వైఎస్సార్ ప్లస్ చంద్రబాబు ఈజ్ ఈక్వల్ టూ కేసీయార్....!
ఇంతకీ ఆయన ఈ మాటలు ఎపుడు అన్నారు అంటే హైదరాబాద్ తాజ్ దక్కన్‌లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు.
By: Tupaki Desk | 15 Nov 2023 4:15 AM GMTకేసీయార్ గురించి ఆయన తనయుడు బీయారెస్ మంత్రి కేటీయార్ ఒక పెద్ద విశేషణాన్నే వాడారు. ఆయన్ని అభివర్ణించడానికి పోలిక పెట్టడానికి ఉమ్మడి ఏపీలో పనిచేసిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను ముందుకు తెచ్చారు. కేసీయార్ అంటే ఎవరు అనుకుంటున్నారు. వైఎస్సార్ ప్లస్ చంద్రబాబు ఈజ్ ఈక్వల్ టూ కేసీయార్ అని కేటీయార్ కొత్త మాటగా గొప్ప మాటగా చెప్పారు.
ఇంతకీ ఆయన ఈ మాటలు ఎపుడు అన్నారు అంటే హైదరాబాద్ తాజ్ దక్కన్‌లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణా వీడినా తెలంగాణాలో వైఎస్సార్ ప్రభావం ఉంది. అలాగే చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ని అభిమానించేవారూ ఉన్నారు.
అందుకే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కేటీయార్ మాట్లాడుతూ వైఎస్సార్ చంద్రబాబు కలిస్తేనే కేసీయార్ అని చెప్పేశారు. అదెలాగా అంటే ప్రో బిజినెస్, ప్రో అర్బన్, ప్రో ఐటీ అంటే ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది చంద్రబాబు అని కేటీయార్ చెప్పారు. అలాగే ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అనేది వైఎస్ ఇమేజ్ అని చెప్పారు. ఇపుడు కేసీఆర్‌లో ఈ ఇద్దరి ఫిలాసఫీ కనిపిసోందని అన్నారు
కేసీఆర్ అంటే ప్రో అర్బన్, ప్రో రూరల్, ప్రో ఐటీ, ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ ఉంటాయన్నారు అంటే ఆ ఇద్దరూ కలిపితే ఒక్క కేసీయార్ అని కేటీయార్ తనదైన శైలిలో చెప్పేశారు అన్న మాట. అంతే కాదు కేసీయార్ ఒక అరుదైన సమతూల్యం అని కూడా అన్నారు.
కేసీయార్ పాలన అందుకే తెలంగాణాలో స్వర్ణ యుగంగా మారిందని అన్నారు. తెలంగాణాకు అన్నీ చేసి పెడుతున్న కేసీయార్ ని ఎవరైనా మళ్ళీ ఎన్నుకోవాలని ఆయనను ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని కేటీయార్ చెప్పుకొచ్చారు. ఇక గడిచిన పాతికేళ్ళను తీసుకుంటే ఒక చంద్రబాబు ఒక వైఎస్సార్ ఒక కేసీయార్ ఈ ముగ్గురు మాత్రమే ముఖ్యమంత్రులుగా గుర్తుండిపోతారని కూడా కేటీయార్ అనడం విశేషం.
మొత్తానికి ఒక వైపు కేసీయార్ ని ఆకాశానికి ఎత్తేస్తూ మరో వైపు వైఎస్సార్ చంద్రబాబుల గొప్పతనాన్ని పొగుడుతూ కేటీయార్ రాజకీయ సమతూల్యతను పాటించారు అని అంటున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో కొన్ని సెక్షన్లను ఆకట్టుకోవడానికే ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే ఒక ఎన్టీయార్ర్ ఒక వైఎస్సార్ కలిస్తే వైఎస్ జగన్ అని వైసీపీ నేతలు అభివర్ణిస్తారు. కేటీయార్ దాన్ని కాస్తా మార్చి ఇలా అన్నారనుకోవాలి. మరి జనాలు ఈ పోలికను ఎలా తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.