Begin typing your search above and press return to search.

ఫైనల్ లిస్ట్ లాస్ట్ మినిట్ లో వాయిదా...టెన్షన్ కంటిన్యూ...!?

క్షణమో ఘడియో అన్నట్లుగా జాబితా వెలువడుతుంది అనుకుంటే దాన్ని లాస్ట్ మినిట్ లో వాయిదా వేశారు అని కూడా వార్తలు వచ్చాయి

By:  Tupaki Desk   |   10 Jan 2024 5:40 PM GMT
ఫైనల్ లిస్ట్ లాస్ట్ మినిట్ లో వాయిదా...టెన్షన్ కంటిన్యూ...!?
X

వైసీపీలో ఫైనల్ లిస్ట్ అంటూ బుధవారం అంతా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. బుధవారం పొద్దు పోయిన తరువాత దాదాపుగా ముప్పయి మందికి పైగా ఇంచార్జిలతో తుది జాబితా వెలువడుతుందని పేర్కొంటూ వార్తలు వచ్చాయి. ఆ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయో కొన్ని టీవీ చానల్స్ అతి ఉత్సాహంతో ప్రిడిక్ట్ చేసి ప్రకటించాయి.

క్షణమో ఘడియో అన్నట్లుగా జాబితా వెలువడుతుంది అనుకుంటే దాన్ని లాస్ట్ మినిట్ లో వాయిదా వేశారు అని కూడా వార్తలు వచ్చాయి. ఈ చివరి జాబితాలో చిత్తూరు ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, క్రిష్ణా సహా ఉత్తరాంధ్రాలో కొన్ని కీలక నియోజకవర్గాలలో మార్పులు ఉంటాయని ఇంచార్జిలు కొత్తగా వస్తారని ప్రచారం సాగింది.

అయితే ఇంకా కొన్ని పేర్ల విషయంలో అధినాయకత్వం కసరత్తు చేస్తున్నందువల్ల జాబితా విడుదల ఒకటి రెండు రోజులలో వెలువడే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తుది జాబితా రాకపోయినా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా చేయడంతో ఆయన సీటుకు మంత్రి గుమ్మలూరు జయరాం పేరు ప్రతిపాదించారు అని అర్ధం అవుతోంది.

అదే విధంగా చూస్తే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అలూరు అసెంబ్లీ సీటుకు విరిపాక్షి అనే అభ్యర్ధిని ఖరరు చేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికి రెండు విడతలుగా మొత్తం ముప్పయి ఎనిమిది మంది దాకా అభ్యర్ధులను వైసీపీ ప్రకటించింది. తొలి జాబితాలో పదకొండు మంది రెండవ జాబితాలో 27 మంది అభ్యర్ధులను ప్రకటిచారు.

ఇక మూడవ జాబితాయే చివరి జాబితా కావచ్చు అని అంటున్నారు. అందులో చాలా మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు. ఇక తుది జాబితా కావడంతో చాలా మంది నాయకులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు పెద్ద ఎత్తున రావడం జరుగుతోంది.

ఇక సర్వే నివేదికలతో పాటు తన దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఆధారం చేసుకుని గెలవరు అన్నది కనుక వస్తే మాత్రం ఎంతటి వారు అయినా నిర్మొహమాటంగా పక్కన పెడుతోంది వైసీపీ అధినాయకత్వం. దాంతో ఎవరికి సీటు దక్కుతుందో తెలియక చాలా మంది టెన్షన్ లో ఉన్నారు.

ఇక మొదటి రెండు జాబితాలు సంగతి ఎలా ఉన్నా ఫైనల్ జాబితా మాత్రం చాలా విశేషాలతో ఉంటుంది అని అంటున్నారు. ఈసారి వచ్చే జాబితాలో సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వున్నారు. ఇదిలా ఉంటే చాలా మంది సీనియర్ నేతలు తాడేపల్లికి వస్తున్నా వారికి ఏ రకమైన హామీలు దక్కుతున్నాయో తెలియడంలేదు. ఏది ఏమైనా ఫైనల్ లిస్ట్ తరువాత వైసీపీ టోటల్ అభ్యర్ధుల మీద ఒక క్లారిటీ వస్తుంది. పండుగకు ముందే వైసీపీ ఈ కసరత్తు పూర్తి చేయనుంది అని అంటున్నారు.