Begin typing your search above and press return to search.

60 కాదు.. 4.75 కోట్లే.. ధనశ్రీకి చాహల్ భరణం.. రేపు కోర్టు తీర్పు

కాగా, ఇటీవల ధనశ్రీకి చాహల్ రూ.60 కోట్ల భరణం ఇవ్వనున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ, అవి నిజం కాదని తేలింది.

By:  Tupaki Desk   |   19 March 2025 4:37 PM IST
60 కాదు.. 4.75 కోట్లే.. ధనశ్రీకి చాహల్ భరణం.. రేపు కోర్టు తీర్పు
X

అతి తక్కువ వన్డేల్లో 100 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డులకెక్కి.. టి20ల్లో మంచి స్పిన్నర్ గా పేరు తెచ్చుకుని. ఇప్పుడు టీమ్ ఇండియాలోకి ఎంపిక కాలేని పరిస్థితుల్లో ఉన్న మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక బంధం ముగిసింది. సరిగ్గా ఐదేళ్ల కిందట కొవిడ్ రోజుల్లో కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మను పెళ్లాడిన చాహల్ ఆమెతో కలిసి చేసిన రీల్స్ ఎంతో పాపులర్ అయ్యాయి.

ఐదేళ్ల కిందట అటు క్రికెట్ కెరీర్, ఇటు పర్సనల్ లైఫ్ అంతా బాగున్న దశలో చాహల్ టీమ్ ఇండియా రెగ్యులర్ సభ్యుడు. కానీ, ఇప్పుడు అంతా తారుమారైంది. టీమ్ ఇండియాలో చోటు కోల్పోవడమే కాదు.. భార్య ధనశ్రీతోనూ విడాకులు తీసుకుంటున్నాడు.

కాగా, ఇటీవల ధనశ్రీకి చాహల్ రూ.60 కోట్ల భరణం ఇవ్వనున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ, అవి నిజం కాదని తేలింది. రూ.4.75 కోట్లు ఇవ్వనున్నట్లు స్పష్టమైంది. చాహల్, ధన శ్రీ విడాకుల కోసం బాంబే హై కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే, ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ ను బాంబే హైకోర్టు మినహాయించింది. ఈ విడాకుల పిటిషన్‌ పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి అంగీకరించిన చాహల్ రూ.2.37 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. కూలింగ్‌ పీరియడ్‌ పిటిషన్‌ ను తోసిపుచ్చినందున భరణం కింద చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొంది.

చాహల్ ఈ నెల 22నుంచి జరిగే ఐపీఎల్ లో పాల్గొనాల్సి ఉంది. అందుకే చాహల్ - ధనశ్రీ విడాకుల పిటిషన్ పై గురువారంలోగా తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును బొంబాయి హైకోర్టు ఆదేశించింది. కూలింగ్ ఆఫ్ వ్యవధిని మినహాయించాలన్న పిటిషన్ ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా.. ఆ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.