షర్మిల ఎంపీ కావాలా... ఎమ్మెల్యే సీటు ఇవ్వలేం...!
వైఎస్సార్ తనయ, వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం లాంచనం అని తేలిపోయిన విషయం.
By: Tupaki Desk | 3 Sep 2023 9:14 AM GMTవైఎస్సార్ తనయ, వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం లాంచనం అని తేలిపోయిన విషయం. తుది దశకు చర్చలు చేరుకున్నాయని వైఎస్ షర్మిల స్వయంగా చెప్పిన తరువాత ఇక నేడో రేపో ఆమె కాంగ్రెస్ మనిషి కాబోతున్నారు.
అయితే తెలంగాణాలో రాజకీయాలు చేయాలని ఆమె గంపెడు ఆశలు పెట్టుకున్నారు. పార్టీ పెట్టింది కూడా అందుకే. తాను తెలంగాణా కోడలు అని ఆమె చెప్పుకుంటున్నారు. అయితే షర్మిల ఎంత చెప్పినా టీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమెలో ఆంధ్రా మూలాలనే చూస్తున్నారు.
తెలంగాణా సెంటిమెంట్ ని మరోమారు కేసీయార్ రగిల్చేలా షర్మిల చేరిక ఉపయోగపడుతుందని కూడా భయపడుతున్నారు. ఈ నేపధ్యంలో షర్మిలను కేవలం తెలంగాణాలో స్టార్ కాంపెయినర్ గా ప్రచారానికి ఉపయోగించుకోవాలని సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది
దానికి తోడు ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ సీటు మీద షర్మిల టార్గెట్ చేశారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆ సీటు ఆమెకు అందదు అని ఇపుడు అర్ధమవుతున్న పరిణామాలు అని అంటున్నారు. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేమని కాంగ్రెస్ అధినాయకత్వం తేల్చేసింది అని అంటున్నారు.
అసలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి ఏమాత్రం అవసరం లేదని కూడా తెలంగాణా కాంగ్రెస్ నేతలు చెబుతున్న నేపధ్యం ఉంది అని అంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నట్లుగా భోగట్టా.
ఆమె వల్ల చేతుల దాక వచ్చిన అధికారం పూర్తిగా చేజారిపోయే ప్రమాదం ఉందై హై కమాండ్ వారంతా హెచ్చరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి షర్మిలను తెలంగాణా రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఏమీ జోక్యం చేసుకోనీయకుండా చేయాలన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు.
ఈ పరిస్థితులలో కాంగ్రెస్ హై కమాండ్ కూడా షర్మిల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు షర్మిలను కర్నాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా నామినేట్ చేయడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉందని అంటున్నారు. అదే విధంగా పాలేరు టికెట్ మాత్రం ఆమెకు ఇచ్చేది లేదని కాంగ్రెస్ అధినాయకత్వం తేల్చేసింది అని అంటున్నారు.
ఈ క్రమంలో బంతి అన్నది ఇపుడు వైఎస్ షర్మిల చేతులలోనే ఉంది అని అంటున్నారు. ఇక రాజ్యసభకు ఆమెను పంపడం అంటే అది 2024 ఏప్రిల్ లో కానీ జరిగే వ్యవహారం కాదు. అలా కనుక చూసుకుంటే ఇప్పటికి ఎనిమిది నెలలకు పైగా టైం ఉంది. ఈ లోగా తెలంగాణాలో ఎన్నికలు పూర్తి అవుతాయి. అక్కడ కాంగ్రెస్ విజయావకాశాలు అలాగే షర్మిల ప్రచారం వల్ల వచ్చిన లాభనష్టాలు తాపీగా బేరీజు వేసుకుని అప్పటికి ఆమెకు రాజ్యసభ ఎంపీ సీటు అయినా ఇస్తారో లేదో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు.
రాజకీయాలలో రేపు అంటే అది నీటి మూటగానే అంతా చూస్తారు. ఇక తెలంగాణా ఎన్నికల్లో ఆమెను స్టార్ కాంపెయినర్ గా ఉపయోగించుకోవాలని, ఆ తరువాత ఏపీ రాజకీయాల్లో కూడా ఆమె సేవలను యూజ్ చేసుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. ఈ విషయాల్లో ఎక్కడ తేడా వచ్చినా రాజ్యసభ ఎంపీ సీటు హామీ కూడా గాలికి కొట్టుకుపోయినా పోవచ్చు.
మొత్తానికి ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల నుంచి ప్రచారంలో ఉన్న మాట ఏంటి అంటే ఆమెకు రాజ్యసభ ఎంపీ సీటు హామీ ఉంది. అది ఎనిమిది నెలల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి. ప్రస్తుతానికైతే షర్మిల బేషరతుగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ హై కమాండ్ చెప్పినట్లుగా స్టార్ కాంపెయినర్ గా రంగంలోకి దిగి ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి కాంగ్రెస్ లో చేరాక హై కమాండ్ ఎంత చెబితే ఏమి చెబితే అదే చేయాల్సి ఉంటుంది. అపుడు నో డిబేట్ అన్నది తెల్సిందే.
సో ఇపుడు ఆలోచించుకోవాల్సింది షర్మిలనే అని అంటున్నారు. టోటల్ గా ఈ ఎపిసోడ్ లో బంతి ఢిల్లీలో లేదు, బెంగళూరులో అంతకంటే లేదు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఉంది. షర్మిల ఓకే అంటే ఆమె కాంగ్రెస్ నేతగా మారిపోవచ్చు. మరి నాకేంటి అని ఆమె ఈ దశలో అడగకుండా హై కమాండ్ ఎంపీ సీటు స్కెచ్ వేసింది అనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.