Begin typing your search above and press return to search.

రాయబారం లేదు...షర్మిలతో ఇబ్బంది లేదు...బాబాయ్ క్లారిటీ...!

ఇక దీని మీద వైసీపీలో కలవరం రేగి కుటుంబ పెద్దగా ఉన్న జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని షర్మిల వద్దకు రాయబారానికి పంపించారని కూడా ప్రచారం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 12:26 PM GMT
రాయబారం లేదు...షర్మిలతో ఇబ్బంది లేదు...బాబాయ్ క్లారిటీ...!
X

వైఎస్ షర్మిల ఇపుడు ఏపీ రాజకీయాల వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఆమె తొందరలోనే కాంగ్రెస్ లో చేరుతారు ఆమెకు ఏపీసీసీ చీఫ్ పదవి ఇస్తారని అంటున్నారు. దాని అర్ధం ఆమె వైసీపీకి పోటీగా అన్నకు ఎదురు వెళ్తారనే అంటున్నారు. మరి ఒకే ఫ్యామిలీ అన్నా చెల్లెలు ఎదురు నిలిచి రాజకీయ సమరం చేసే సన్నివేశం ఏపీలో 2024లో చూస్తారా అని అంతా అనుకునే పరిస్థితి.

ఇక టీడీపీ అనుకూల మీడియా అయితే వైఎస్ షర్మిల వల్ల వైసీపీకి దెబ్బ పడుతుందని ప్రచారం చేస్తోంది. ఇక దీని మీద వైసీపీలో కలవరం రేగి కుటుంబ పెద్దగా ఉన్న జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని షర్మిల వద్దకు రాయబారానికి పంపించారని కూడా ప్రచారం చేస్తున్నారు.

దీని మీద వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు. తామంతా ఒకే కుటుంబం అని అన్నారు. కుటుంబ సభ్యుడిగా తాను వైఎస్ విజయమ్మ వద్దకు వెళ్లాను తప్ప అందులో రాజకీయం ఏమీ లేదని, రాయబారాలు అంతకంటే లేవని స్పష్టం చేశారు. ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరే విషయం కూడా తన వద్ద సమాచారం లేదని సుబ్బారెడ్డి చెప్పారు.

రాజకీయాల్లో చూస్తే ఎవరైనా ఏ పార్టీలో అయినా చేరవచ్చు అని ఆయన అంటున్నారు. దాని వల్ల వైసీపీకి ఇబ్బంది ఏ మాత్రం లేదని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ ప్రజలను నమ్ముకున్నారని ఆయన అంటున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరినా వైసీపీకి నష్టం లేదని ఆయన అంటున్నారు. ఆ మాటకు వస్తే తెలంగాణా ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరుతుందని వార్తలు వచ్చాయని అన్నారు.

ఏది ఏమైనా కూడా వైఎస్ షర్మిల రాజకీయాలను కాంగ్రెస్ లో ఆమె చేరికను బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి లైట్ తీసుకున్నారు. మరి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా కీలకం కాబట్టి వైసీపీ కూడా అలాగే షర్మిల ఏపీ రాజకీయాన్ని చూస్తోందని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ ఇంచార్జిలను మారుస్తోంది, అదే టైం లో టికెట్ రాదని తెలిసిన వారు అంతా కూడా రాజీనామాలు చేస్తున్నారు.

ఇదే వరసలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. దాడి రాజీనామా మీద కూడా వైవీ సుబ్బారెడ్డి రియాక్ట్ అయ్యారు. అనకాపల్లిలో ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని అందుకే పార్టీకి దూరం అవుతూండవవచ్చు అని విశ్లేషించారు. ఎవరు పార్టీని వీడి బయటకు వెళ్లినా వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు.

పార్టీలో మార్పుచేర్పుల గురించి చర్చిస్తున్నామని, టికెట్ రాని వారి గురించి కూడా పిలిచి మాట్లాడుతున్నామని నచ్చ చెబుతున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆ మీదట వారి ఇష్టమన్నట్లుగా మాట్లాడారు. ఇక ఎన్నికల వేళ పార్టీలు మారడం సాధారణ విషయంగా కొట్టి పారేశారు.