వివాద రహితుల చుట్టూ వివాదాలు.. వైసీపీలో కొత్త కోణం!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. వీరిలో కొందరిపై వివాదాస్పద నాయకు లుగా ముద్ర వేసుకున్నారు.
By: Tupaki Desk | 23 Jan 2024 1:30 PM GMTఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. వీరిలో కొందరిపై వివాదాస్పద నాయకు లుగా ముద్ర వేసుకున్నారు. మరికొందరిలో చాలా వరకు తక్కువ సంఖ్యలో మాత్రమే వివాద రహితులు గా ఉన్నారు. ప్రజలు-పని అనే కాన్సెప్టుతోనే ముందుకు సాగారు. తమ చుట్టూ ఏం జరిగినా.. వివాదాలు చోటు చేసుకున్నా.. వారు పట్టించుకోరు. కేవలం తమపనిమాత్రమే తాము చేసుకుని పోతున్నారు. ఇలాంటి వారిలో మచిలీపట్నం ఎంపీ బాల శౌరి, గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఉన్నారు. ఇంకా కొందరు ఉన్నా.. వీరు మాత్రం ఇప్పుడు వార్తల్లోకి వచ్చారు.
దీనికి కారణం.. వివాద రహితులుగా , వ్యక్తిగతంగా ప్రజల నుంచి అభిమాం సొంతం చేసుకున్న నాయకు లుగా వీరు పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి వారు ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పడం చర్చనీ యాంశంగా మారింది. వాస్తవానికి ఏ పార్టీలో అయినా.. పాలు నీళ్ల మాదిరిగా వివాదాస్పద, వివాద రహిత నాయకులు కామన్‌గానే ఉంటారు. అయితే.. వివాద రహితులను కాపాడుకునేందుకు పార్టీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. వివాదాస్పద వ్యక్తులు ఎలానూ బయటకు పోరు కాబట్టి.. వివాదరహితనాయకులను కాపాడే ప్రయత్నాలు జరుగుతాయి.
కానీ, చిత్రంగా.. వైసీపీలో మాత్రం వివాద రహితులుగా, నియోజకవర్గంలో అంతో ఇంతో పనులు చేశారనే పేరు తెచ్చుకుని, అభిమానులను సంపాయించుకున్న ఈ ముగ్గురు నేతలు వెళ్లిపోతున్నా.. పార్టీ ఏ మాత్రం పట్టించుకోలేదు. వల్లభనేని బాలశౌరి పార్టీకి గుడ్ బై చెబుతారని ముందుగానే తెలిసినా.. పార్టీ కనీసం ఆయనను పట్టించుకోలేదు. ఆయనతో చర్చించేందుకు, బుజ్జగించేందుకు కూడా ప్రయత్నించ లేదు. ఇక, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ విషయంలోనూ ఇదే జరిగింది.
సంజీవ్‌కుమార్.. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో స్థానికంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీనిని కూడా వైసీపీ నేతలు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక, ఆ తర్వాత.. ఆయన మొహం కూడా చూడలేదు. ఆయనకు టికెట్ లేదని చెప్పారు. ఇక, ఇప్పుడు.. నరసరావుపేట ఎంపీ లావు కూడా పార్టీకి రిజైన్ చేశారు. ఈయన కూడా వివాద రహితుడుగాపేరు తెచ్చుకున్నారు. నిజానికి గుంటూరులోవైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నప్పుడుకూడా.. లావు ఎవరి పక్షం వహించకుండా.. ప్రజలతోనే ఉన్నారు. పార్టీలైన్ దాటకుండా పనులు చేసుకున్నారు. అయినా.. ఆయన పార్టీని వీడి వెళ్లుతున్నారు. మరి ఇప్పటికైనా.. ఇలాంటి నాయకులను కాపాడుకునే ప్రయత్నం చేస్తారా.? లేదా? అనేది చూడాలి.