Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్సీ మూడో పెళ్లి.. సాక్షి సంతకం చేసింది రెండో భార్యనే!

ఏపీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటర రమణ అనూహ్య రీతిలో వార్తల్లోకి వచ్చారు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 10:29 AM IST
వైసీపీ ఎమ్మెల్సీ మూడో పెళ్లి.. సాక్షి సంతకం చేసింది రెండో భార్యనే!
X

ఏపీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటర రమణ అనూహ్య రీతిలో వార్తల్లోకి వచ్చారు. రాజకీయ నేతలన్నంతనే వచ్చే రోటీన్ వార్తలకు భిన్నంగా తాజా వార్త ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. సినిమాటిక్ గా ఉన్నఆయన మూడో పెళ్లికి సంబంధించిన ట్విస్టు తెలిస్తే విస్మయానికి గురి కావాల్సిందే. ఇప్పటికే రెండో పెళ్లి చేసుకున్న ఆయన.. మూడో భార్యకు రెండో భార్య ఓకే చెప్పటమే కాదు.. వారి పెళ్లి వేళ.. సాక్షి సంతకం ఆమే స్వయంగా చేయటం గమనార్హం.

తాజాగా ఎమ్మెల్సీ జయమంగళ మూడో పెళ్లి కైకలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగింది. ఇంతకూ పెళ్లి కుమార్తె ఎవరంటే.. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ అధికారిణిగా పని చేస్తున్న సుజాతను ఎమ్మెల్సీవివాహమాడారు. వీరి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కైకలూరుసబ్ రిజిస్ట్రార్ వారికి అందజేశారు. ఎమ్మెల్సీ మూడో పెళ్లి.. ఆయన రెండో భార్య.. కొడుకు సమక్షంలో జరగటం గమనార్హం.

ఈ పెళ్లికి సాక్షి సంతకాన్నిరెండో భార్య సునీత స్వయంగా చేశారు. ఇక.. జయమంగళ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో మరణించటంతో రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యతో ఎమ్మెల్సీకి ఒక కుమార్తె కాగా.. రెండో భార్యతో ఒక కుమార్తె.. ఒక కొడుకు ఉన్నారు. మూడో పెళ్లి వేళ హాజరైన కుటుంబ సభ్యుల్లో రెండో భార్య.. ఆమె కుమారుడు ఉన్నారు. ఇక.. తాజాగా పెళ్లాడిన సుజాతకు గతంలో ఒక పెళ్లి జరిగంది. ఆమెకు కూడా ఒక కుమారుడు ఉన్నారు. ఈ పెళ్లి ముచ్చట ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ చర్చకు తెర తీసింది.