షర్మిల బోరు కొట్టిస్తున్నారా? సభలు పలచబడుతున్నాయ్!!
దీంతో షర్మిల పంథా మార్చినా.. కొత్త సంగతులు.. కొత్త విషయాలు ఎక్కడా ప్రస్తావించడం లేదు
By: Tupaki Desk | 18 April 2024 8:24 AM GMTకాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సభలు పలచబడుతున్నాయ్. ఇదే సమయంలో ఆమెకు నిన్న మొ న్నటి వరకు కవరేజీ ఇచ్చిన కొన్ని మీడియా సంస్థలుకూడా.. కవరేజీ తగ్గించాయి. దీనికి కారణం.. ఏంటని ఆరా తీస్తే.. షర్మిల ప్రసంగాల్లో పాడిందే పాట పాడుతున్నారని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. షర్మి ల అంటే.. అభిమానం ఉన్నా.. కొన్ని విషయాల్లో ఆమెతో విభేదిస్తున్న వారు కూడా ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్యను ఒక్క దాన్నే టార్గెట్ చేసుకుంటే.. పార్టీ ఎదగదని.. ఆమెకు పదే పదే చెబుతున్నారు.
దీంతో షర్మిల పంథా మార్చినా.. కొత్త సంగతులు.. కొత్త విషయాలు ఎక్కడా ప్రస్తావించడం లేదు. హోదా గురించి పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు, జగన్‌లు బీజేపీ తొత్తులని అంటున్నారు. ఈ రెండు పార్టీ లకూ ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని అంటున్నారు. ఇవన్నీ.. ఆమె పదే పదే చెబుతుండడంతో సభలకు వచ్చిన వారు ఎక్కువ సేపు నిలవడం లేదు. కేవలం ఐదు పది నిమిషాల్లోనే సభలు పలచబడుతున్నా యి. దీంతో జనాలను పోగు చేయలేక నాయకులు తలపట్టుకుంటున్నారు.
గత రెండు మాసాలుగా షర్మిల.. ఎక్కడ ప్రసంగించినా.. సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. తీవ్రస్తాయిలో రెచ్చిపోయారు. ఇవి ఓ వర్గం మీడియాలో హైలెట్ అయ్యాయి అయితే.. ఎన్నికల సమయం వచ్చే సరికి.. ఆమె మరో రెండు పార్టీలను కూడా టార్గెట్ చేయడం ప్రారంభించారు. దీంతో మీడియా ఫోకస్ తగ్గిపోయిం ది. పైగా.. కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లు.. సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల ప్రయోజనం లేదని.. ఆయనపై మరింత సింపతీ పెరుగుతుందని సూచించారు.
దీంతో ఏమనుకున్నారో ఏమో.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తగ్గించినా.. చెప్పిందే చెబుతున్నారు. దీంతో ప్రజల నుంచి ఆశించిన మేరకు స్పందన రావడం లేదు. నామినేషన్ల ఘట్టం ప్రారంభానికి ముందు.. తర్వాత.. ఎన్నికల ప్రచారంలో తేడా ఉంటుంది. అప్పటి వరకు ఎలా ఉన్నా. ఈ 25 రోజులు మాత్రం కీలకం. ఈ సమయంలో ఓటు బ్యాంకును ప్రభావితం చేసుకోవాలి. ఈ దిశగా షర్మిల ప్రిపేర్ అయినట్టు కనిపించడం లేదు. దీంతో షర్మిల సభలకు వచ్చేవారు తగ్గిపోయారనేది వాస్తవం.