వైసీపీలో వీరికి టికెట్లు డౌటేనా...?
ఉమ్మడి విశాఖ జిల్లా తీసుకుంటే భీమునిపట్నం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు టికెట్ కష్టం అని అంటున్నారు
By: Tupaki Desk | 8 Dec 2023 3:59 AM GMTకచ్చితంగా గెలిచే వారికే ఈసారి టికెట్లు ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది అని టాక్ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హోరా హోరీ పోరు ఈసారి సాగుతుంది కాబట్టి ఎలాంటి చాన్స్ తీసుకోకూడదు అని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది. దాంతో టికెట్లు అయితే చాలా మందికి దక్కే చాన్స్ అయితే కనిపించడంలేదు అని అంటున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా తీసుకుంటే భీమునిపట్నం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు టికెట్ కష్టం అని అంటున్నారు. ఆయన పట్ల జనంలో వ్యతిరేకత ఉందని ప్రచారం అయితే ఉంది. ఇపుడు ఎటూ వైసీపీ హై కమాండ్ ఈ విషయంలో కఠినంగా ఉండబోతోంది అని అంటున్నారు. దాంతో భీమిలీ ఎమ్మెల్యేకు రెడ్ మార్క్ పెడతారు అని అంటున్నారు.
అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి కూడా టికెట్ దక్కదనే ప్రచారం సాగుతోంది. ఆయన పట్ల జనంలో వ్యతిరేకత ఉందని, వైసీపీతో కూడా ఆయనకు సఖ్యత లేదని అంటున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను పాత ముఖం కింద నియోజకవర్గంలో చూస్తున్నారు. దాంతో అక్కడ నుంచి కోలా గురువులుని వైసీపీని నిలబెట్టాలని చూస్తోంది అని అంటున్నారు.
గాజువాక నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వరని అంటున్నారు. ఆయన కుమారుడికి టికెట్ అడుగుతున్నా ఆ ఫ్యామిలీకి ఇస్తే పనిచేయమని వైసీపీలోనే ఒక వర్గం అంటోందని టాక్. దాంతో ఇక్కడ బలమైన అభ్యర్ధిని బరిలోకి దించబోతున్నారు. అనకాపల్లి నుంచి మంత్రి గుడివాడ అమరనాధ్ ని ఎంపీగా అనకాపల్లి నుంచి పోటీ చేయించి గవర సామాజిక వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వైసీపీ ప్రతిపాదిస్తోంది అని అంటున్నారు. గుడివాడకే టికెట్ ఇస్తే ఈ సీటు వదిలేసుకోవాల్సిందే అని సర్వేలు చెబుతున్నాయని అంటున్నారు.
అలాగే ఎలమంచిలి సీనియర్ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు కూడా ఈసారి టికెట్ కష్టం అని తెలుస్తోంది. ఆయన తన కుమారుడు సుకుమారవర్మకు టికెట్ కోరుతున్నారు. కానీ హై కమాండ్ మాత్రం బలమైన కాపు సామాజికవర్గం నేతను ఈ సీటు నుంచి పోటీ చేయించనుంది అని అంటున్నారు. పాయకరావుపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కూడా టికెట్ దక్కదని అంటున్నారు. ఆయనకు మూడు సార్లు వైసీపీ చాన్స్ ఇచ్చింది. అలాగే అమలాపురం నుంచి ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది.
ఈ సీటులో కొత్త వారిని దించాలని చూస్తున్నారు. చాలా మంది ఈ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో వైద్యులు కూడా ఉన్నారు. దాంతో వారిలో ఒకరిని నిలబెడితే మంచి ఫలితాలు వస్తాయని వైసీపీ భావిస్తోంది. అదే విధంగా పాడేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కె భాగ్యలక్షిమిని మార్చాలని చూస్తున్నారు. అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే విశాఖ జిల్లాలో సగానికి సగం మందికి ఈసారి టికెట్లు దక్కవని టాక్ అయితే బలంగా ఉంది అని అంతున్నారు.