Begin typing your search above and press return to search.

వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తారా ?

అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ నుంచి సీనియర్ అధికారి ఉంటారు.

By:  Tupaki Desk   |   5 Oct 2024 2:30 AM GMT
వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తారా ?
X

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇష్యూ మీద దేశ అత్యున్నత న్యాయస్థానం ఇపుడు ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేస్తూ తీర్పు ఇచ్చింది దాని ప్రకారం ఐదుగురు సభ్యులతో సీబీఐ ఆధ్వర్యంలో కొత్తగా సిట్ ని ఏర్పాటు చేసి విచారించాలని స్పష్టం చేసింది.

ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు. అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ నుంచి సీనియర్ అధికారి ఉంటారు. ఈ కొత్త సిట్ ఎపుడు కాన్సిట్యూట్ అవుతుంది అన్నది ఇంకా తెలియలేదు. అది ఒకసారి ఏర్పాటు అయిన తరువాత నిర్దిష్ట కాల పరిమితి విధిచి లడ్డూల వ్యవహారాన్ని సీరియస్ గా దర్యాప్తు చేయించాలని కూడా కోరవచ్చు.

లడ్డూ ఇష్యూ సెన్సిటివ్ గా ఉంది. అంతే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ భక్త కోటి ఈ విషయంలో ఎదురుచూస్తున్నారు. దాంతో వీలైనంత తక్కువ టైం నే పెట్టి నివేదిక తీసుకుంటారు అని అంటున్నారు. అయితే కొత్తగా ఏర్పాటు అయితే సిట్ ఏమి చేస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది.

సిట్ ముందు కొన్ని అంశాలు ఉన్నాయి. పాత అయిదేళ్లలో వైసీపీ జమానాలో శ్రీవారి ఆలయంలో అపచారాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. అలాగే గతంలో ప్రసాదంలో నాణ్యత తగ్గిందని అందువల్ల కల్తీ జరిగింది అని అంటోంది. వీటి మీద విచారణ జరపాల్సి ఉంది అంతే కాదు గత టీడీపీ చైర్మన్లుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి. అలాగే భూమన కరుణాకరరెడ్డిలను విచారించే అవకాశం ఉంది. ఇక గతంలో ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డిని విచారిస్తుంది అని అంటున్నారు.

ఇక తమిళనాడు దిండిగల్ కి చెందిన ఏఆర్ డైరీస్ అతి తక్కువ ధరకు కోట్ చేసి కేవలం 320 కే నెయ్యిని ఎలా సరఫరా చేసింది అన్నదే ప్రధాన ఆరోపణ. తక్కువ రేటుకు ఇస్తున్నారు అంటే కల్తీవే జరిగి ఉంటుంది అన్నది ఒక తర్కానికి అందుతున్న మాట. పైగా ఏఆర్ డైరీస్ కోసం రూల్స్ ని కూడా మార్చేశారు. వారిని అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు అని టీడీపీ అంటోంది

ఇదంతా వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉండగా జరిగింది అని అంటున్నారు. ఆయన వైసీపీ అయిదేళ్ళ కాలంలో నాలుగేళ్ల పాటు చైర్మన్ గా రెండు విడతలుగా ఉన్నారు. ఇక ఆయన తరువాత కేవలం పది నెలలు మాత్రమే భూమన కరుణాకరరెడ్డి ఉన్నారు

అయితే తన హయాంలో ఏఆర్ డైరీ సరఫరా చేయలేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టంగా చెబుతు న్నారు. అంతే కాదు తమ హయాంలో కల్తీ ఎక్కడా జరగలేదు అని కూడా భూమన కచ్చితంగా చెబుతున్నారు. అయినా సరే సిట్ తన విచారణలో భాగంగా వీరిని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే ప్రస్తుత ఈవోని కూడా ప్రశ్నించాలని అదే విధంగా సీఎం హోదాలో చంద్రబాబు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు అన్నది కూడా వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న. అందువల్ల సిట్ ఎవరిని విచారిస్తుంది అన్నది మాత్రం ప్రచారంగానే ఉంది. మరో వైపు చూస్తే గత అయిదేళ్లలో కల్తీ జరిగింది అన్నది సిట్ కి నిరూపించడం ఒకింత కష్టసాధ్యమే అని అంటున్నారు

ఆ సరుకులు ఉండవు. ఆ నెయ్యి ట్యాంకర్లు లేవు లడ్డూలు లేవు. అందువల్ల అది ఎలా నిరూపిస్తారు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న విషయమే. ఏది ఏమైనా ఈ వ్యవహారం అంతా రాజకీయ రంగు పులుముకున్న వేళ తొందరలో ఏర్పాటు కానున్న సిట్ విచారణ ఏ విధంగా సాగుతుంది అన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది.