Begin typing your search above and press return to search.

కడప ఎంపీ సీటుకు వైఎస్ సునీత ...స్కెచ్ ఎవరిదంటే...!?

దాంతో ఆమె కడప ఎంపీ సీటు విషయంలో తన సోదరి వైఎస్ సునీత పేరుని పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఏకైక కుమార్తె వైఎస్ సునీత.

By:  Tupaki Desk   |   4 Jan 2024 4:01 AM GMT
కడప ఎంపీ సీటుకు వైఎస్ సునీత ...స్కెచ్ ఎవరిదంటే...!?
X

ఏపీ రాజకీయాలు ఇపుడు కడప చుట్టూ తిరుగుతున్నాయి. దానికి కారణం అధికార వైసీపీకి కడప రాజకీయ కడప. కంచుకోట కూడా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప నుంచే రాజకీయాలు చేస్తూ వచ్చారు. అలా కడపలో కనుక వైసీపీని నిలువరించాలని ప్రత్యర్ధులు ఎపుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

సరే ప్రత్యర్ధుల ప్రయత్నాలను వైసీపీ ఎపుడూ పట్టించుకోలేదు. అవి అంతలా సఫలీకృతం కాలేదు. కానీ ఇపుడు సొంత పక్షంలోనే సొంత కుటుంబంలోనే వ్యతిరేకత పెచ్చరిల్లితే అదే కదా సీరియస్ పాయింట్. కడప నుంచి టీడీపీ ప్రతీసారీ పోటీ చేస్తుంది. కానీ ఓటమి ఎదురవుతుంది.

అయితే ఈసారి వైఎస్ వైసీపీని ఓడించాలని పట్టుదలగా ఉంది. దానికి కాంగ్రెస్ తోడు అవుతోంది అని చెప్పాలి. ఆ కాంగ్రెస్ కి ఊపిరులూదే బాధ్యతను వైఎస్ షర్మిల తీసుకున్నారు. ఆమె ఏపీ వ్యవహారాలను పూర్తిగా చక్కబెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఆమె ఏపీ రాజకీయాల్లో అడుగుపెడితే అది వైసీపీకి ఇబ్బందికరం అవుతుందని అలా చేయాలని టీడీపీ ప్రయత్నం.

మరో వైపు చూస్తే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలని చూస్తున్న వైఎస్ షర్మిల మీద కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం పెద్ద బాధ్యతలనే మోపబోతోంది అని అంటున్నారు. అదేంటి అంటే కడప ఎంపీ సీటు నుంచి వైఎస్ షర్మిలను పోటీ చేయమని. అయితే దాని మీద రకరకాలైన ఊహాగాలను వినిపిస్తున్నాయి.

వైఎస్ షర్మిల రాజ్యసభ సీటు కోరుకుంటున్నారు అని. అలాగే జాతీయ కాంగ్రెస్ లో ఆమె కీలక పదవిని కోరుతున్నారని, అలా ఏపీ తెలంగాణా రెండు చోట్లా తన రాజకీయాలు చేయాలని ఆమె భావిస్తున్నారు అని అంటున్నారు.

దాంతో ఆమె కడప ఎంపీ సీటు విషయంలో తన సోదరి వైఎస్ సునీత పేరుని పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఏకైక కుమార్తె వైఎస్ సునీత. ఆమెను కడప ఎంపీగా పోటీ చేయించి గెలిపించాలన్నది షర్మిల ఆలోచన.

ఎటూ వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తారు అని. రాజకీయంగా ఆయన్ని ఓడించాలన్నదే వైఎస్ షర్మిల సునీత పంతం వ్యూహం అని అంటున్నారు. అవినాష్ రెడ్డి ఆయన కుటుంబీకుల మీదనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటం సునీత చేస్తోంది. ఇపుడు ఎన్నికల వేళ రాజకీయంగా నరుక్కుని రావాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో టీడీపీ కీలక నేత పులివెందుల ఇంచార్జి బీటెక్ రవి తో షర్మిల భర్త బ్రదర్ అనిల్ భేటీ వేశారు అని అంటున్నారు. ఇక బీటెక్ రవి సునీత భర్త రాజశేఖర్ కూడా మిత్రులు అన్నది తెలిసిందే. దీనిని బట్టి చూస్తూంటే కడప రాజకీయాలో కాంగ్రెస్ ఎంట్రీ కొత్త సమీకరణలకు దారి తీసేల స్కెచ్ గీస్తున్నారు అని అంటున్నారు.

అయితే రాజకీయాలను రాజీలేకుండా నిర్మొహమాటగా చేసే జగన్ కచ్చితంగా ఈ విషయంలో తన పార్టీని గెలిపించుకోవడానికి పదునైన వ్యూహాలను రచిస్తారు అని అంటున్నారు. వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు డాక్టర్ అభిషేక్ రెడ్డిని కడప ఎంపీగా బరిలోకి దింపడం ద్వారా వైసీపీని మరోసారి గెలిపించుకోవాలని వైసీపీ అధినాయకత్వం చూస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకుంటే షేక్ అయ్యేవి కడప రాజకీయాలే అని టాక్ మాత్రం ఉందిట.