Begin typing your search above and press return to search.

విశాఖ తూర్పులో వైసీపీకి మార్పు తెచ్చేది అతడేనా...?

దీంతో ఇప్పటిదాకా విశాఖ తూర్పు ఇంచార్జిగా ఉన్న వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ అకర్మాని నిర్మలా మాజీ లీడర్ అయిపోయారు

By:  Tupaki Desk   |   26 Aug 2023 10:23 AM GMT
విశాఖ తూర్పులో వైసీపీకి మార్పు తెచ్చేది అతడేనా...?
X

ఏపీలో ఎంతటి జగన్ ప్రభంజనం 2019 ఎన్నికల్లో వీచినా ఆ పార్టీకి కొరుకుడు పడని సీట్లు చాలానే ఉన్నాయి. ఉత్తరాంధ్రాలో తీసుకుంటే విశాఖ సిటీలో ఈ రోజుకీ టీడీపీకి గట్టి బలం ఉంది. ఆ పార్టీకి బలమైన నాయకత్వం కూడా ఉంది. అందుకే వైసీపీ అధికారంలో ఉండగా 2021లో పెట్టిన జీవీఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించినా కూదా 30కి తగ్గకుండా కార్పోరేటర్లను గెలిపించుకుంది.

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎన్నికల్లో సైతం విశాఖ నుంచి సాలిడ్ గా టీడీపీకి ఓట్లు పడడం వల్లనే ఆ పార్టీ అభ్యర్థి గెలిచారు అని అంటున్నారు. ఇలా చూసుకుంటే విశాఖ సిటీలోని నాలుగు సీట్లలో టీడీపీ బలంగా ఉంది. దాంతో సౌత్ నుంచి రెండవసారి టీడీపీ ఎమ్మెల్యేగా నెగ్గిన వాసుపల్లి గణేష్ కుమార్ ని వైసీపీలోకి తీసుకున్నారు.

ఇక విశాఖ నార్త్ నుంచి కేకే రాజుని వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెడుతున్నారు. విశాఖ పశ్చిమ నుంచి బలమైన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ని పోటీ చేయిస్తున్నారు. విశాఖ తూర్పు మాత్రం వైసీపీకి ఎంతకీ తెగడంలేదు. దాంతో అన్ని రకాలుగా ఆలోచన చేసి మరీ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఆ సీటు బాధ్యతలు అప్పగించారు. దీని మీద గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్నా అఫీషియల్ గా వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జి గా బాధ్యతలను అప్పగించింది అధినాయకత్వం.

దీంతో ఇప్పటిదాకా విశాఖ తూర్పు ఇంచార్జిగా ఉన్న వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ అకర్మాని నిర్మలా మాజీ లీడర్ అయిపోయారు. ఆమె 2019 ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి 47 వేల ఓట్లతో 2014లో గెలిచిన వెలగపూడి మెజారిటీని పాతిక వేలకు తగ్గించగలిగారు. అయితే వైసీపీలో మరో కీలక నేతగా ఉన్న వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ దక్కపోవడం వల్లనే ఓటమి పాలు అయ్యామని ఆమె వర్గం అప్పట్లో అరోపించింది.

ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ తూర్పు సీటు కోసం ముగ్గురు లీడర్ల మధ్య పోటీ ఉంది. విశాఖ మేయర్ హరి వెంకట కుమారితో పాటు, ఎమ్మెల్సీ వంశీ, వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మల ఈ సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఈ ముగ్గురూ తూర్పులో బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన వారు. అయితే వీరిని కాదని ఎంపీ ఎంవీవీని బరిలోకి వైసీపీ దింపడం వ్యూహాత్మకం అని అంటున్నారు

ఇక్కడ సామాజిక సమీకరణలతో 2014, 2019 ఎన్నికలను ట్రై చేసిన వైసీపీకి అవి సెట్ కాలేదు, వాటి కంటే ఇక్కడ అంగబలం, అర్ధ బలం కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి అర్ధమైంది. అందుకే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి పోటీ పెట్టాలని వైసీపీ డిసైడ్ అయింది. వెలగపూడి రామక్రిష్ణబాబు టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు మూడు సార్లు ఆయన గెలిచారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయనతో పోటీ పడేది మరో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఎంవీవీ సత్యనారాయణ అని అంటున్నారు.

ఈ ఇద్దరూ ఢీ అంటే ఢీ కొట్టగల సమర్ధులు. దాంతో వైసీపీ ఆచీ తూచీ ఈ డెసిషన్ కి వచింది అని అంటున్నారు. ఈ మేరకు అధికారిక నియామక ఉత్తర్వులు రావడంతో ఎంవీవీ అనుచరులు పండుగ చేసుకుంటున్నారు. ఈసారి తమ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచితీరుతారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ కి అత్యంత సన్నిహితుడైన ఎంవీవీ తూర్పులో వైసీపీ రాజకీయ జాతకంలో సంచలన మార్పును తీసుకుని వస్తారని పార్టీ బలంగా నమ్ముతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.