Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ వైసీపీ యూ ట్యూబ్ చానల్స్ వల్లనే ఓడిపోయాయా ?

తెల్లారి లేస్తే చాలు పుంఖానుపుంఖాలుగా అందులో తమ సొంత ఆలోచనలు జొప్పించి భజన వార్తలు పెడుతూ వచ్చాయి

By:  Tupaki Desk   |   4 Jun 2024 2:30 PM GMT
బీఆర్ఎస్ వైసీపీ యూ ట్యూబ్ చానల్స్ వల్లనే ఓడిపోయాయా ?
X

అవును అనే అనుకోవాలేమో. ఎందుకంటే యూ ట్యూబ్ లో కొన్ని చానల్స్ అదే పనిగా ఆనాడు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తెలియకుండా చేసి పతనం అంచులకు చేర్చింది. ఇపుడు చూస్తే అదే యూ ట్యూబ్ చానల్స్ వైసీపీని కూడా పాతాళానికి పడదోసాయి. లెక్కకు మిక్కిలిగా ఏర్పాటు అయిన యూ ట్యూబ్ చానల్స్ ఇంకేముందు వైసీపీదే విజయం అన్నట్లుగా సీని క్రియేట్ చేశాయి.

తెల్లారి లేస్తే చాలు పుంఖానుపుంఖాలుగా అందులో తమ సొంత ఆలోచనలు జొప్పించి భజన వార్తలు పెడుతూ వచ్చాయి. వైసీపీ తోపు తురుము అని కూడా రాసుకొచ్చాయి. అదే విధంగా వైసీపీకి ఎదురు లేదు అవతల వారు ఎంతటి గొప్పవారు eఅయినా అసలు పట్టించుకోనవసరం లేదు అన్నట్లుగా వ్యాఖ్యానాలు చేశారు.

ప్రతీ రోజూ నోటికి వచ్చిన నంబర్లు చెబుతూ తమకు తోచిన తీరున సర్వేలు ఇస్తూ అధికార పార్టీని పూర్తిగా మబ్బుల్లో ఉంచేశాయి. మరి వీటిని వీక్షిస్తూ అధికార పార్టీ అసలైన కురుక్షేత్ర యుద్ధాన్ని పూర్తి స్థాయిలో చేయకుండా ఉండిపోయాయనే అంటున్నారు.

యూ ట్యూబ్ చానల్స్ మితిమీరిన భజన, అతి ఊహాగానాలు అతి ధీమాలతో వైసీపీ కొంప కొల్లేరు అయింది అని అంటున్నారు. అయితే వీటిని ఎందుకు నమ్మాలి అన్న ప్రశ్న కూడా రావచ్చు. కానీ సోషల్ మీడియా యుగం ఇది చానల్స్ లో వచ్చేది నిజమని భ్రమించే కాలమిది.

ఎవరో తమకు అనుకూలమైన వారితో మాట్లాడించేసి వైసీపీకే ఓట్లు వేశామని చెప్పించేస్తే ఇక అంతా అలాగే ఉందని భావించడం కంటే తప్పు వేరొకటి ఉండదు. వైసీపీ అదే చేసింది. లెక్కకు మిక్కిలిగా వచ్చిన యూ ట్యూబ్ చానల్స్ లో వచ్చే కంటెంట్ అంతా వైసీపీకి పాజిటివ్ గా ఉండడంతో అదే అసలైన ప్రజల భావన అని పూర్తిగా నమ్మేసింది. తీరా ఫలితాలు చూస్తే బోల్తా కొట్టించేశాయి.

రాజకీయాలను నిరంతరం ప్రజలతో ఉంటూ చేయాల్సి ఉంటుంది.ఆ విషయంలో ఎవరు కాదన్నా చంద్రబాబునే స్పూర్తిగా తీసుకోవాలి. ఆయన సీఎం అయినా మాజీ సీఎం అయినా ప్రజలలో ఉంటారు. కాబట్టే ఆయన మీడియా దన్ను ఉన్నా గ్రౌండ్ లెవెల్ వరకూ చూసి రా గలుతున్నారు. పైగా ఆయన సీనియారిటీ అనుభవం అన్నీ కూడా అక్కరకు వస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఈసారి ఎన్నికల ఫలితాలు మాత్రం వైసీపీని చావు దెబ్బ తీశాయనే చెప్పాలి. దాని కారణం యూ ట్యూబ్ లో కొన్ని భజన చానల్స్ అన్నది కచ్చితమైన సత్యం.