Begin typing your search above and press return to search.

జట్టే భార్యా, పిల్లలు... యువరాజ్ సింగ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన నేపథ్యంలో యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ స్పందించారు.

By:  Tupaki Desk   |   19 Jan 2025 9:30 PM GMT
జట్టే భార్యా, పిల్లలు... యువరాజ్ సింగ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో వరుస టెస్టు సిరీస్ ల తర్వాత టీమిండియా ఆడుతున్న ప్రతిష్టాత్మక సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో... టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ స్పందించారు.. కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన నేపథ్యంలో యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా.. మ్యాచ్ కోసం ప్రయాణిస్తున్న జట్టు సభ్యులు తమ వెంట భార్య, పిల్లలను తీసుకెళ్లడం పైనా కామెంట్ చేశారు.

ఇందులో భాగంగా... బీసీసీఐ నిబంధనల్లో ఆటగాళ్ల ఫ్యామిలీస్ పైనా ఆంక్షలు ఉన్నాయని మొదలుపెట్టిన యోగ్ రాజ్ సింగ్... జట్టు మ్యాచ్ కోసం ప్రయాణిస్తున్నప్పుడు వారి భార్యలు, పిల్లలు ఉండాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ సమయంలో... జట్టే ఇప్పుడు మీ కుటుంబం అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇదే సమయంలో... రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత భార్య, పిల్లలతో గడపడానికి కావాల్సినంత సమయం దొరుకుతుందని.. కానీ, దేశం కోసం ఆడేటప్పుడు వీరంతా అదనపు భారమే అవుతారని.. అలాంటప్పుడు భార్యా, పిల్లలు మీతో ఎందుకు ఉండాలని అనుకుంటున్నారంటూ ఆటగాళ్లను ఉద్దేశించి యోగ్ రాజ్ సింగ్ ప్రశ్నించారు.

ఇదే సమయంలో.. తాజాగా ప్రకటించిన జట్టు విషయంలో సెలక్టర్ లను అభినందించాలని అనుకుంటున్నట్లు తెలిపిన యోగ్ రాజ్ సింగ్.. రోహిత్ కెప్టెన్ గా, శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారని అన్నారు. వరుసగా రెండు టెస్టు సిరీస్ ల ఫలితం తర్వాత బీసీసీఐ మరింత పటిష్టంగా జట్టును మారుస్తుందని తెలిపారు.

కాగా... ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ - ఏలో భారత్ తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. దీంతో... సిరీస్ ప్రారంభమైన తర్వాత రోజు ఫిబ్రవరి 20న భారత్ తన తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడనుంది. అనంతరం అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ పాకిస్థాన్ తో ఫిబ్రవరి 23న భారత్ తలపడనుంది.

ఇక మూడో మ్యాచ్ ను మార్చి 2న భారత్.. న్యూజిలాండ్ తో తలపడనుంచి. టీమిండియా ఆడే ఈ మూడు మ్యాచ్ లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి! వాస్తవానికి ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ.. పలు కారణాలతో భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనున్నాయి.