Begin typing your search above and press return to search.

వైసీపీకి అవన్నీ టఫ్ సీట్లేనా ?

ఏపీలో వైసీపీ ఈజీగా గెలుచుకునే సీట్లు కొన్ని ఉన్నాయి. టఫ్ గా ఉండే సీట్లు కొన్ని ఉన్నాయి.

By:  Tupaki Desk   |   1 May 2024 12:30 PM GMT
వైసీపీకి అవన్నీ టఫ్ సీట్లేనా ?
X

ఏపీలో వైసీపీ ఈజీగా గెలుచుకునే సీట్లు కొన్ని ఉన్నాయి. టఫ్ గా ఉండే సీట్లు కొన్ని ఉన్నాయి. అక్కడ హోరా హోరీ పోరు సాగుతోంది. అనేక రకాలైన సర్వేలు కూడా అదే విషయం స్పష్టం చేస్తున్నాయి. ఇక ఏ సర్వే అవసరం లేకుండా జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో జనంలోకి వెళ్లారు. ఆయన మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలని తిరిగారు.

ఆయనకు గ్రౌండ్ రియాల్టీస్ బాగానే తెలిసాయని అంటున్నారు. పార్టీ ఎక్కడ వీక్ గా ఉంది. ఎక్కడ టఫ్ ఫైట్ సాగబోతోంది అన్నది చూసుకుని మరీ జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసారు. రోజుకు మూడు సభలు వంతున ఆయన ఏప్రిల్ 28 నుంచి మొదలుపెట్టారు. ఇప్పటికి పన్నెండు నియోజకవర్గాలలో సభలు జరిగాయి.

మరో పది రోజులలో ముప్పయి సభలు ఉంటాయి. అంటే టోటల్ గా 42 దాకా అసెంబ్లీ సీట్లు వైసీపీకి టఫ్ గా ఉండబోతున్నాయా అన్న చర్చకు తెర లేస్తోంది. జగన్ తొలి రోజు నుంచి చేస్తున్నఎన్నికల ప్రచారం చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో చోడవరం, పాయకరావుపేట, బొబ్బిలి. అలాగే పి గన్నవరం, అనపర్తి, గుంటూరు జిల్లా పొన్నూరు, కడప జిల్లాలోని మైదుకూరు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ఇలా ఉన్నాయి.

రానున్న రోజులల్లో కూడా జగన్ కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు అని అంటున్నారు. ఆయా చోట్ల టీడీపీ జనసేన కూటమితో పోటీ గట్టిగా సాగబోతోంది అని అంటున్నారు. దాంతో జగన్ అక్కడికి వెళ్ళి దూకుడుగానే ప్రచారం చేస్తున్నారు.

జగన్ పర్యటన తరువాత చూస్తే పరిస్థితిలో కొంత మార్పు వస్తోందని చెబుతున్నా కూడా ఆ పాజిటివ్ టెంపోని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే వైసీపీ అభ్యర్ధుల మీదనే ఉంది అని అంటున్నారు. ఇక జగన్ ఈసారి ఎక్కువగా గోదావరి జిల్లాలు, అలాగే ఉత్తర కోస్తా జిల్లాల మీదనే దృష్టి పెట్టారు అని అంటున్నారు.

ఇక్కడ టీడీపీ జనసేన బలంగా ఉండడంతో పాటు ఆ రెండు పార్టీలకు 2019లలో వచ్చిన ఓట్లను లెక్కిస్తే కనుక వైసీపీ మైనస్ లోకి వెళ్తోంది అన్నది కళ్ళకు కనిపించే లెక్క. అయితే అయిదేళ్లలో అనేక మార్పులు వచ్చాయి కాబట్టి ఓట్లు అన్నీ అటూ ఇటూ ఒకేలా పడవు అనుకున్నా ప్రభుత్వంలో ఉన్న వారికి యాంటీ ఇంకెంబెన్సీ కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రభావాన్ని సైతం తగ్గించుకోవడానికి జగన్ ఈ ఎన్నికల ప్రచారంలో కీలక స్థానాలనే ఫోకస్ చేశారు అని అంటున్నారు.

ఇలా జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నలభైకి పైగా స్థానాలలో సగానికి పైగా స్థానాలు కనుక వైసీపీ గెలుచుకుంటే మరోసారి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. అందుకే రోజుకు మూడు మీటింగ్స్ పెట్టుకుని భారీ షెడ్యూల్ తో జగన్ ఈ ఎన్నికల ప్రచారాన్ని జోరెత్తిస్తున్నారు అని చెబుతున్నారు.