Begin typing your search above and press return to search.

జగన్ అండ్ కో దీనికి ఏం సమాధానం చెబుతారు?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులు కాకముందే అక్కడి రాజకీయం రంజుగా మారింది.

By:  Tupaki Desk   |   23 Jun 2024 12:09 PM GMT
జగన్ అండ్ కో దీనికి ఏం సమాధానం చెబుతారు?
X

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులు కాకముందే అక్కడి రాజకీయం రంజుగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దానికి బదులు అన్నట్లుగా ఓవైపు ఆ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వాళ్లు దాడులు చేస్తుంటే.. మరోవైపు ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమ కట్టడాల మీద బాబు సర్కారు ఉక్కుపాదం మోపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో జగన్‌ ఎంత అప్రతిష్ట పాలు కావాలో అంతా అయ్యాడు.

లేటెస్ట్‌గా అమరావతిలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన కూల్చేశారు అధికారులు. దీని గురించి ప్రభుత్వం నుంచి వివరణ రావాల్సి ఉంది. వైసీపీ వాళ్లు మాత్రం అన్యాయంగా పార్టీ ఆఫీస్ కూల్చేశారని లబోదిబోమంటున్నారు.

కానీ కొన్ని వర్గాల ప్రచారం ఏంటంటే.. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను ఛిద్రం చేసేలా పేదలకు పనిగట్టుకుని స్థలాలు కేటాయించడంతో పాటు స్పీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డంగా ఉద్దేశపూర్వకంగా ఈ ఆఫీస్ నిర్మిస్తున్నారని.. దీనికి అనుమతులు కూడా లేవని ప్రచారం జరుగుతుంది .

ఓవైపు వైసీపీ వాళ్లు దీని గురించి గగ్గోలు పెడుతుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో అడ్డగోలుగా ఆ పార్టీ ఆఫీసుల కోసం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి.. సరైన అనుమతులు లేకుండా బిల్డింగ్స్ కట్టేసిన, కడుతున్న విషయాన్ని ఈ రోజు ‘ఈనాడు’ దిన పత్రిక ఆధార సహితంగా బయటపెట్టింది. చాలా చోట్ల ఈ బిల్డింగ్‌లకు పర్మిషన్లు తీసుకోలేదట. రాజ ప్రసాదాల్లాగా పదుల సంఖ్యలో భారీ భవనాలు నిర్మించేస్తున్నారు. తాము ఏం చేసినా అడిగేవాడు లేదు అన్నట్లు, ఎప్పటికీ తామే అధికారంలో ఉంటాం అనే అతి విశ్వాసంతో వైసీపీ అడ్డగోలుగా భూములు ఆక్రమించి పార్టీ ఆఫీస్‌లు కట్టించేస్తున్న విషయంలో ఈ కథనం ద్వారా వెలుగులోకి వచ్చింది. అమరావతి ఆఫీస్ విషయంలోనే సమర్థించుకోలేక సతమతం అవుతున్న జగన్ అండ్ కో.. వీటిన్నటి గురించి ఏం వివరణ ఇస్తుందో.. ఎలా ఈ వ్యవహారం నుంచి బయటపడుతుందో అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.