బాబాయ్ ని హర్ట్ చేస్తున్న ఫిరాయింపులు...!
ఆయన జగన్ కి బాబాయ్. సీనియర్ మోస్ట్ లీడర్. రాజకీయంగా తల పండిన వారు. సమస్యలను కూడా పూర్తి శ్రద్ధ పెట్టి వింటారు.
By: Tupaki Desk | 29 Dec 2023 11:30 AM GMTఆయన జగన్ కి బాబాయ్. సీనియర్ మోస్ట్ లీడర్. రాజకీయంగా తల పండిన వారు. సమస్యలను కూడా పూర్తి శ్రద్ధ పెట్టి వింటారు. అందరికీ అవకాశం ఇస్తారు. ఆయనే వైవీ సుబ్బారెడ్డి. ఆయన కీలకమైన విశాఖ జిల్లాకు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్నారు. వైవీ వచ్చాక చాలా మార్పు చేర్పులు చేశారు. ఇక కొందరు నేతలకు పదవులు కూడా ఇప్పించారు.
అందులో విశాఖ తూర్పు నుంచి వంశీ క్రిష్ణ శ్రీనివాస్. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో ఎమ్మెల్సీ విషయంలో విశాఖలో చాలా మంది నేతల మధ్య పోటీ ఉన్నా పట్టు బట్టి మరీ వంశీకి ఎమ్మెల్సీ పదవి దక్కెలా చూసుకున్నారు. అయితే వంశీ జనసేనలోకి వెళ్ళిపోవడం పట్ల వైవీ సుబ్బారెడ్డి హర్ట్ అయినట్లుగా కనిపించారు.
మరి దీని మీద ఆయన హై కమాండ్ కి ఏవిధంగా జవాబు చెప్పుకున్నారో తెలియదు కానీ వంశీని పార్టీ ఆదరించి పదవి కట్టబెట్టినా పార్టీని వీడిపోవడం బాధాకరం అన్నారు. ఆయన ఎందుకు వెళ్లారు అన్న దానికి తన దగ్గర జవాబు లేదని ఆయనే చెప్పాలని వైవీ అంటున్నారు. అంతకు మించి తాను ఏ కామెంట్స్ చేయదలచుకోలేదని అన్నారు.
దీనితో పాటు మరో విషయం కూడా ఆయన్ని కొద్ది నెలల క్రితం హర్ట్ చేసింది. పంచకర్ల రమేష్ బాబు ని వైసీపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ చేయడంతో వైవీ కీలకంగా వ్యవహరించారు. ఆయన కూడా పార్టీలో వైవీతో బాగానే ఉండేవారు. అయితే ఆయన కొద్ది నెలల క్రితం వైసీపీని పార్టీ ప్రెసిడెంట్ పదవిని వదిలి మరీ జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. అపుడు కూడా వైవీ హర్ట్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ రమేష్ ఇలా చేస్తారని అనుకోలేదని అన్నారు.
మొత్తానికి చూస్తే విశాఖ జిల్లా వైసీపీ రాజకీయాలను చక్కదిద్దాలని ఏడు పదుల వయసులో వైవీ కష్టపడుతున్నారు. కానీ ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయన పార్టీ ఇంచార్జి అయ్యాక విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు అయింది. కీలక నేతలు ఫిరాయిస్తున్నారు. ఎన్నికల వేళ ఇది ఒక రకంగా ట్రబుల్ ఇస్తోంది.
విశాఖ జిల్లా పొలిటికల్ గా వైసీపీకి చాలా ఇంపార్టెంట్ గా ఉంది. గతంలో ఈ జిల్లా నుంచే జయ జయ ద్వానాలు వినిపించాయి. ఇపుడు సీన్ మారుతోంది. అయినా సరే పార్టీ డెసిషన్ కీలకం అని వైవీ అంటున్నారు. ఎవరు వెళ్ళినా పార్టీ లైన్ మారదని ఆయన స్పష్టం చేస్తున్నారు.
తాను పార్టీ ఇబ్బంది పడుతున్న చోటనే ఇంచార్జిలను మారుస్తున్నామని ఆయన అంటున్నారు. వై నాట్ 175 స్లోగన్ అన్నదే తమ విధానంగా ఉందని ఈ విషయంలో ఎవరైనా బాధపడి పార్టీ మారితే చేసేది ఏమీ లేదని కూడా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే వైవీని హర్ట్ చేస్తున్నాయి ఫిరాయింపులు. మరో వైపు చూస్తే అటు పంచకర్ల ఇటు వంశీ విశాఖ వైసీపీని టార్గెట్ చేశారు. ఫ్యూచర్ లో మరిన్ని చేరికలు జనసేనలో ఉంటాయని అంటున్నారు.
మరి ఆ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకుని వైవీ సహా ఇతర సీనియర్ నేతలు విశాఖ వైసీపీని క్లోజ్ మానిటరింగ్ చేస్తూ అసంతృప్తులను దారికి తెచ్చి పరిస్థితిని చక్కదిద్దుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.