Begin typing your search above and press return to search.

వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతూ... టీడీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు!

ఇక వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి సహకరిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్.. ఈ మధ్య కాస్త కాం అయినట్లు కనిపిస్తున్నారు

By:  Tupaki Desk   |   25 March 2024 12:15 PM GMT
వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతూ... టీడీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు!
X

ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు, లోకేష్, పవన్ లు వాలంటీర్లపై విమర్శలు చేయడం మానేసినట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే! ఒకానొక సమయంలో ఇంట్లో మగాళ్లు లేనప్పుడు ఇంటికొచ్చె వాలంటీర్లు అంటూ నవ్విన చంద్రబాబు, గోనె సంచులు మోసే ఉద్యోగం అని ఎగతాలి చేసిన చంద్రబాబు... తర్వాత కాలంలో వారి విషయంలో వాయిస్ మార్చారు! ఇదే సమయంలో లోకేష్ కూడా వాలంటీర్లపై ఎన్నికల వేళ వాయిస్ తగ్గించారు!

ఇక వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి సహకరిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్.. ఈ మధ్య కాస్త కాం అయినట్లు కనిపిస్తున్నారు. అయితే కొంతమంది టీడీపీ నేతలు, వారి సానుభూతిపరులుగా పేరు పొందినవారు మాత్రం తమ అక్కసును కంటిన్యూ చేస్తూనే ఉన్నారు! ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ సీఈసీ నిమ్మగడ్డ ప్రసాద్... ఈ రెండు నెలలూ వాలంటీర్లను ఇంట్లో కుర్చోబెట్టాలని, పించను తీసుకునేవారు సచివాలయానికి వెళ్లి తెచ్చుకుంటారని వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ఏకంగా వాలంటీర్లను ఉగ్రవాదుల తరహాలో స్పీలర్ సెల్స్ అని.. టెర్రరిస్టులు బాంబులు పేల్చే ప్లానింగ్ లో భాగంగా రిక్రూట్ చేసుకునే స్పీలర్ సెల్స్ లాంటి వారని, వీరు రేషన్ వేయడం లేదని, పించన్ డబ్బులు ఇవ్వడం లేదని చెబుతూ తీవ్ర విమర్శలు చేశారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. దీంతో... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి వివాదాస్పద విమర్శల వల్ల ఒరిగేదేమిటి అని ప్రశ్నిస్తున్నారు తమ్ముళ్లు! పైగా ఈ ఎఫెక్ట్ రాష్ట్రం అంతా ఉంటుందని గుర్తుచేస్తున్నారు.

అవును... ఇంటింటికీ పింఛన్లు, రేషన్ బియ్యం ఇవ్వడానికి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు జగన్ చెబుతున్నారని.. అయితే అవేమీ వాలంటీర్లు ఇవ్వడం లేదని విమర్శ చేశారు బొజ్జల సుధీర్ రెడ్డి! ఇదే సమయంలో... ఏ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, అందులో ఎవరు ఏమి చేస్తున్నారు, ఎవరికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఎవరు ఏపార్టీకి చెందిన వారు అనే డేటా మాత్రం వారివద్ద ఉందని. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వాళ్లను ఎలా తొక్కొచ్చు అనే మొత్తం విషయాలు వాలంటీర్ కు తెలుసని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో... జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలోంచి పుట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది స్లీపర్ సెల్స్ లాంటిదని సుధీర్ రెడ్డి అన్నారు. జీహాదీలు, టెర్రరిస్టులు బాంబు బ్లాస్ట్ ల కోసం స్లీపర్ సెల్స్ ని అన్నిచోట్లా పెడతారని.. అదే టైపులో ఎలక్షన్స్ కోసం పనిచేసే స్లీపర్ సెల్స్ వాలంటీర్ వ్యవస్థ అని బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు! దీంతో నెట్టింట సుధీర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి!