Begin typing your search above and press return to search.

చంద్ర వ్యూహం : వైసీపీ రాజ్యసభ ఎంపీలు టీడీపీ గూటిలోకి ?

వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలలో కొందరు టీడీపీ వైపు చూస్తున్నారా అంటే జరుగుతున్న ప్రచారం చూస్తే విస్తృతంగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   16 July 2024 3:30 PM GMT
చంద్ర వ్యూహం : వైసీపీ రాజ్యసభ ఎంపీలు టీడీపీ గూటిలోకి ?
X

వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలలో కొందరు టీడీపీ వైపు చూస్తున్నారా అంటే జరుగుతున్న ప్రచారం చూస్తే విస్తృతంగా సాగుతోంది. బీజేపీకి రాజ్యసభ లో మెజారిటీ లేదు. 11 మంది రాజ్యసభ ఎంపీలతో ఏపీలో రెండవ పార్టీ లేకుండా మొత్తం తానే అయిన వైసీపీని బీజేపీ ఆశ్రయించాల్సి వస్తుంది.

అదే కనుక జరిగితే కేంద్ర ప్రభుత్వం వద్ద వైసీపీ విలువ పెరుగుతుంది. ఏపీలో అధికారం లేకపోయినా ఢిల్లీ స్థాయిలో కొంత పట్టు సాధించి ఏపీలో రాజకీయంగా కొంత వరకూ మనుగడ సాగించడానికి అది ఉపయోగపడుతుంది.

అయితే ఆ విధంగా చేస్తే ఏపీలో టీడీపీ బీజేపీ ప్లస్ జనసేన కూటమికి వైసీపీ గట్టి ప్రత్యర్థిగా మారుతుంది. దాంతో వైసీపీకి ఎలాంటి చాన్స్ లేకుండా చేయాలంటే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను కొంతమందిని లాగేయడమే ఆలోచన టీడీపీకి ఉంది అని అంటున్నారు.

అయితే ఇదే విషయం మీద చర్చించేందుకే బాబు ఢిల్లీకి వెళ్తారు అని అంటున్నారు. నిజానికి సడెన్ గా బాబు ఢిల్లీ వెళ్ళడానికి పెద్దగా అధికార అజెండా ఏదీ లేదని అంటున్నారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ మీద ఆ పార్టీ వర్గాలు కూడా మామూలు టూర్ గానే చెబుతున్నారు. ఈ టూర్ లో బాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలుస్తారని తెలుస్తోంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలుస్తారు అని అంటున్నారు.

వీలైతే కొంతమంది కేంద్ర మంత్రులను కలుస్తారు అని అంటున్నారు. అయితే బాబు ఢిల్లీ అజెండా వేరు అని అంటున్నారు. అది పొలిటికల్ అజెండా అని అంటున్నారు. రాజ్యసభలో బీజేపీకి బలం తగ్గడంతో ఆ పార్టీ వైసీపీ వైపు చూస్తోంది. ఆ విధంగా కాకుండా వారిలో కొందరు తమ వైపు ఉన్నారని టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బాబు అమిత్ షాకు చెబుతారు అని అంటున్నారు. ఆ విధంగా వారిని తాము చేర్చుకుంటున్నట్లుగా చెప్పడంతో పాటు రాజ్యసభలో బీజేపీకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా వివరిస్తారని అంటున్నారు.

ఇదిలా ఉంటే రాజ్యసభలో వైసీపీ ఎంపీలు కొందరు వైసీపీ పట్ల కొంత అసంతృప్తి గా ఉన్నారని అంటున్నారు. వారంతా కూడా వైసీపీకి భవిష్యత్తు ఏ మేరకు ఉంటుందో తెలియక అయోమయంలో ఉంటున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే అధికార పార్టీలో చేరితే తమ ప్రయోజనాలు నెరవేరుతాయని వారు భావిస్తున్నారు అని అంటున్నారు.

అయితే వారంతా బీజేపీలో చేరితే ఏపీలో పెద్దగా మాట్లాడే అవకాశం ఉండదు. ఏపీ వరకూ చూస్తే టీడీపీలో ఉంటే తమకు అన్ని విధాలుగా బాగుంటుందని తద్వారా వారికి పొలిటికల్ మైలేజ్ ఉంటుందని వారు భావిస్తున్నారు అని అంటున్నారు.

ఈ రకంగా టీడీపీలో చేరడానికి ఆసక్తిని చూపిస్తున్న వారిలో విశాఖ జిల్లాకు చెందిన గొల్ల బాబూరావు, అలాగే నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావు, తెలంగాణకు చెందిన ఆర్ క్రిష్ణయ్య, కడపకు చెందిన మేడ మల్లికార్జున రావు ఉన్నారని అంటున్నారు. ఇక అంబానీ కోటాలో వైసీపీ ద్వారా ఎంపీ అయిన పరిమళ్ నత్వానీ మద్దతు కూడా బీజేపీకి ఉంటుందని అంటున్నారు. అంటే రాజ్యసభలో బీజేపీకి వైసీపీ నుంచి ఐదుగురు ఎంపీల మద్దతు దక్కుతుందని తెలుస్తోంది.

ఈ విషయాల మీద మాట్లాడేందుకు బాబు అమిత్ షాను కలుస్తున్నారు అని అంటున్నారు. టీడీపీలోకి వైసీపీ ఎంపీలు వస్తే కనుక అది ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఎమ్మెల్సీలు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తారు అని అంటున్నారు. అలాగే సీనియర్ నేతలు కూడా ఆ వైపుగా చూస్తున్నారు అని చెబుతున్నారు. సో రానున్న రోజులలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.