Begin typing your search above and press return to search.

జగన్ మీటింగులో వైవీ సుబ్బారెడ్డి లేరా ?

వైసీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత జగన్ తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో పెట్టిన మీటింగులో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కనిపించలేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   20 July 2024 2:30 PM GMT
జగన్ మీటింగులో వైవీ సుబ్బారెడ్డి లేరా ?
X

వైసీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత జగన్ తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో పెట్టిన మీటింగులో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కనిపించలేదని అంటున్నారు. ఆయన కీలక స్థానంలో ఉన్నారు. మరి ఎందుకు మీటింగ్ కి అటెండ్ కాలేదు అన్న చర్చ అపుడే మొదలైంది.


లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో 11 మంది వైసీపీకి ఎంపీలు ఉన్నారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. జగన్ నిర్వహించిన ఈ కీలక సమావేశానికి ఆయన కూడా రావాల్సి ఉంటుంది కదా అని అంటున్నారు.


అదే సమయంలో ఏపీలో వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు హత్యా రాజకీయాల మీద పార్లమెంట్ లో గళమెత్తాలని జగన్ తన పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఏపీ చంద్రబాబు సీఎం అయ్యాక లా అండ్ ఆర్డర్ ఇబ్బందిలో పడిదని వైసీపీ వారి మీద ఎటాక్స్ బాగా పెరిగిపోయాయని జగన్ అంటూ ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాలని కోరారు.

దాని కోసం లోక్ సభ, రాజ్యసభలలో సమయం తీసుకుని మరీ పార్టీ ఎంపీలు మాట్లాడాలని జగన్ సూచించారు. ఇంత కీలకంగా నిర్వహించిన ఈ మీటింగ్ కి ఒక్క వైవీ సుబ్బారెడ్డితో పాటు పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకట రమణ తదితరులు హాజరు కాలేదు. లోక్ సభ సభ్యులు మొత్తం నలుగురు హాజరయ్యారు. రాజ్యసభలో మాత్రం పదకొండు మంది ఎంపీలు ఉంటే ఆరుగురు హాజరు అయ్యారు.

అందరి కంటే ఎక్కువగా వైవీ సుబ్బారెడ్డి ఎందుకు రాలేదు అన్న దాని మీదనే చర్చ సాగుతోంది. ఆయన ముందస్తుగా రాలేనని చెప్పి వెళ్ళారా లేక కావాలని రాలేదా అన్న దాని మీదనే అంతా చర్చినుకుంటున్నారు. వైసీపీకి ఇపుడు బలం అంతా రాజ్యసభలోనే ఉంది. వైసీపీ రాజకీయంగా ఏ మాత్రం పావులు కదపాలన్నా కూడా అక్కడ నుంచే మూవ్ చేయాల్సి ఉంటుంది. అటువంటిది వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభ ఎంపీగా ఉన్న వైవీ ఈ మీటింగులో కనిపించకపోవడం అంటే ఏమి జరిగి ఉంటుంది అన్నదే అంతా అలోచిస్తున్నారు.

మరో వైపు వైసీపీ నుంచి నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీలో చేరుతారు అన్న వార్తలు వచ్చాయి. అయితే అలా ప్రచారం జరుగుతున్న వారిలో ఆర్ క్రిష్ణయ్య గొల్ల బాబూరావు ఈ సమావేశంలో కనిపించడం విశేషం. ఏది ఏమైనా అందరి కళ్ళూ వైసీపీ ఎంపీల మీట్ మీద ఉంది. మొత్తం 15 మంది ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు ఉంటే 5 గురు గైర్ హాజరు కావడం మాత్రం ఈ సమయంలో కొత్త చర్చకు దారి తీస్తోంది అనే అంటున్నారు.