రెండు రోజులైంది.. ఎవరూ రాలేదే.. డిఫెన్స్‌లో పడిపోయిన షర్మిల..!
మహిళలను కలుస్తున్నారు. వారిసమస్యలు తెలుసుకుంటున్నారు. ఇదేసమయంలో హోదా అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.
By: Tupaki Desk | 26 Jan 2024 3:59 AM GMTఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో పర్యటనలు ప్రారంభించారు. దివంగత వైఎస్ తన ప్రజాప్రస్థా నం పాదయాత్రను ముగించిన ఇచ్ఛాపురం నుంచి ఆమె.. నియోజకవర్గాల వారిగా.. పర్యటనలు చేపట్టారు. అయితే.. ఈ పర్యటనల వెనుక.. ప్రధాన ఉద్దేశం.. పార్టీని బలోపేతం చేయడం.. ప్రస్తుతం ఒక్క శాతం కూడా లేని కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచడం అనే కాన్సెప్టుతో షర్మిల ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు వైఎస్ చరిష్మాను.. తన గళాన్ని పెంచి.. మరీ ప్రసంగాలు దంచి కొడుతున్నారు.
మహిళలను కలుస్తున్నారు. వారిసమస్యలు తెలుసుకుంటున్నారు. ఇదేసమయంలో హోదా అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ది ఏదని నిలదీస్తున్నారు. ఇలా.. అనేక సమస్యలను అంశాలను కూడా.. ఆమె ప్రస్తావిస్తున్నారు. వీటితో పాటు.. ఈ పర్యటనల వెనుక ఉన్న మరో కీలక విషయం.. పాత కాపులను పార్టీలో చేర్చుకోవడం. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచివిడివడి.. పార్టీకి దూరంగా ఉండడంతోపాటు.. ఇతర పార్టీలలో చేరిన వారిని తనవైపు తిప్పుకోవాలన్నది షర్మిల వ్యూహం.
ముఖ్యంగా తన ఇమేజ్‌ను, తన వాగ్ధాటిని చూసైనా.. పాత కాపులు రాకుండా ఉంటారా? అనేది షర్మిల మాట. అందుకే.. కాంగ్రెస్‌కు ఒకప్పుడు కంచుకోట వంటి ఉత్తరాంధ్ర జిల్లాలపై ఆమె ఫోకస్ పెంచారు. రెండు రోజులుగా అక్కడే ఉన్నారు. అయితే.. ఈ రెండు రోజుల్లో ఒక్కరు కూడా.. పార్టీవైపు చూడక పోవడం గమనార్హం. నిజానికి అనేక మందినాయకులు కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఉన్నారు. వారంతా గతంలో పదువులు కూడా పొందారు. వీరిపైనే షర్మిల ఫోకస్ ఉంది.
కానీ, షర్మిల అనుకున్నట్టుగా ఎవరూ ముందుకు రాలేదు. పోనీ.. వైసీపీ ఏమైనా టికెట్ లు నిరాకరిస్తే.. అప్పుడు వచ్చేవారైనా ఉంటారా? అంటే.. ముందు అసలు షర్మిల కాంగ్రెస్ పార్టీకి తెచ్చే ఊపెంత? అనే విషయంపైనే నాయకులు ఎదురు చూస్తున్నారు. దీనిపై క్లారిటీ రాకుండా.. నాయకులు ముందుకు వచ్చే పరిస్థితి కానీ... కాంగ్రెస్‌కు జై కొట్టే అవకాశం కానీ లేకుండా పోయిందనేది స్పష్టంగా తేలిపోయింది. రెండు రోజులుగా షర్మిల అంతర్గత చర్చల్లోనూ.. బాహ్య చూపుల్లోనూ జంపింగుల కోసం.. ఎదురు చూసినా.. ఆ మె ఆశలు ఫలించకపోవడం గమనార్హం.