Begin typing your search above and press return to search.

ఇంకా ఉంది: వైసీపీలో ట్విస్టుల మీద ట్విస్టులు...!

వైసీపీలో మార్పు చేర్పులు తప్పవని అంటున్నారు. గురువారం పొద్దు పోయిన తరువాత విడుదల అయిన జాబితా మూడవది

By:  Tupaki Desk   |   11 Jan 2024 6:26 PM GMT
ఇంకా ఉంది:  వైసీపీలో ట్విస్టుల మీద ట్విస్టులు...!
X

వైసీపీలో మార్పు చేర్పులు తప్పవని అంటున్నారు. గురువారం పొద్దు పోయిన తరువాత విడుదల అయిన జాబితా మూడవది. నిజానికి చూస్తే వైసీపీ ఫైనల్ జాబితా అంటూ గత రెండు రోజులుగా న్యూస్ వైరల్ చేస్తూ మీడియా హడావుడి చేసింది. అది వైసీపీ అధినాయకత్వం నుంచి అఫీషియల్ గా అయితే చెప్పలేదు. ఇక మూడవ జాబితాలో చూస్తే 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు అలాగే ఆరు ఎంపీ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించారు.

మొదటి జాబితాలో చూస్తే 11 మందిని మార్చారు. రెండవ దాంతో 28 మందిని ఇంచార్జిలుగా నియమించారు. ఇలా చూసుకుంటే దాదాపుగా యాభైకి దగ్గరలో అసెంబ్లీ అభ్యర్ధుల మార్పు జరిగింది అనుకోవాలి. అయితే మరిన్ని మార్పులు చేర్పులు ఉంటాయని వైసీపీలో ప్రచారం సాగుతోంది అని అంటున్నారు.

పైగా ఈ మార్పులు అన్నీ కూడా ఎన్నికలు దగ్గర అయ్యేంతవరకూ సాగుతాయని అంటున్నారు. దాంతో పాటు ఇపుడు ఇంచార్జిలుగా ఉన్న వారు కూడా రానున్న కాలంలో తమ పనితీరుని మరింత మెరుగు దిద్దుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ రానున్న రోజులలో మార్చబోయే వారి వివరాలు ఏంటి అన్న చర్చ ఉంది.

కొన్ని చోట్ల మంత్రుల సీట్లలో మార్పులు ఉంటాయని అంటున్నారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా తన పని తాను చేసుకుని పోతోంది. అదే టైం లో సిట్టింగులకు ఎక్కడా చోటు చూపించలేకపోతే వారిని నచ్చచెబుతోంది. అలా పార్టీ ఇచ్చిన హామీ మేరకు కొనసాగిన వారు కొనసాగుతున్నారు.

లేని వారు బయటకు వెళ్ళినా పార్టీ హై కమాండ్ తన పని తాను చేసుకుని పోతోంది అని అంటున్నారు. సామాజిక న్యాయంతో పాటు బలమైన అభ్యర్ధులు ఉండాలన్న ఉద్దేశ్యంతోనే వైసీపీ ఈ మార్పులు అన్నీ చేస్తోంది అంటున్నారు.

ఇక మొత్తం 175 నియోజకవర్గాలలో ప్రత్యేకంగా చేసిన సర్వేలు అధారంగా చేసుకుని ఈ మార్పులు జరిగాయని అంటున్నారు. ఇక తమ పార్టీలో వారి కంటే అన్ని రకాలుగా బలవంతులు ఉంటే ఇతర పార్టీలలోని వారిని కూడా ఆహ్వానించి మరీ సీటు ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా వైసీపీ చేస్తున్న ఈ చేంజింగ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనే అంటున్నారు.

గెలుపు మంత్రం తప్ప మరే కొలమానాలు పెట్టుకోలేదని అంటున్నారు. దాంతో ఎవరు సన్నిహితులు అయినా కూడా వారి పనితీరు మీద వ్యతిరేక నివేదిక వస్తే తప్పిస్తున్నారు అని అంటున్నారు. చాలా చోట్ల ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్ధులుగా దింపుతున్నారు. దాంతో వైసీపీ అధినాయకత్వం దూకుడు రాజకీయం విపక్షాలకు సైతం మింగుడుపడడం లేదు అని అంటున్నారు.