Begin typing your search above and press return to search.

సిట్టింగులకు టెన్షన్ తగ్గించే ప్లాన్ లో వైసీపీ

ఎన్నికలు దగ్గరలో ఉండడంతో అధికార వైసీపీ టికెట్లను ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద తీవ్ర కసరత్తు చేస్తోంది. సర్వేల మీద సర్వేలు కూడా చేస్తోంది. ఈ నేపధ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కొత్త వారు వస్తారని ఇప్పటిదాకా వినిపించింది.

By:  Tupaki Desk   |   22 July 2023 4:54 PM GMT
సిట్టింగులకు టెన్షన్ తగ్గించే ప్లాన్ లో వైసీపీ
X

ఎన్నికలు దగ్గరలో ఉండడంతో అధికార వైసీపీ టికెట్లను ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద తీవ్ర కసరత్తు చేస్తోంది. సర్వేల మీద సర్వేలు కూడా చేస్తోంది. ఈ నేపధ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కొత్త వారు వస్తారని ఇప్పటిదాకా వినిపించింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇచ్చేలాగానే సీన్ కనిపిస్తోంది అని అంటున్నారు.

విశాఖ జిల్లాలో చూసుకుంటే ఇటీవల కొందరు సిట్టింగులకు మళ్ళీ టికెట్లు ఖాయమన్న భావన ఏర్పడింది. ఎలమంచిలిలో సీనియర్ ఎమ్మెల్యే కన్నబాబురాజుకే మరోసారి టికెట్ అని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆయనకు అంగబలం అర్ధబలం నిండుగా ఉండడంతోనే మరో దఫా టికెట్ ఇచ్చేందుకు హై కమాండ్ ఓకే చెప్పింది. కన్నబాబు వయసు 72 ఏళ్ళు. మరోసారి ఆయన పోటీ పడబోతున్నారు.

అదే విధంగా నర్శీపట్నంలో ఉమా శంకర్ గణేష్ కి మళ్లీ టికెట్ దక్కడం ష్యూర్ అంటున్నారు. ఆయన మీద పోటీగా టికెట్ రేసులో ముందు ఉన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడి ఇంట్లో ఉన్న కీలక పదవిని వైసీపీ హై కమాండ్ తీసేయడం విశేషం. సన్యాసిపాత్రుడు సతీమణి అనితను డీసీసీబీ చైర్మన్ పదవి నుంచి సడెన్ గా పక్కన పెట్టడం అంటే సన్యాసిపాత్రుడి సేవలు ఇక చాలు అన్న సంకేతమే అంటున్నారు.

ఈ పరిణామంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2024లో సైతం అయ్యన్నపాత్రుడిని ఢీ కొట్టేది తన నేత, ఎమ్మెల్యే గణేష్ అని ఈసారి కూడా మంచి మెజారిటీతో గెలుస్తారు అని అంటున్నారు.

అదే విధంగా డౌట్ లో పడింది యువ ఎమ్మెల్యే సీటు అనుకున్నది విశాఖలోని పెందుర్తి. అదీప్ రాజ్ మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేస్తారు అని వైఎస్సార్ జయంతి సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దాంతోనే ఆ సీటు మీద ఆశపడిన పంచకర్ల రమేష్ బాబు అలిగి జనసేనలోకి జంప్ అయ్యారని అంటున్నారు.

అదే విధంగా అనకాపల్లి నుంచి యువ మంత్రి గుడివాడ అమరనాధ్ ని మళ్ళీ పోటీకి పెడతారు అని అంటున్నారు. అలాగే విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ మళ్లీ పోటీ చేస్తారని తేలుతోంది. అందుకే అదే నియోజకవర్గానికి చెందిన కోలా గురువులుని డీసీసీబీ చైర్మన్ చేయడమే కాకుండా విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ గా నియమించారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే విశాఖ ఉత్తరం సీటు కేకే రాజుకే కన్ ఫర్మ్ అని 2019లో ఆయన ఓడిన నాటి నుంచే నిర్ణయించేశారు. అలా కనుక చూసుకుంటే విశాఖ రూరల్ జిల్లాలో చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ, మాడుగుల నుంచి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, అరకు నుంచి శెట్టి ఫల్గుణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఉంది.

ఇక పెండింగులో ఉన్న సీట్లలో పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి, గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి, భీమునిపట్నం నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, విశాఖ తూర్పు నియోజకవర్గంతో పాటు, పాయకరావుపేట సీట్ల విషయంలో మాత్రం ఇంకా ఒక డెసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది.