Begin typing your search above and press return to search.

రోజా ఇంట్లో నలుగురు మంత్రులు... నగరిలో షర్మిళ సెటైర్లు!

ఈ సందర్భంగా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ షర్మిళ

By:  Tupaki Desk   |   15 April 2024 6:50 AM GMT
రోజా ఇంట్లో నలుగురు మంత్రులు... నగరిలో షర్మిళ సెటైర్లు!
X

ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిళ... కడప ఎంపీగా పోటీ చేస్తున్నప్పటినుంచీ డోసు మరీ పెంచేస్తున్నారు! ఈ క్రమంలో కడపలో ఉన్నన్ని రోజులూ వివేకా హత్య కేసు పేరు చెప్పి అవినాష్ రెడ్డిని, జగన్ ను విమర్శిస్తూ.. తనకే ఓటు వేయాలని కొంగుచాటి మరీ అడిగారు! ఈ సమయంలో తాజాగా తిరుపతి, పుత్తురుల్లో పర్యటించారు!

ఈ సందర్భంగా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ షర్మిళ. ఇందులో భాగంగా... నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే జబర్దస్త్‌ రోజా ఇంట్లో మొత్తం నలుగురు మంత్రులు ఉన్నారని మొదలుపెట్టిన షర్మిళ... ఆ లిస్ట్ చదివి వినిపించారు. వారిలో ఒకరు రోజా కాగా... మిగిలిన ముగ్గురూ... ఆవిడ భర్త, ఇద్దరు అన్నలు అని అన్నారు. వీరంతా కలిసి యథేచ్ఛగా ఇసుక మాఫియా, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారంటూ విమర్శించారు.

ఆదివారం రాత్రి పుత్తూరు కాపు వీధిలో ఏపీ న్యాయ యాత్ర సందర్భంగా మైకందుకున్న పీసీసీ చీఫ్ షర్మిళ... ఎమ్మెల్యే రోజమ్మ ఏ ఒక్కరోజు కూడా నియోజకవర్గం కోసం పనిచేయలేదని విమర్శించారు. అయినప్పటికీ నేడు మళ్లీ ఓట్లు అడుగుతుందని.. ఇసుక, మట్టి నుంచి దోచుకున్న డబ్బులే నియోజకవర్గంలో ఓట్లకోసం అందరికీ పంచిపెడుతుందని ఫైరయ్యారు!

అనంతరం జగన్ పైన విమర్శలు గుప్పించారు షర్మిళ. ఇందులో భాగంగా... ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగనన్న ఈ జిల్లాకు ఇచ్చిన హామీలు మరిచిపోయారని.. వైఎస్సార్ సీఎం గా ఉన్నప్పుడు గాలేరు పనులు 90శాతం పూర్తిచేస్తే, జగనన్న మిగిలిన పదిశాతం పనులు కూడా చేయలేదని దుయ్యపట్టారు. చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని గొప్పలు చెప్పి ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు.