అయోమయంలో షర్మిల ?
కాంగ్రెస్ విషయాన్ని ఎలా మ్యానేజ్ చేయాలో వైఎస్ షర్మిలకు అర్ధమవుతున్నట్లులేదు.
By: Tupaki Desk | 1 Oct 2023 4:50 AM GMTకాంగ్రెస్ విషయాన్ని ఎలా మ్యానేజ్ చేయాలో వైఎస్ షర్మిలకు అర్ధమవుతున్నట్లులేదు. ఒకసారి పొత్తని మరోసారి విలీనం అనే ప్రచారం జరిగింది. చివరకు పొత్తుకాదు విలీనమే అన్నది కన్ఫర్మ్ అయ్యింది. అయితే అంతా అయిన తర్వాత విలీనం ఎప్పుడన్నది ఇప్పటికి పదిసార్లు వాయిదాలు పడింది. అంతా బాగానే ఉంది అనుకున్నపుడు మొన్నటి కాంగ్రెస్ సీడబ్య్లూసీ మీటింగులోనే విలీనం ప్రకటనన్నారు. తర్వాత బహిరంగ సభలో సోనియాగాంధీ సమక్షంలో అన్నారు.
అంతా అయిపోయిన తర్వాత సడెన్ గా అసలు విలీనమే లేదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పై షర్మిల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఆమెకూడా ఏదో ఒకటి తేల్చేందుకు సెప్టెంబర్ 30 వ తేదీని డెడ్ లైనుగా ప్రకటించారు. డెడ్ లైనులోగా కాంగ్రెస్ నుండి ఎవరూ స్పందించలేదు. దాంతో విలీనం ప్రక్రియ కూడా ఆగిపోయినట్లే అని అనుకున్నారు. అయితే రాత్రి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు షర్మిలతో భటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ అధిష్టానంపై తనకున్న మంటనంతా షర్మిల తీర్చుకున్నారు.
అయితే షర్మిలను కూల్ చేసిన కనుగోలు రెండు రోజులు సమయం ఇవ్వాలని అడిగారు. అందుకు షర్మిల కూడా అంగీకరించారట. గతంలో ప్రస్తావనకు వచ్చిన కర్నాటక కోటాలో రాజ్యసభ ఎంపీ ఇచ్చి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి విషయాన్ని కనుగోలు మళ్ళీ ప్రస్తావించారట. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి రెండురోజుల్లో ఏ సంగతి చెబుతానని హామీఇచ్చాడట.
కనుగోలు హామీతో ఏమిచేయాలో షర్మిలకు అర్ధంకాక అయోమయంలో ఉన్నట్లు సమాచారం. సునీల్ కనుగోలు రెండు రోజులు సమయం అడిగాడు కాబట్టి తాను కూడా పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం చెబుతానని షర్మిల అన్నట్లు టాక్ వినబడుతోంది. ఏదేమైనా కాంగ్రెస్ తో కలిసే విషయంలో షర్మిల పూర్తి అయోమయంలో ఉన్న విషయం అర్ధమైపోతోంది. లేకపోతే రెండువైపులా క్లారిటి ఉంటే ఏ విషయం కూడా ఇన్నినెలల పాటు సాగదు. మరి క్లారిటి ఏ వైపు మిస్సయ్యిందో అర్ధంకావటం లేదు. ఏదేమైనా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే షర్మిల చివరకు ఎటూ కాకుండా అయిపోతారేమో అనిపిస్తోంది.