వైసీపీ వెరీ స్ట్రాంగ్...ఓడించాలంటే సాధ్యమా...!?
By: Tupaki Desk | 4 March 2024 4:54 AM GMTఏపీలో వైసీపీ వెరీ స్టాంగ్ అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అధినాయకత్వం అయితే వై నాట్ 175 అని అంటోంది. పాతికకు ఒక్క సీటు తగ్గకుందా ఎంపీ సీట్లు గెలుచుకుని తీరుతామని కూడా గట్టిగా చెబుతోంది. అసలు వైసీపీ ధీమా వెనక ఉన్న ప్రాతిపదిక ఏమిటి. వ్యూహాలు ఏమిటి అన్నది ఎవరికైనా కలిగే ప్రశ్నలే.
ఏ ఆలోచన చేయాలన్న రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి. అఫ్ కోర్స్ ప్రత్యర్ధులను కార్నర్ చేసేందుకు తామే బలంగా ఉన్నామని చెబుతూ ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ఎప్పటికపుడు చెక్ చేసుకోవడం అధినాయకత్వాలు చేసే పని. వారికి తరచూ నివేదికలు ఉంటాయి. ఇక అధికార పార్టీ అయితే ఇంటలిజెన్స్ రిపోర్టులు అందుబాటులో ఉంటాయి.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఏపీలో వైసీపీ అయిదేళ్ల కాలంలో మరింతగా బలపడింది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అంటే 2019 ఎన్నికల్లో దాదాపుగా 50 శాతం దాకా ఓటు షేర్ వైసీపీకి వస్తే ఈసారి అది అయిదు నుంచి పది శాతం పెరిగింది అన్నది ఒక అంచనాగా చెబుతున్నారు.
అంటే అరవై శాతం ఓటు షేర్ వైసీపీ ఈసారి ఎన్నికల్లో తీసుకుంటుంది అన్న మాట. అలాంటపుడు ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా జరిగే పని కాదు అని అంటున్నారు. ఏపీలో టీడీపీకి గతసారి దాదాపుగా నలభై శాతం ఓటు షేర్ వచ్చింది. జనసేనకు ఆరు శాతం వచ్చింది. మరి ఈ రెండు పార్టీలు కలిస్తే నలభై ఆరు శాతం సునాయాసంగా రావాలి. ప్రభుత్వం పట్ల యాంటీ ఇంకెంబెన్సీ ఉంది అన్నది టీడీపీ కూటమి మాట.
అలాంటిది లేదు. పాజిటివ్ వేవ్ ఉంది కాబట్టి మరో పది శాతం ఓటు షేర్ పెరుగుతుంది అని వైసీపీ నేతలు అంటున్నారు. మరి వైసీపీ ఓటు షేర్ అమాంతం పది శాతం పెరిగితే ఎవరి నుంచి ఓట్లు చీల్చుకోవాలి అంటే ప్రత్యర్ధి కూటమి నుంచే అని అంటున్నారు. అపుడు టీడీపీకి వచ్చిన ఓటు షేర్ 40 శాతం నుంచి ఆరు శాతం తగ్గిపోతుంది అని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ ఓటు షేర్ 34 శాతం లోపలే ఉందని గుర్తు చేస్తున్నారు. జనసేన ఓటు షేర్ కూడా ఈసారి తగ్గిపోతుందని అంటున్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా రెండు పార్టీలు కలిస్తే బీజేపీ ఒకవేళ చేరినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ఓటు షేర్ 40 శాతాన్ని మించదు అని వైసీపీ లెక్కలు వేస్తోంది.
అంటే పడే ప్రతీ పది ఓట్లలో ఆరు వైసీపీకి పడితే నాలుగే టీడీపీ కూటమికి పడతాయని అంటున్నారు. ఇక చూస్తే వైసీపీలో కీలక నేతగా సజ్జల రామక్రిష్ణారెడ్డి ఉన్నారు. ఆయన రాజకీయ నేతగానూ ఉన్నారు. దానికంటే ముందు మీడియాలో పనిచేసారు. ఆయన తనదైన విశ్లేషణలు ప్రతీ విషయంలో చెబుతూ ఉంటారు. సజ్జల మనసులో మాటలను ప్రభుత్వం పనితీరుని అయిదేళ్ళ పాటు సాగిన కార్యక్రమలను ఏపీ ఆర్ధిక పరిస్థితి గురించి జగన్ సీఎం అయిన డే వన్ నుంచి ఈ రోజు దాకా జరిగిన కార్యక్రమాల గురించి మీడియాకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు చూస్తే కరోనా సంక్షోభం కొనసాగిన రెండేళ్ల కాలం తీసేసినా ఈ 57 నెలల ప్రస్థానంలో సంక్షేమంతో కూడిన అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, విద్య, వైద్యం ఇలా సామాన్యుడికి అవసరమైన అంశాలలో దేశంలోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా జగన్ పాలన నిలిచిపోతుందని సజ్జల వివరించారు. అందుకే జగన్ వై నాట్ 175 అంటున్నారని చెప్పుకొచ్చారు.
ఏపీలో చంద్రబాబు 2019 ఎన్నికల సమయంలోనే ఘోరంగా విఫలమయ్యాడని ప్రజలు భావించారని, అప్పటికీ ఇప్పటికీ ఆయన ఇంకా బలహీనం అయ్యారని కూడా సజ్జల విశ్లేషిస్తున్నారు. పవన్ షర్మిల గురించి తమకు ఏమీ బెంగ లేదని ఆయన అంటున్నారు. వారిద్దరి విషయంలో వైసీపీ పెద్దగా ఆలోచించదని చంద్రబాబు స్క్రిప్ట్ ని చదవడం వల్లనే పవన్ ని తాము టార్గెట్ చేస్తున్నామని అన్నారు. మొత్తానికి వైసీపీ వెరీ స్ట్రాంగ్ అని ఈసారి ఓటు షేర్ వైసీపీకి భారీగా పెరుగుతుందని వైసీపీ నేతలు అంటున్న మాటల వెనక ఉన్న ధీమా ఏంటో ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.