్ట్ చూస్తున్నారు. అక్కడ బలాబలాలు చూస్తున్నారు.

ఇక్కడ సర్వేలు చూస్తున్నారు. ఈ సర్వేలు ఆ లెక్కలు అన్నీ కూడా చివరాఖరి దాకా కొనసాగుతాయని అంటున్నారు. దాంతో ఎన్నికలు దగ్గర పడేవరకూ అభ్యర్ధి వీరే అని ఎవరూ చెప్పలేరు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీలో ఫస్ట్ లిస్ట్ వచ్చినపుడు అంతా ఒక ప్రయోగం అనుకున్నారు. సామాజిక న్యాయం అనుకున్నారు కానీ ఇపుడు తీరు చూస్తూంటే ఈ మార్పుచేర్పుల వెనక వ్యూహం ఉందా లేక బొత్తిగా గందరగోళమే ఉందా అంటే రెండవదే కరెక్ట్ అని చాలా మంది అంటున్నారు.

మరి ఇంత గందరగోళంగా లిస్టులు మారుస్తూ పోతూంటే రేపటి ఎన్నికల్లో ఎలా అన్నదే సొంత పార్టీకి పట్టుకున్న చింత. కానీ ఇది ఆగేది కాదు అన్నదే అందరిలో వస్తున్న అసలైన మాట. ఇదొక అంతులేని కధ అని కూడా సెటైర్లు వేస్తున్న వారూ ఉన్నారుట. సో ఇది ఇంతే అనుకోవాల్సిందే.