Begin typing your search above and press return to search.

క్రీడా రంగంలో మరో విడాకులు?.. భార్య ఫొటోలు డిలీట్ కొట్టిన క్రికెటర్!

ఇప్పుడు భార్యతో లేదా భర్తతో విడిపోతుంటే ఆ విషయాన్ని పరోక్షంగా తెలియజేసే విధానం అదే కదా..?

By:  Tupaki Desk   |   4 Jan 2025 4:30 PM GMT
క్రీడా రంగంలో మరో విడాకులు?.. భార్య ఫొటోలు డిలీట్ కొట్టిన క్రికెటర్!
X

శిఖర్ ధావన్-ఆయేషా ముఖర్జీ.. సానియా మీర్జా-షోయబ్ మాలిక్.. ఇవీ నిరుడు విడిపోయిన క్రీడా జంటలు.. ఇదే బాటలో మరో క్రికెటర్ కూడా నడవనున్నారా..? సోషల్ మీడియాలో ఎంతో హుషారుగా ఉండే అతడు చేసిన చర్యను చూస్తే ఈ విషయం తెలిసిపోతోంది. ఇప్పుడు భార్యతో లేదా భర్తతో విడిపోతుంటే ఆ విషయాన్ని పరోక్షంగా తెలియజేసే విధానం అదే కదా..?

డాక్టర్, కొరియోగ్రాఫర్

దంత వైద్యురాలు, కొరియోగ్రాఫర్.. ముంబైకి చెందిన ధనశ్రీ నేపథ్యం ఇది. ఈమె వద్దకు డ్యాన్స్ కోచింగ్ కు వెళ్లాడు టీమ్ ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్. హరియాణకు చెందిన చాహల్ 2017-18 నుంచి భారత జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. మణికట్టు స్నిన్నర్ అయిన అతడు కొన్ని మ్యాచ్ లలో గెలిపించే ప్రదర్శన చేశాడు. ధనశ్రీతో పరిచయం ప్రేమగా మారి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కొవిడ్ లాక్ డౌన్ సమయంలో 2020లో ఓ ఇంటివారయ్యారు.

సోషల్ మీడియాలో చురుకు..

ధనశ్రీ-చాహల్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌. పలు ప్రదేశాలకు వెళ్లి రీల్స్ చేస్తుంటారు. వాటిని పోస్ట్ చేస్తుంటారు. అలాంటిది వీరు నాలుగేళ్లకే విడిపోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి కథనాలు వస్తే చాహల్ ఖండించాడు. అయితే, మళ్లీ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించాడు. దీంతో విడాకుల అంశం వైరల్ అయింది.

ఈసారి కచ్చితం..

చాహల్ –ధనశ్రీ ఈసారి కచ్చితంగా విడాకులకు సిద్ధం అవుతున్నారంటూ ఇటీవల కొంతకాలంగా గట్టిగా ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి సాక్ష్యంగా ఇన్‌ స్టాలో పరస్పరం అన్‌ ఫాలో చేసుకున్నారు. ముందుగా చాహల్‌ తన ఖాతా నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించాడు. ఇక ధనశ్రీ కూడా చాహల్‌ ను ఇన్‌ స్టాలో అన్‌ ఫాలో మాత్రమే చేసింది. అతడితో ఉన్న ఫొటోలను మాత్రం తీసివేయకపోవడం గమనార్హం. వారు కచ్చితంగా విడిపోతున్నారు. కాకపోతే అధికారిక ప్రకటనకు సమయం పడుతుంది అని తెలిసినవారు అంటున్నారు. కచ్చితమైన కారణాలు మాత్రం తెలీదంటున్నారు.