Begin typing your search above and press return to search.

సెజ్ ప్రమాద పాపం జగన్ దే... షర్మిల స్ట్రాంగ్ స్టేట్మెంట్

జగన్ ఎప్పటికపుడు సేఫ్టీ ఆడిట్ పరిశ్రమలలో నిర్వహించకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది అని చంద్రబాబు సహా కూటమి నేతలు నిందిస్తూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 4:11 AM GMT
సెజ్ ప్రమాద పాపం జగన్ దే... షర్మిల స్ట్రాంగ్ స్టేట్మెంట్
X

ఉమ్మడి విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ఘోర ప్రమాదానికి బాధ్యులు మీరు అంటే మీరు అని అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ అతి పెద్ద డైలాగ్ వార్ కి తెర తీసిన సందర్భం ఉంది. జగన్ అయిదేళ్ల పాలనలో ఎన్ని పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో విశాఖ వచ్చి మరీ లిస్ట్ మీడియా ముందు చదివారు.

జగన్ ఎప్పటికపుడు సేఫ్టీ ఆడిట్ పరిశ్రమలలో నిర్వహించకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది అని చంద్రబాబు సహా కూటమి నేతలు నిందిస్తూనే ఉన్నారు. అయితే గత ప్రభుత్వానికి ఈ పాపం అంటగట్టవద్దు తప్పు అంతా మీది అంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. సరిగ్గా ఈ సమయంలో ఎంటర్ అయిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అసలు సెజ్ దారుణానికి కారణం తన అన్న జగన్ ప్రభుత్వమే అని ఒక స్ట్రాంగ్ కంప్లైట్ ని జనంలో ఉంచారు.

దానికి తగిన ఆధారాలను కూడా ఆమె ముందు పెట్టారు. గత ఏడాది చివరలో అచ్యుతాపురంలోని ఎషెన్షియా అన్న ఇదే సంస్థ ఫార్మా సంస్థకు సంబంధించి ఒక నివేదికను ఆమె బయట పెట్టారు. ప్లాంట్ లో అనేక భద్రతా సమస్యలు ఉన్నాయని ఆ నివేదిలో ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఇది గత ఏడాది డిసెంబర్ లోనే వచ్చిన నివేదిక అని ఆమె అన్నారు.

అయితే ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని సేఫ్టీ మెజర్స్ ని చెక్ చేయలేదని ఆడిట్ జరిపించలేదని ఫలితంగానే చాలా మంది ప్రాణాలు ఈ రోజు కోల్పోయారని షర్మిల మొత్తం విషయం బయటపెట్టారు. అంటే ఈ రోజు జరిగిన ఘోర ప్రమాదానికి మూలం వైసీపీ నిర్లక్ష్యం అని ఆమె స్పష్టంగా చెప్పారు అన్న మాట. వైసీపీ ప్రభుత్వం ఆ సమయంలో కొండల మీద అయిదు వందల కోట్లతో భారీ భవంతులను నిర్మించే పనిలో బిజీగా ఉందని కూడా ఆమె ఎత్తి పొడిచారు. అంటే విశాఖలోని రుషికొండలో భవనం గురించి ఆమె చెప్పారు అన్న మాట.

అందుకే ఆమె కూటమి ప్రభుత్వ పెద్దలకు విన్నపం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా ఉండవద్దు అని కూడా చెప్పారు. సామాన్యుల ప్రాణాలను కాపాడాలి అన్న శ్రద్ధ వైసీపీ ప్రభుత్వానికి లేదని కూడా షర్మిల ఘాటుగా విమర్శించారు. ఇక కూటమి ప్రభుత్వం పరిశ్రమలలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కార్మికులు ఉద్యోగుల ప్రాణాలను కాపాడడంలో పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆమె కోరారు.

వైసీపీ అవగాహన రాహిత్యంతోనే ఇంత పెద్ద ప్రమాదాలు ఏపీలో జరిగాయని ఆమె అంటున్నారు. ఒక వైపు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసేలా ఉంటే ఎత్తైన భవనాలు నిర్మించడానికే జగన్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోంది అని ఆమె చెబుతూ జగన్ ప్రభుత్వం గాలి తీసేశారు.

మొత్తానికి కూటమి పూర్తి స్థాయిలో జగన్ మీద ద్వజమెత్తడానికి అవసరమైన ఆధారాలను షర్మిల ఇచ్చారు. అన్న మాట. ఇక్కడ ఒక విషాదం ఏమిటి అంటే జగన్ కి ఉన్నంతమంది ప్రత్యర్ధులు దేశంలో మరే పార్టీకీ లేరు. ఆయనకు ఆఖరుకు సొంత చెల్లెలు కూడా ఎదురు నిలిచి నిలదీస్తున్నారు. జగన్ ఓడినా ఆయనే అన్నింటికీ కారణం అని నిందిస్తున్నారు. ఇలా అన్ని రకాలైన విమర్శల నుంచి వైసీపీ ఎదుర్కొని ముందుకు ఎలా వెళ్తుందో చూడాల్సిందే.