Begin typing your search above and press return to search.

జాతీయ రాజకీయాలలో వైసీపీ షాకింగ్ డెసిషన్..?

కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాదు అని సర్వేలు తేల్చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 May 2024 3:40 AM GMT
జాతీయ రాజకీయాలలో వైసీపీ షాకింగ్ డెసిషన్..?
X

కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాదు అని సర్వేలు తేల్చేస్తున్నాయి. ఇప్పటికి అయిదు విడతలుగా పోలింగ్ ముగిసింది. దానికి సంబంధిచిన సరళి తమకే అనుకూలంగా ఉంటుందని ఇండియా కూటమి లెక్క వేసుకుంటోంది. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బలమా వాపా అన్నది తెలియడం లేదు అని అంటున్నారు.

అయితే బీజేపీకి ఎంత ప్రయత్నం చేసినా 200 నంబర్ సొంతంగా దాటదని ఎన్డీయే మిత్రులతో కలిపిస్తే 250 దాకా వచ్చి ఆగిపోతుందని అంటున్నారు. 272 మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేయాలంటే బయట నుంచి ఎంపీల మద్దతు తీసుకోవాల్సిందే. అలా ఎవరు ఉన్నారు అంటే ఒడిషాలో బీజేడీ ఉంది. ఆ పార్టీకి కచ్చితంగా పది మంది ఎంపీలు అయినా వస్తారు.

అలాగే తెలంగాణాలో చూస్తే బీఆర్ఎస్ ఉంది. ఆ పార్టీకి ఈసారి ఒక్కటి రెండు ఎంపీ సీట్లు అయినా వస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. వస్తే ఎన్డీయేకు సపోర్టు చేస్తారా అన్నది మరో చర్చ. ఇక ఏపీలో ఇండియా ఎన్డీయే కూటములకు దూరంగా న్యూట్రల్ పార్టీగా వైసీపీ ఉంది.

వైసీపీకి డబుల్ డిజిట్ నంబర్ ఎంపీలు రావచ్చు అన్నది ఒక చర్చ. ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే కనుక ఆ సంఖ్య 15కి పెరగవచ్చు అన్నది మరో చర్చ. ఏది ఏమైనా వైసీపీ ఎంపీలు కేంద్రంలోని బీజేపీకి చాలా కీలకంగా మారుతారు.

అయితే ఎన్డీయేలో టీడీపీ మిత్రుడిగా ఉంది. పైగా ఎన్డీయేకు వైసీపీ సపోర్ట్ చేస్తే ఏర్పడే ప్రభుత్వంలో ఏపీ నుంచి టీడీపీ మంత్రులు కూడా కేంద్రంలో ఉంటారని అంటున్నారు. మరి ఏపీలో ఉప్పూ నిప్పులా ఉండే వైసీపీ టీడీపీల మధ్య రాజకీయం సలసలా మరుగుతూ ఉంటుంది. అలాంటిది టీడీపీ కేంద్రంలో మంత్రి పదవులు నిర్వహిస్తే బయట నుంచి మద్దతు ఇస్తూ ఆ పల్లకి మోయడానికి వైసీపీ సిద్ధపడుతుందా అన్నదే ఇక్కడ చర్చ.

అపుడు వైసీపీ కండిషన్లు పెట్టే చాన్స్ ఉందని టీడీపీని తీసుకోమని అంటేనే మద్దతు ఇస్తామని చెప్పవచ్చునని అంటున్నారు. అయితే బీజేపీతో డైరెక్ట్ గా పొత్తులో ఉన్న టీడీపీని కాదని కమలనాధులు అంటారా అన్నది కూడా ప్రశ్నగానే ఉంటుంది.

ఏది ఏమైనా ఏపీలో మొత్తం పాతిక సీట్లను తన ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ చూస్తోంది కానీ ఈసారి ఆ పార్టీకి చాలా ఇబ్బందులు రావచ్చు అని అంటున్నారు. 2014లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. కాబట్టి వైసీపీ మద్దతు అవసరం లేకపోయింది. అయినా వైసీపీ పరోక్ష చెలిమి చేసింది అని అంటారు.

అలాగే 2019లో కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కడంతో వైసీపీకి ఎంపీలు భారీగా ఉన్నా కూడా పెద్దగా ఉపయోగం పడలేదు. అయినా కీలక బిల్లుల సమయంలో మద్దతు ఇచ్చింది. అపుడు టీడీపీ ఎన్డీయే మిత్రుడు కాదు కాబట్టి అలా సరిపోయింది. కానీ ఈసారి పొరపాటున బీజేపీకి మెజారిటీ తగ్గి వైసీపీ అవసరం పడితేనే అసలైన రాజకీయ మసాలా ఉంటుందని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే ఏపీ రాజకీయాలు కమల దళానికి ఏ మాత్రం మింగుడు పడవని అంటున్నారు. న్యూట్రల్ విధానం అవలంబించి ఉంటే రెండు పార్టీల మద్దతూ దక్కేదని అలా కాకపోతే మాత్రం వైసీపీ ఇండియా కూటమి వైపు జరిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.