Begin typing your search above and press return to search.

చిరంజీవి టార్గెట్ చేసింది ఆ వైసీపీ ఎంపీని..?

మెగాస్టార్ చిరంజీవి వైసీపీ లో కీలక నేత రాజ్యసభ ఎంపీ అయిన వి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ కీలక కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 1:45 AM GMT
చిరంజీవి టార్గెట్ చేసింది ఆ వైసీపీ ఎంపీని..?
X

మెగాస్టార్ చిరంజీవి వైసీపీ లో కీలక నేత రాజ్యసభ ఎంపీ అయిన వి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ సోమవారం జరిగిన వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో కీలక కామెంట్స్ చేశారు. కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డి రాజ్యసభలో సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలకు కోరుతూ చేసిన ఒక ప్రసంగం మీదనే చిరంజీవి టార్గెట్ చేశారు అని అంటున్నారు.

అసలు చిరంజీవి ఏమి మాట్లాడారు అన్న దాని మీద ఫుల్ క్లారిటీ ఇస్తూ ఆనాటి ఆయన ప్రసంగం మీద వీడియోను రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి అని మాట్లాడారు. అలా చేస్తేనే చిత్ర పరిశ్రమ బాగుంటుంది, అందరికీ ఉపాధి దొరుకుతుంది అని అన్నారు. ఒక హీరో సినిమా చేస్తే చాలా క్రాఫ్టులకు సంబంధించి ఉపాధి దొరుకుతుంది అని అన్నారు.

హీరోల రెమ్యునరేషన్ గురించి పెద్దల సభలో మాట్లాడుతున్నారని ఆయన ఇండైరెక్ట్ గా విజయసాయిరెడ్డి ప్రసంగాన్ని ప్రస్తావించారు. దేశంలో ఏ సమస్యా లేనట్లుగా కేవలం హీరోల రెమ్యునరేషన్ సమస్య అయినట్లుగా పెద్దల సభలో ప్రస్థావించడమేంటి ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు సినీ పరిశ్రమ కోట్లాది రూపాయలను ఖర్చు చేసి సినిమా తీస్తోందని,అందువల్లనే అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్లిందని అన్నారు.

చేతనైతే సినిమాకు చేయూతను ఇవ్వండి అంతే కానీ రెమ్యునరేషన్లు అంత ఎందుకు అని కామెంట్స్ చేయడమేంటి అని ఫైర్ అయ్యారు. హీరోలకు మార్కెట్ ఉంటేనే రెమ్యునరేషన్ ఇస్తారని చిరంజీవి అన్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా కానీ రోడ్ల విషయం కానీ ప్రాజెక్టుల గురించి కానీ మౌలిక సదుపాయాల గురించి కానీ పనిచేయాలని అన్నారు. పేదల కడుపుని నింపే కార్యక్రమాలను చేస్తే అంతా సంతోషిస్తారు అని చెప్పి చిరంజీవి తన ప్రసంగం అక్కడితో ఆపారు.

అయితే అది మీడియాలో వేరేగా స్ప్రెడ్ అయింది. నిజానికి చిరంజీవి స్మూత్ గానే చెప్పాల్సింది చెప్పారనీ అంటున్నారు. ఆయన రిక్వెస్టింగ్ మోడ్ లోనే మాట్లాడారు. అయితే ఏపీలో అంబటి వర్సెస్ బ్రో సినిమాల మధ్య రచ్చ సాగుతోంది. పవన్ రెమ్యునరేషన్ విషయం గురించి అంబటి ప్రశ్నించారు. దాంతో ఇష్యూ ఇదని అనుకున్నారు. అయితే అన్యాపదేశంగా ఈ పాయింట్ కూడా చిరంజీవి స్పీచ్ లో ఉంటే ఉండొచ్చు కానీ మెయిన్ గా ఆయన టచ్ చేసింది ఇటీవల విజయసాయిరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగం మీదనే అని అంటున్నారు.

ఇక ఆయన బాలీవుడ్ హీరోల పేరుని ప్రస్థావించారు. అందులో సల్మాన్ ఖాన్ ఉన్నారు. అయితే బాలీవుడ్ నుంచి అయితే విజయసాయిరెడ్డి స్పీచ్ కి ఎక్కడా రియాక్షన్ రాలేదు. ఇక ఆయన స్పీచ్ ఇచ్చి కూడా చాలా రోజులు అయింది. ఇపుడు తాపీగా చిరంజీవి దాన్ని పట్టుకుని లేటెస్ట్ గా లేవనెత్తారు. ఆయన అక్కడితో కాకుండా రోడ్లు, ప్రాజెక్టులు అంటూ మరికొన్ని పాయింట్ల్స్ యాడ్ చేయడం, ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేనగా ఇష్యూ ఉండడంతోనే వివాదం పెరిగింది.

అయినా సరే విజయసాయిరెడ్డి ప్రసంగం అంటే కూడా అది వైసీపీని టచ్ చేసినట్లే అని అంటున్నారు. మొత్తానికి చిరంజీవి మాత్రం వైసీపీ మీద బాణాలు బాగానే వేశారు అని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తూంటే ఏపీలో మాత్రం వైసీపీ దాడి ఎక్కువైంది.