Begin typing your search above and press return to search.

అటు ఐటీ నోటీసులు ఇటు అరెస్ట్... పక్కా వ్యూహంతోనే వైసీపీ...?

ఐటీ నోటీసులతో ఒక వైపు టీడీపీ ఇబ్బంది పడుతోంది, మరో వైపు ఈ స్కాం లో బాబు పాత్ర ఉంది అని వైసీపీ ఏకంగా అరెస్ట్ చేసింది

By:  Tupaki Desk   |   9 Sep 2023 2:30 PM GMT
అటు ఐటీ నోటీసులు ఇటు అరెస్ట్... పక్కా వ్యూహంతోనే వైసీపీ...?
X

ట్రెడిషనల్ పాలిటిక్స్ ని జగన్ నుంచి ఆశించలేరు. ఆయన రూట్ అంతా సెపరేట్. ఆయన ఎపుడూ సెంటిమెంట్స్, ఓల్డ్ ట్రాక్ రికార్డ్స్, పాత దారులను నమ్ముకోరు. ఆ రూట్లో అసలు నడవరు. ఆయనది అంతా సెపరేట్ ట్రాక్. అందుకే ఎన్నికలు ముంగింట్లో పెట్టుకుని బలమైన ప్రత్యర్ధిని ముమ్మారు ఏపీకి సీఎం గా చేసిన చంద్రబాబుని ఏమీ కాకుండా అరెస్ట్ చేసారు.

నిజంగా ట్రెడిషనల్ పొలిటికల్ అవుట్ లుక్ లో ఆలోచిస్తే ఇలా ఎవరూ చేయరు. ఎందుకంటే సింపతీ కార్డుని విపక్షం తీస్తుందని, జనాల మైండ్ సెట్ కూడా ఆ వైపుగా టర్న్ అయితే అసలుకే ఎసరు వస్తుందని భయపడతారు. కానీ జగన్ స్టైలే వేరు. ఆయన అనుకున్నారు అంటే చేస్తారు. అందులో కూడా లెక్కలు అన్నీ పక్కాగా చూసుకుంటారు.

ఆయన డైనమిక్ గా ఆలోచిస్తారని అంటారు. దాని ఫలితాలే ఇలా ఉంటాయని కూడా అంటారు. చంద్రబాబు అరెస్ట్ అన్నది బహుశా ఆయన కూడా ఊహించలేని అనూహ్యమైన పరిణామం అంటారు. రెండు రోజుల క్రితం రాయదుర్గం లో జరిగిన సభలో మాట్లాడుతూ బాబు మాట్లాడుతూ తనను అరెస్ట్ చేయవచ్చు అని చెప్పారు. నిజంగా బాబు గతంలో కూడా ఇలా చాలా సార్లు అన్నారు. దాన్ని అంతా లైట్ తీసుకున్నారు.

ఆ మాటకు వస్తే మా బాబుని టచ్ చేసే ధైర్యం ఎవరికి ఉందని తమ్ముళ్లూ అనుకున్నారు. ఇక వైసీపీ నేతలు అయితే అరెస్ట్ వంటివి ఎన్నికల టైం లో ఎందుకు ఉంటాయని కూడా అనుకున్నారు. కానీ బాబు తన నోటి వెంట అరెస్ట్ అని ఏ ముహూర్తాన అన్నారో అదే జరిగింది. దాంతో టీడీపీయే కాదు, వైసీపీ కూడా షాక్ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు.

ఈ అరెస్ట్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది చర్చగా ముందుకు వస్తోంది. ఎందుకంటే అరెస్ట్ సింపతీ ఇవన్నీ రాజకీయాల్లో ఎపుడూ వర్కౌట్ అవుతూ ఉంటాయి. కానీ ఇపుడు ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నంగా జగన్ ఆలోచించడం వల్లనే టీడీపీకి ఎంత దాకా మైలేజ్ దక్కేనూ అన్నదే పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది.

బాబు అరెస్ట్ అయ్యారు అంటే ఏ విషయంలో అన్నది కూడా చర్చకు వస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం లో వందల కోట్ల అవినీతి జరిగిందని, దానికి సూత్రధారి పాత్రధారి చంద్రబాబు కాబట్టే ఆయన్ని అరెస్ట్ చేశామని అంటున్నారు. ఇది కూడా జనంలో చర్చకు వెళ్తుంది కాబట్టి ఊరకే బాబుని అరెస్ట్ చేయలేదు అన్నది కూడా అందరికీ తెలుస్తుంది. అలా తెలియాలీ అన్నదే వైసీపీ ప్లాన్.

మరో వైపు చూస్తే నన్ను ఎవరూ ఏ కేసులోనూ ఇరికించలేరు, నేను నిప్పు అంటూ బాబు తరచూ చెబుతూ ఉంటారు. ఇపుడు ఆయన అరెస్ట్ తో ఆ మాటలు అన్నీ వీగిపోయేలా వైసీపీ సర్కార్ చేసింది అని అంటున్నారు. తప్పు చేస్తే బాబు అయినా చట్టం ముందు ఒక్కటే అని వైసీపీ స్ట్రాంగ్ గా నిరూపించే ప్రయత్నం ఇది అని అంటున్నారు. ఆనాడు అంటే 2015లో హరిహరాధులు అడ్డు వచ్చినా బాబు అరెస్ట్ కాక తప్పదు అని చెప్పిన తెలంగాణా ప్రభుత్వం కూడా ఆయన్ని ఏమీ చేయలేకపోయింది.

ఇపుడు ఆ క్రెడిట్ ని మాత్రం జగన్ సర్కార్ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. అదే టైమింగ్. ఒక వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ నోటీసులు బాబుకు జారీ చేశాయి. దాని మీద జాతీయ మీడియా కధనాలతో ఏపీలో అది పెద్ద చర్చగా ఉంది. కరెక్ట్ ఆ అవకాశాన్ని వైసీపీ తీసుకుంది. బాబుకు ఐటీ నోటీసుల తరువాత ఈడీ రంగంలోకి దిగుతుందని అరెస్టులు ఉంటాయని ఒక వైపు ప్రచారం జరుగుతున్న వేళ ఏపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ని ముందుక్ పెట్టి అరెస్ట్ చేయడం ద్వారా అడ్వాంటేంజిని సొమ్ము చేసుకుంది అంటున్నారు.

ఐటీ నోటీసులతో ఒక వైపు టీడీపీ ఇబ్బంది పడుతోంది, మరో వైపు ఈ స్కాం లో బాబు పాత్ర ఉంది అని వైసీపీ ఏకంగా అరెస్ట్ చేసింది. బాబు హయాంలో ఏపీలో అవినీతి జరిగిందని చెప్పడమే దీని వెనక ఉద్దేశ్యం. అలాంటి పార్టీతో పొత్తులకు బీజేపీ సిద్ధపడుతుందా అన్నది ఇపుడు స్ట్రైట్ క్వశ్చన్ గా ముందు పెట్టాలన్నదే వైసీపీ తాపత్రయం. అలాగే తాను నీతి నిజాయితీ పరుడని చెప్పుకుంటూ వచ్చే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ అవినీతి విషయంలో ఏమి చెబుతారు. ఎలా పొత్తులకు వెళ్తారు అన్నది కూడా మరో పాయింట్ గా ముందుకు వైసీపీ తేనుంది.

మొత్తానికి చూసుకుంటే ఈ అరెస్ట్ వల్ల బాబుకు వచ్చే సింపతీ కన్నా బాబుని అవినీతిపరుడుగా ముద్ర వేయడం ద్వారా పొత్తు పార్టీలను దూరం చేయాలన్న వ్యూహం ఎత్తుగడతో వైసీపీ ముందుకు కదులుతోంది అని అంటున్నారు. అలాగే జనంలో కూడా బాబు హయాంలో అవినీతి జరిగింది అని పెద్ద ఎత్తున చాటడమే మరో వ్యూహం అని అంటున్నారు. అదే కనుక వర్కౌట్ అయితే మాత్రం ఏపీలో టీడీపీకి కొత్త చిక్కులు తప్పవు. అలా జరగాలన్నదే వైసీపీ ప్లాన్.