కుమారుడికి పసుపు రాస్తూ మురిసిపోయిన షర్మిల!
వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి- ప్రియల వివాహం రాజాస్తాన్ లోని జోద్ పూర్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 20 Feb 2024 4:58 PM GMTవైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి- ప్రియల వివాహం రాజాస్తాన్ లోని జోద్ పూర్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. క్రైస్తవ..హిందు సంప్రదాయాల ప్రకారం వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు.. బంధుమి త్రులంతా వేడుకకు హాజరయ్యారు. తాజాగా పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుక ఈవెంట్ కి సంబంధించిన వీడియోని షర్మిల రిలీజ్ చేసారు. రాజాస్థాన్ బ్యూటీ లో ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో వేడుక ఎంతో వైభవంగా జరిగింది.
వధు వరూలిద్దరు పసుపు రాసుకుని..నీళ్ల బిందులు ఒకరిమీద ఒకరు పోసుకుని సందడి చేసారు. అమ్మాయి .. అబ్బాయి తరుపు వారు వేడుకని అంతే ఆస్వాదించారు. అంతకు ముందు షర్మిల కుమారుడి చేతులకు పసుపు రాస్తూ ఎంతో మురిసిపోయారు. కుమారుడిని తెలుపు దుస్తుల్లో చూసుకుని ఆ క్షణాల్ని ఎంతో ఆస్వాదించారు. వైఎస్ విజయమ్మ వేడుకలో భాగమయ్యారు. వధువరూలు ఇద్దర్నీ ఆశీర్దిదించి వారితో పాటు సందడి చేసారు.
రాజకీయ ఫ్యామిలీ హల్దీ వేడుక అయినా సెలబ్రిటీల వేడుకకు ఏమాత్రం తగ్గకుండా జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అభిమానులు నూతన దంపతులకు విషెస్ తెలియజేస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ క్లిప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మొత్తం వేడుకలో మేనమామ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా కనిపించకపోవడం అభిమానుల్లో చర్చకొస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపి స్తున్న నేపథ్యంలో ప్రచారం పనుల్లో బిజీగా ఉంటూనూ మరోవైపు కుమారుడి పెళ్లి పనుల్లోనూ తలమున కలయ్యారు. పెళ్లి తంతు ముగిసిన నేపథ్యంలో మళ్లీ షర్మిల ప్రజల మధ్య తిరగడానికి రెడీ అవుతున్నారు.