రూ.401 కోట్ల జీఎస్టీ బకాయి నోటీసుపై జొమాటో ఆన్సర్ తెలిస్తే షాకే
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో నుంచి వచ్చిన సమాధానాన్ని చూసిన జీఎస్టీ అధికారులు సైతం ఆశ్చర్యానికి గురి అవుతున్నట్లు చెబుతున్నారు
By: Tupaki Desk | 28 Dec 2023 11:30 PM GMTప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో నుంచి వచ్చిన సమాధానాన్ని చూసిన జీఎస్టీ అధికారులు సైతం ఆశ్చర్యానికి గురి అవుతున్నట్లు చెబుతున్నారు. డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ చెల్లించాలంటూ సదరు కంపెనీకి నోటీసులు జారీ చేశారు. మొత్తంగా రూ.401 కోట్ల భారీమొత్తం జీఎస్టీ కింద పే చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై సదరు యాప్ యాజమాన్యం స్పందించింది.
''మా వైపు నుంచి ఎలాంటి పన్ను బకాయిలు లేవు. డెలివరీ భాగస్వాముల తరఫున మేం డెలివరీ ఛార్జీలు వసూలు చేశాం. వినియోగదారుల నుంచి నేరుగా డెలివరీ సేవల్ని అందించలేదు. పరస్పర ఆమోదంతో కుదుర్చుకున్న నిబంధనల ప్రకారం డెలివరీ భాగస్వాములే'' అన్న వాదనలు వినిపించటమేకాదు.. తాము ఎలాంటి బకాయిలు లేవన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది.
అయితే.. జొమాటోలో ఎవరైనా వినియోగదారుడు ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బిల్లులో మూడు అంశాలు కలిగి ఉంటాయని చెబుతున్నారు. అందులో ఫుడ్ ధర ఒకటైతే.. మరొకటి ఫుడ్ డెలివరీ ఛార్జీలు.. సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. కానీ.. జొమాటా వాదన మాత్రం వేరుగా ఉంది. అయితే.. ఈ పన్నును జీఎస్టీ మండలి 2022 నుంచి అమలు చేస్తోందని చెబుతోంది. సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఈ మొత్తం మొత్తం వినహాయింపు ఉంటుందని చెబుతోంది. మరి.. జొమాటో ఇచ్చిన సమాధానంపై జీఎస్టీ అధికారులు రియాక్టు కావాల్సి ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.