Begin typing your search above and press return to search.

వైఎస్‌ విజయమ్మ బర్త్‌ డే.. జగన్, షర్మిల చేసిందిది!

ఈ సందర్భంగా అటు ఆమె కుమారుడు వైఎస్‌ జగన్, ఇటు ఆమె కుమార్తె వైఎస్‌ షర్మిల తమ తల్లికి వేర్వేరుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు

By:  Tupaki Desk   |   19 April 2024 11:24 AM GMT
వైఎస్‌ విజయమ్మ బర్త్‌ డే.. జగన్, షర్మిల చేసిందిది!
X

ఏప్రిల్‌ 19న ఆంధ్రప్రదేశ్‌ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తల్లి వైఎస్‌ విజయమ్మ జన్మదినమనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అటు ఆమె కుమారుడు వైఎస్‌ జగన్, ఇటు ఆమె కుమార్తె వైఎస్‌ షర్మిల తమ తల్లికి వేర్వేరుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తన తల్లికి ‘హ్యాపీ బర్త్‌ డే అమ్మా’.. అంటూ సోషల్‌ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లితో ఉన్న ఫొటోను సీఎం జగన్‌ షేర్‌ చేశారు.

ఇక పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సైతం తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి.. ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం.. నువ్వు అమ్మ. నీకు.. ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనఃశాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ.. హ్యాపీ బర్త్‌ డే మా’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన తల్లితో తాను ఉన్న చిత్రాన్ని షర్మిల షేర్‌ చేశారు.

దీంతో ఓవైపు వైసీపీ శ్రేణులు, మరోవైప కాంగ్రెస్‌ శ్రేణులు వైఎస్‌ విజయమ్మకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్‌ విజయమ్మ రాష్ట్రమంతా వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రస్తుతం మాత్రం ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఓవైపు కుమారుడు వైఎస్‌ జగన్, ఇంకోవైపు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎన్నికల బరిలో ఉన్నారు. వీరి మధ్య తీవ్ర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ విజయమ్మ ఎవరి పక్షం తీసుకోవడం ఇష్టం లేక అమెరికా వెళ్లిపోయారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

వైఎస్‌ విజయమ్మ ప్రస్తుతం రాష్ట్రంలో లేరని.. అమెరికాలో బంధువుల ఇంటికి వెళ్లారని.. ఎన్నికలు పూర్తయ్యే వరకు తిరిగిరారని అంటున్నారు. రాష్ట్రంలోనే ఉండి.. ఈ ఒత్తిడిని భరించడం కంటే ఎన్నికలయ్యే వరకు దూరంగా ఉండటమే ఉత్తమమని ఆమె భావించారని టాక్‌ నడుస్తోంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ మరణించాక పులివెందుల నుంచి విజయమ్మ ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చి జగన్‌ వైసీపీ ఏర్పాటు చేశాక ఎమ్మెల్యే పదవికి విజయమ్మ, ఎంపీ పదవికి జగన్‌ రాజీనామా చేశారు.

ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన విజయమ్మ గెలుపొందారు. అలాగే కడప నుంచి జగన్‌ ఎంపీగా విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో విజయమ్మ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేయలేదు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగారు.