కుల గణన ఎఫెక్ట్.. వైసీపీకి మేలేనా?
వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకే.. వైసీపీ కుల గణను తెరమీదికి తెచ్చిందని జనసేన నాయకులు ఇప్పటికే ఆరోపిస్తున్నారు.
By: Tupaki Desk | 13 Feb 2024 3:30 PM GMTరాష్ట్రంలో చేపట్టి కులగణన ప్రక్రియదాదాపు కొలిక్కి వచ్చింది. వాస్తవానికి రెండు రోజుల్లోనే దీనిని పూర్తి చేయాలని అనుకున్నా.. అనివార్య కారణాలు.. తేలని లెక్కలతో వారం రోజుల వరకు దీనిని పొడిగించారు. దీంతో ఈ కుల గణన వ్యవహారం.. బుధవారం వరకు సాగుతుంది.అయితే.. ఈ కుల గణన వ్యవహారం రాజకీయంగా ప్రాదాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకే.. వైసీపీ కుల గణను తెరమీదికి తెచ్చిందని జనసేన నాయకులు ఇప్పటికే ఆరోపిస్తున్నారు.
మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను.. టీడీపీ నిశితంగా గమనిస్తోంది. వైసీపీ మాత్రం కుల గణన తమకు మేలు చేస్తుందని చెబుతోంది. కులాల వారీగా ఎంత మంది ఉన్నారు.? వారి ఆర్థిక పరిస్థితి, వృత్తులు, కుటుంబ వివరాలు తెలుసు కోవడం ద్వారా.. వారిని తమవైపు తిప్పుకొనే అవకాశం ఉంటుంద ని వైసీపీ నాయకులు అంతర్గత చర్చ ల్లో అభిప్రాయపడుతున్నారు. దీంతో సహజంగానే మిత్రపక్షం టీడీపీ-జనసేనలో ఈ వ్యవహారం.. చర్చగా మారింది.
ఎన్నికల వేళ కుల గణన చేపట్టడాన్ని జనసేన తీవ్రంగా తప్పుబడుతోంది. కులాల ఆలోచన ఎన్నికలకు ముందు రావడం.. ఆ వెంటనే గణనకు రంగంలోకి దిగడంతో ఎన్నికలకుముందు ఆయా కులాలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశాన్ని మేధావులు సైతం అంచనా వేస్తున్నారు. ఇక, ఈ కుల గణనలో వ్యక్తుల ఆదాయం, వారి వృత్తులు, ఆస్తులను కూడా వైసీపీ సేకరిస్తోంది. తద్వారా.. వచ్చే మేనిఫెస్టోలో కులాల వారీగా మేళ్లు చేకూర్చే పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
ఈ వ్యవహారం.. అంత తేలిక అయితే.. కాదని మేధావులు అంటున్నారు. చాలా దూరదృష్టితోనే.. నాయకు లు వ్యవహరిస్తున్నారని.. వచ్చే ఎన్నికల నాటికి కులాలను ఆదారంగా చేసుకుని వైసీపీ ఓట్లు వేయించుకున్నా.. ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇదే విషయం జనసేన అధినేత కూడా పసిగట్టారు. అందుకే.. ఆయన తరచుగా.. కుల గణనను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.