Begin typing your search above and press return to search.

27న వైసీపీ కీలక మీటింగ్... జగన్ ఏం చెప్పబోతున్నారు....!?

వైసీపీ కీలక సమావేశం ఈ నెల 27న జరగబోతోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇంచార్జిలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు

By:  Tupaki Desk   |   26 Feb 2024 4:09 AM GMT
27న వైసీపీ కీలక మీటింగ్...  జగన్ ఏం చెప్పబోతున్నారు....!?
X

వైసీపీ కీలక సమావేశం ఈ నెల 27న జరగబోతోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇంచార్జిలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. ఈ మీటింగ్ చాలా సీరియస్ అంశాల మీదనే డిస్కష్ చేయబోతోంది అని అంటున్నారు. ఈ మీటింగ్ కూడా ఎన్నికలు దగ్గరలో ఉన్న టైం లో జరగడంతో జగన్ ఏమి చెబుతారు అన్న ఆసక్తి అయితే నెలకొంది.

మరో వైపు చూస్తే వైసీపీ సిద్ధం సభ చివరిది మార్చి 3న నిర్వహిస్తున్నారు. ఈ సభ తరువాత వైసీపీ ఫైనల్ లిస్ట్ ని రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. అందులో ఇప్పటికే మార్పు చేర్పులు చేసిన డెబ్బై ఎనభై మంది ఇంచార్జిల విషయంలో కూడా మార్పులు ఉంటాయని అంటున్నారు.

సర్వేల ఆధారంగా మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. ఇంచార్జిలను మార్చినా కూడా అక్కడ వైసీపీ గ్రాఫ్ పెరగకపోవడం తో పాటు కొంతమంది ఇంచార్జిల పనితీరు మీద కూడా వ్యతిరేకంగా సర్వే నివేదికలు రానుండడంతో వారికి మార్పు తధ్యమని అంటున్నారు. ఆ ప్లేస్ లో మరో బలమైన నేతను పెడతారు అని అంటున్నారు. ఆయనే అభ్యర్ధి అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలు ఇంచార్జిలకు ఇది అత్యంత కీలకమైన మీటింగ్ అని అంటున్నారు. ఈ మీటింగులో జగన్ చాలా విషయాలు కుండబద్ధలు కొట్టబోతున్నారు అని అంటున్నారు. జగన్ ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా సర్వే నివేదికల ప్రకారం చెప్పాల్సింది చెబుతారు అని అంటున్నారు. దాంతో చాలా చోట్ల సీట్లు ఇప్పటిదాకా మార్చని సిట్టింగుల విషయంలో కూడా మార్పు ఉంటాయని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే ఇపుడు ఇంచార్జిలుగా వేసిన చోట ఇరవై దాకా నియోజకవర్గాలలో మార్పులు ఉంటాయని అలాగే సిట్టింగుల సీట్లు ముట్టనివి ఎనభై దాకా ఉన్నాయని అందులో కూడా ఒక ఇరవై దాకా మార్పులు ఉంటాయని అంటున్నారు. దాంతో టోటల్ గా చూస్తే 2019లో వైసీపీ గెలిచిన 151 సీట్లలో తొంబై దాకా సీట్లలో మార్పులు చేర్పులు చేస్తూ వైసీపీ తుది జాబితా రిలీజ్ చేస్తారు అని అంటున్నారు.

ఈ సమావేశం తరువాత ఎవరికి టికెట్ దక్కుతుంది. ఎవరు మాజీ అవుతారు అన్నది పూర్తి క్లారిటీ వస్తుంది అని అంటున్నరు. ఇక ఈ మీటింగ్ కి మండల స్థాయి నేతలను కూడా పిలుస్తున్నారు అని అంటున్నారు. దానిని బట్టి చూస్తే ఎన్నికల ప్రచార బాధ్యతలు పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కూడా జగ్గన్ వారికి వివరిస్తారని రానున్న ఎన్నికల విషయంలో దిశానిర్దేశం చేస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ నెల 27న మీటింగ్ మీద ఏపీ రాజకీయ పక్షాలు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.