Begin typing your search above and press return to search.

ఇపుడు వైసీపీ రెడీగా ఉండాలి !

వంద రోజుల వ్యవధిలోనే కేసులు అన్నీ ఎత్తేసి కూటమి నేతలకు కార్యకర్తలకు క్లీన్ చిట్ ఇస్తామని అన్నారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 3:40 AM GMT
ఇపుడు వైసీపీ రెడీగా ఉండాలి !
X

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల మీద పెట్టిన కేసులను ఎత్తివేస్తామని టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. పార్టీ కోసమే వారంతా గత ప్రభుత్వంతో పోరాడి కేసులు పెట్టించుకున్నారు అని ఆయన చెప్పారు.

వంద రోజుల వ్యవధిలోనే కేసులు అన్నీ ఎత్తేసి కూటమి నేతలకు కార్యకర్తలకు క్లీన్ చిట్ ఇస్తామని అన్నారు. ఇది కూటమి పార్టీలకు సంతోషం నింపే వార్త అయితే కొత్తగా ప్రతిపక్షంలోకి వచ్చిన వైసీపీ అధికార పక్షం మీద పోరాడేందుకు రెడీగా ఉండాల్సి ఉంది అని ఇండైరెక్ట్ గా చెప్పే వార్త కూడా.

వైసీపీ కార్యకర్తలు అవసరం అయితే కేసులు పెట్టించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాల్సి ఉంది. అధికార పక్షం మీద ప్రతిపక్షం పోరాడినపుడు కేసులు తప్పవు. ఈ విషయంలో ఎవరూ అతీతులు కారు. అయితే కూటమిలోని మూడు పార్టీలు కసిగా పనిచేశారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు అయితే చావో రేవో అన్నట్లుగా వీధుల్లోకి వచ్చి పోరాడారు.

అయిదేళ్ళ పాటు వారు చేసిన పోరాటాల ఫలితంగానే టీడీపీ కూటమి అధికారాన్ని దక్కించుకుంది. ఆ తెగువ చొరవ ఉంటేనే విపక్షంలోని పార్టీలు అధికారంలోకి వస్తాయి. టీడీపీ కూటమి హానీమూన్ లో ఉందని వైసీపీ అధినాయకత్వం అంటోంది కానీ తమ పార్టీ క్యాడరే ఇంకా నిరాశలో ఉందని గ్రహించడం లేదు అంటున్నారు.

వైసీపీ క్యాడర్ కి గత అయిదేళ్ళుగా సరైన గుర్తింపు లేక నీరసించి ఉన్నారు. ఇపుడు వారిలో ధైర్యం నింపి ఆత్మ విశ్వాసం కలిగిస్తేనే తప్ప పార్టీ జెండాను మోయలేరు. గతానికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే చాలా దూకుడుగా క్యాడర్ పోరాటం చేయాల్సిన రోజులు ఇవి. పార్టీ సిద్ధాంతాల కన్నా రాజకీయ రాద్ధాంతాలకే విలువ ఉన్న కాలం ఇది.

అందువల్ల మెరికల్లాంటి క్యాడర్ ఉంటేనే పార్టీ జనంలో కనిపిస్తుంది. అధికార పార్టీకి అది ఆనుతుంది. అలాంటి వారు వైసీపీలో ఉన్నారా అన్నది చూడాలి. ఉంటే వారంతా కేసులకు వెరవకుండా విపక్ష పోరాటానికి సన్నద్ధం కావాల్సిందే. అదృష్టం బాగుండి 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే వారి మీద కూడా పెట్టిన కేసులు కొట్టేయించుకోవచ్చు.