Begin typing your search above and press return to search.

వైసీపీకి రాయలసీమలో ఒక రిజల్ట్... కోస్తాలో మరో రిజల్ట్...సర్వేలో...!

సర్వేలో అధికార వైసీపీకి ఏపీ మొత్తం ఏకమొత్తంగా ఫలితం కనిపించడం లేదు అన్న వార్తలు సంచలనం రేకెత్తిస్తున్నాయి

By:  Tupaki Desk   |   13 March 2024 11:30 PM GMT
వైసీపీకి రాయలసీమలో ఒక రిజల్ట్... కోస్తాలో మరో రిజల్ట్...సర్వేలో...!
X

సర్వేలో అధికార వైసీపీకి ఏపీ మొత్తం ఏకమొత్తంగా ఫలితం కనిపించడం లేదు అన్న వార్తలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఏపీలో వైసీపీ పెద్దలు చెబుతున్నట్లుగా వైసీపీ విజయం తధ్యమని అనుకోవడానికి వీలు లేదు అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూస్తే అలాగే ఉన్నాయని చెబుతున్నారు.

ఒక చోట ఓకేగా ఉంటే మరోచోట వీక్ గా పార్టీ సీన్ కనిపిస్తోందిట. దాంతో ఓవరాల్ గా వైసీపీ పరిస్థితి ఏంటి అన్నదే ఇపుడు హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది అని అంటున్నారు. ఇటీవల ఒక ప్రముఖ సంస్థ రాయలసీమలోని రాప్తాడు, కర్నూల్, కమలాపూర్, కడప, చిత్తూరు రాయలసీమ జిల్లాలలో ఒక కీలకమైన సర్వే చేస్తే జగన్ మీద పాజిటివ్ గా ఉంది కానీ ఎమ్మెల్యేల మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది అని అంటున్నారు.

రాయలసీమలో చూస్తే జగన్ మీద ఆయన ప్రభుత్వం ఇచ్చే పధకాల మీద ప్రజలలో అనుకూలత బాగానే ఉంది అని అంటున్నారు. ఇది పాజిటివ్ వేవ్ గానే చూస్తున్నారు. ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నందున రిజల్ట్ విషయానికి వస్తే ప్రతీ సీటులో టైట్ ఫైట్ నడిచే చాన్స్ ఉంది అని అంటున్నారు.

అదే నెల్లూరు జిల్లాలోని కావలి ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో సర్వెను ఆ ప్రముఖ సంస్థ చేస్తే అక్కడ ఆసక్తికరమైన విషయాలు వెల్లడి అయ్యాయట. కావలి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నా రెడ్డీలు అంతా వైసీపీ వైపు ఉన్నారు కనుక పెద్దగా ఇబ్బంది ఉండదని అంటున్నారు. అదే కనిగిరిలో చూస్తే స్థానికంగా ఉన్న కుల సమీకరణలు అన్నీ కలసివచ్చి టీడీపీకే కాస్త మొగ్గు ఉందని అంటున్నారు.

గుంటూరు జిల్లాలోని గురజాలలో చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. అయినా సరే పధకాలే వైసీపీని కాపాడుతాయని ఇక్కడ పోటీ మాత్రం చాలా టైట్ గా నడిచే చాన్స్ ఉందని అంటున్నారు.

ఇక క్రిష్ణా జిల్లా గన్నవరంలో చూస్తే కనుక వైసీపీ అభ్యర్థి మీద పెద్ద ఎత్తున జనంలో వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. అదే టీడీపీకి ప్లస్ అయ్యే చాన్స్ ఉందని టీడీపీ ఇక్కడ గెలిచినా స్వల్ప మెజారిటీతో బయటపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అదే విధంగా గోదావరి జిల్లాలో ఉన్న 34 సీట్లలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తున్నా కూటమి నుంచి వచ్చే పార్టీలకు మంచి అభ్యర్ధులు లేరు అని అంటున్నారు. అలాగే ఆర్ధికంగా చాలా మంది బలంగా లేరు అన్న టాక్ ఉంది. కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేమని అంటున్నారు.

ఎందుకంటే గోదావరి జిల్లాల తీర్పే ఎపుడూ ఏపీ పాలిటిక్స్ ని మారుస్తుంది. అది కూడా చివరి పది రోజులలోనే మొత్తానికి మొత్తం సీన్ చేంజ్ అవుతుంది. వారు ఏ పార్టీకి మొగ్గు అన్నది ఓపెన్ గానే కనిపిస్తుంది కూడా అని అంటున్నారు. అలా చూసుకుంటే కనుక ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కానీ గోదావరి జిల్లాల నాడి బయటపడే అవకాశం లేదు అని అంటున్నారు.

ఇక విశాఖ జిల్లాలో చూస్తే కూటమి అభ్యర్ధులకే పై చేయిగా ఉంటోంది. ఇక్కడ మొదటి నుంచి టీడీపీకి పట్టు ఉంది. జనసేనకు అభిమానులు ఉన్నారు. బీజేపీకి కూడా అర్బన్ ఓటర్ల మద్దతు ఉంది. ఈ మూడు కలిశాయి కాబట్టి విశాఖ జిల్లాలో కూటమి పటిష్టంగా ఉంది అని అంటున్నారు.

ఇక విజయనగరం జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఉన్న జిల్లా. ఇక్కడ పధకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో వైసీపీకే మొగ్గు చూపుతున్నారు అని అంటున్నారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో మిశ్రమమైన రాజకీయ నేపధ్యం ఉంది కానీ చివరికి అది కాస్తా టీడీపీకే మొగ్గు ఉండేలా కనిపిస్తోంది అని అంటున్నారు.

మొత్తంగా చూస్తే కనుక వైసీపీకి కూటమికి మధ్య జస్ట్ రెండు శాతం మాత్రమే ఓట్ల శాతం తేడా ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలో అసలైన తీర్పు అంతా తటస్థ ఓటర్ల మీదనే ఆధారపడి ఉంది అని అంటున్నారు. ప్రస్తుతానికి చూస్తే అటు వైసీపీకి ఇటు టీడీపీ కూటమికి సమాన అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరి ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే అధికార వైసీపీ వైపు నుంచి ఓట్ల శాతం పెంచుకోవాలి. అది ఇపుడు జరిగే పనేనా అంటే ఎన్నికల మేనిఫేస్టో ఒక్కటే ఆ పార్టీకి ఆఖరు ఆయుధంగా ఉంటుంది. అది కనుక జనాలకు నచ్చితే వైసీపీ వైపు మొగ్గు మారవచ్చు. మరో వైపు చూస్తే కూటమికి పెద్దన్నగా ఉన్న మోడీ ఇమేజ్ కూడా ప్లస్ పాయింట్ అయి కూటమికి అనుకూలత ఒక్కసారిగా మారవచ్చు.

అలా వేవ్ క్రియేట్ ఎపుడు అవుతుంది అంటే మార్చి నెలాఖరు నాటికి అని అంచనా వేస్తున్నారు. అపుడు కచ్చితంగా ఏదో ఒక పార్టీకి వేవ్ కనిపించే చాన్స్ ఉంది. అంటే ఇంక మరో పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది. అప్పటికి ఎవరు గెలుస్తారు అన్నది ఒక అంచనా అయితే రావచ్చు అని అంటున్నారు. సో ఇప్పటికైతే హోరా హోరీ పోరు ఉంది.