Begin typing your search above and press return to search.

ఒకేసారి బాబు చినబాబు వైసీపీకి దొరికేశారా ?

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఒకే రోజు ఒకేసారి వైసీపీ సోషల్ మీడియాకు దొరికేశారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 3:50 AM GMT
ఒకేసారి బాబు చినబాబు వైసీపీకి దొరికేశారా ?
X

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఒకే రోజు ఒకేసారి వైసీపీ సోషల్ మీడియాకు దొరికేశారు అని అంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయింది. వైసీపీ అధికారంలో ఉన్నపుడు పెద్దగా చలనం లేకుండా ఉన్న సోషల్ మీడియా ఇపుడు దూకుడు చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకులు టీడీపీ నేతలు చేసే తప్పులను బూతద్దంతో పెట్టి వెతుకుతున్నారు

ఏ మాత్రం అవకాశం చిక్కినా వెంటనే పోస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ట్రోల్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా నిర్వహించిన సభలో బాబు ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు

బాబు వేదిక మీదకు ఒక ఆటో డ్రైవర్ ని పిలిపించుకుని ఏమి చేస్తున్నావ్ అని అడిగారు. ఆటో తోల్తున్నా అని చెబుతూ పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయని చెప్పారు. దానికి బాబు ఆ ఇబ్బంది లేకుండా ఈ ఆటోను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చేసుకోవచ్చు అని చెబుతారు.

అది ఎలా అంటే ఉన్న డీజిల్ ఇంజన్ తీసేసి ఎలక్ట్రిక్ ఇంజన్ పెట్టేస్తే ఆటో ఎలక్ట్రానిక్ వాహనం అవుతుందని బాబు అంటారు. ఇది వైసీపీ పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోంది.విజనరీ అంటే ఇదే మరి అని అంటున్నారు. నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలుగా మామూలు వాటిని మార్చడం అంత ఈజీ కాదు, ఏకంగా ఆటో మొత్తాన్నే ప్రత్యేకంగా మార్చాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు ఆ సంగతి తెలిసి చెప్పారో లేక ఫ్లోలో తెలియక చెప్పారో ఏమో కానీ ఆయన వెరీ ఈజీ అన్నట్లుగా చెప్పడంతో దాన్ని వైసీపీ వారు ట్రోల్స్ చేస్తున్నారు.

మరో వైపు చూస్తే గుంటూరు లో నారా లోకేష్ మంత్రి హోదాలో తొలిసారి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగులో కొన్ని పధాలను ఖూనీ చేశారంటూ వైసీపీ సోషల్ మీడియా వెతికి పట్టుకుని హైలెట్ చేసింది. పెన్షన్ కి పెంక్షం అనడం రైతులు అనేదానికి రైతుల్ అని అనడం నివాళికి నివాళ్ అలాగే ఉద్యాన పంటలు అనడానికి ఉద్యమ పంటలు అని లోకేష్ చదవడాన్ని ఎద్దేవా చేస్తోంది.

అమర వీరులు అని చదవడానికి అమర వీలు అని చదివారు. వేడుకలు అని చదవడానికి బదులుగా వేడకలు అని చదివారు అని వైసీపీ దెప్పి పొడుస్తోంది. అర్హులు అనడానికి అరులు అని చదివారు. ఇలా లోకేష్ చేసిన ప్రసంగంలో ప్రతీ ముక్కా పట్టుకుని ట్రోల్ చేసి పారేసింది.

నిజానికి లోకేష్ కి తెలుగు మీద అంత పట్టు లేదు. అయితే ఆయన ఇటీవల కాలంలో మెరుగుపడ్డారు. కానీ ఆయనకు ఇచ్చిన ప్రసంగ పాఠంలో కొన్ని కఠిన పదాలు ఉన్నాయి. వాటిని ఆయన కూడబలుక్కుని చదవడంతో పాటు కొన్ని చోట్ల సరిగ్గా పలకలేకపోవడంతో ట్రోల్స్ కి గురి అయ్యారని అంటున్నారు. ఇలా ఒకే రోజు బాబు చినబాబు వైసీపీకి దొరికారు అని అంటున్నారు